పరిహారం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తా: వైఎస్ జగన్ | YS JAGAN MOHAN REDDY visits krishna district | Sakshi
Sakshi News home page

పరిహారం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తా: వైఎస్ జగన్

Published Sat, Jul 4 2015 6:55 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

పరిహారం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తా: వైఎస్ జగన్ - Sakshi

పరిహారం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తా: వైఎస్ జగన్

విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. విజయవాడ ఊర్మిళానగర్లో విద్యుత్ షాక్ తో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. విద్యుత్ ప్రమాదం ఘటనలో మృతిచెందిన సుబ్బారెడ్డి భార్య చిన్నక్క, తిరుపతి రెడ్డి భార్య రాధమ్మలను వైఎస్ జగన్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబానికి ఓ ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో విద్యుత్ శాఖపై న్యాయ పోరాటం చేస్తానంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్ జగన్ నగరానికి బయలుదేరతారు. ఇటీవలే నిర్మాణంలో ఉన్న భవనం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఐదుగురు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement