
సాక్షి, నరసాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నరసపారం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం నరసాపురం శివారు నుంచి 177వ రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చిట్టివరం క్రాస్, రాజోల్ క్రాస్, దిగమర్రు, పెద్ద గరువు క్రాస్ చేరుకుని రాజన్న బిడ్డ భోజన విరామం తీసుకుంటారు.
విరామం అనంతరం పాలకొల్లు, ఉల్లంపూరు వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment