ప్రజాసంకల్పయాత్రలో మరో మైలు రాయి | Ys Jagan Praja Sankalpayatra Reaches 2100-kms Milestone | Sakshi
Sakshi News home page

Published Tue, May 22 2018 7:30 PM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

Ys Jagan Praja Sankalpayatra Reaches 2100-kms Milestone - Sakshi

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర, వేప మొక్కను నాటుతున్న జననేత (ఇన్‌సెట్‌లో)

సాక్షి, తాడేపల్లిగూడెం: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కును సాధించుకోవాలి.  ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం దక్కేలా చూడాలి.  ప్రతి పేద బిడ్డా గొప్పగా చదవి పెద్దవాడిగా ఎదగాలి.  రైతన్నకు వ్యవసాయం పండుగ కావాలి. బడుగు బలహీన వర్గాలకు భరోసా కల్పించాలి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోవాలి. ఇదే నా కసి’  అంటూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దృఢమైన సంకల్పంతో ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో మరో మైలురాయి నమోదైంది. 

ప్రజాసంకల్పయాత్ర @2100 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర వద్ద వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2100 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా పిప్పరలో ఈ మైలురాయికి గుర్తుగా జననేత వేప మొక్కను నాటారు. 168వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ మంగళవారం తాడేపల్లిగూడెం మార్కెట్‌, పెంటపాడు, బోడపాడు క్రాస్‌ రోడ్డు, కాశిపాడు రోడ్డు, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్‌ రోడ్డు మీదుగా పిప్పర వరకు పాదయాత్రను కొనసాగించారు. జననేత పాదయాత్రకు ప్రజలు, పార్టీకార్యకర్తలు, వైఎస్‌ఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.  

♦ కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు 
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017) 

 పాదయాత్రలోని ప్రతి మైలురాయికి గుర్తుగా జననేత వైఎస్‌ జగన్‌ మొక్కను నాటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement