దీక్షకు పయనమైన విజయనగరం శ్రేణులు
పెద్ద ఎత్తున తరలివెళ్తున్న నాయకులు
చంద్రబాబు మోసాన్ని ఎండగడతామన్న కోలగట్ల
వైఎస్‌ఆర్ సీపీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. ప్రజలకు అండగా ఉండేందుకు తమ పార్టీ అధ్యక్షుడు రెండు రోజుల పాటు సమర దీక్ష చేపడుతుండడంతో ఆ దీక్షలో తాము భాగస్వాములం కావాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం జిల్లా నుంచి పెద్ద ఎత్తున మంగళగిరికి బయలు దేరారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివెళ్లారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబానాయుడు మోసాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో 3,4వ తేదీల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సమర దీక్షకు జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. రెండు రోజులు పాటు అక్కడే ఉండి వైఎస్ జగన్ చేపట్టే దీక్షల్లో పాల్గోనున్నారు. దాదాపు అన్నీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా కొందరు, బస్సులు, రైళ్ల ద్వారా మరికొందరు పయనమయ్యారు.
విజయనగరం నియోజకవర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, మామిడి అప్పలనాయుడు, సంగిరెడ్డి బంగారునాయుడు, బాలబ్రహ్మారెడ్డి, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్‌బాబు, అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమల్ల వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బెల్లాన చంద్రశేఖర్, కె.వి.సూర్యనారాయణరాజు, పార్వతీపురం నియోజకవర్గం నుంచి జమ్మాన ప్రసన్నకుమార్, గర్బాపు ఉదయభాను, మజ్జి వెంకటేష్, కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, గజపతినగరం నియోజకవర్గం నుంచి కడుబండి రమేష్ , పీరుబండి జైహింద్‌కుమార్,బి.వెంకటరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. అలాగే, బొబ్బిలి, సాలూరు ఎమ్మెల్యేలు అక్కడే ఉండటంతో వారి అనుచరవర్గమంతా ఇక్కడి నుంచి ఎవరికి వారు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇక, ఎస్‌కోట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఇక, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ బుధవారం బయలుదేరి వెళ్లనున్నారు.
చంద్రబాబు నైజాన్ని ఎండగడతాం: కోలగట్ల
జిల్లా నాయకులతో పాటు విజయనగరం పట్టణ నేతలు మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేసిన నైజాన్ని ఎండగట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రాజధాని పేరుతో రైతుల నయవంచన తదితర అంశాలపై సమర దీక్ష సాగుతుందన్నారు. మంగళగిరికి బయలు దేరిన వారిలో కోలగట్లతో పాటు కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు బాలబ్రహ్మారెడ్డి ఉన్నారు.
సమరోత్సాహం
Published Wed, Jun 3 2015 12:21 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement