Y S Jagan samara deeksha
-
’ముడుపులకోసమే పట్టిసీమ చేపట్టారు.’
-
ప్రత్యేక హోదాపై ఎందుకు నిలదీయరు?
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యే హోదా రానప్పుడు టీడీపీ ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు ఎందుకని నిలదీశారు. ప్రత్యేక హోదా అన్న పదం విభజన చట్టంలోకి చేర్చకముందే ఓటు వేసి రాష్ట్రాన్ని విడగొట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి 'వై' జంక్షన్ సమీపంలో బుధవారం వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని కోసం భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబుపై పోరాటానికి ఈ దీక్షే వేదికవుతుందన్నారు. -
బాబుకు ఎన్ని మార్కులిస్తారో మీ ఇష్టం
-
బాబుకు ఎన్ని మార్కులేస్తారో మీ ఇష్టం: వైఎస్ జగన్
మంగళగిరి: ప్రజా బ్యాలెట్ ద్వారా చంద్రబాబు పాలనకు మార్కులు వేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు సర్కారుకు ప్రజలే మార్కులు వేసే విధంగా ప్రజాబ్యాలెట్ రూపొందించామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి 'వై' జంక్షన్ సమీపంలో బుధవారం వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు. చంద్రబాబు ఏడాది పాలనపై 100 ప్రశ్నలతో తయారు చేసిన ప్రజా బ్యాలెట్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. బాబు సర్కారుకు ఎన్ని మార్కులు వేస్తారో ప్రజల ఇష్టమని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మార్కులు వేయాలని ప్రజలను కోరారు. -
ఆయనకు తప్ప...అందరికీ తెలుసు..
మంగళగిరి : 'మండుటెండను ఖాతరు చేయకుండా మంగళగిరిలో చేస్తున్న దీక్షకు విచ్చేసి... ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామన్న సంగతి ఇక్కడకు అశేషంగా విచ్చేసిన ఇన్ని వేలమంది దీక్షకు సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాలుపంచుకున్నది ఎందుకన్నది అందరికీ తెలుసు...అయితే ఒకే ఒక వ్యక్తికి మాత్రం తెలియదు. ఆ వ్యక్తి ఎవరూ అంటే చంద్రబాబు నాయుడు అన్న మాట వినిపిస్తోంది' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాను ఎందుకు దీక్ష చేస్తున్నానో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలుసు...కానీ చంద్రబాబుకి మాత్రం తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ జగన్ రెండు రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన మాటలు ఏమిటీ... ఎన్నికల తర్వాత చంద్రబాబు చేస్తున్నది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. రైతున్నలు చంద్రబాబు మాటలు నమ్మి ఓటు వేశారని అయితే అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను బాబు గాలికి వదిలేశారన్నారు. ప్రస్తుతం రైతన్నలు పడుతున్న అవస్థలు, అగచాట్లు అన్ని ఇన్నీ కావని, చివరకు వారు ఆత్మహత్యలు చేసుకునే వరకూ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలను పట్టపగలు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. -
వైఎస్ జగన్ సమర దీక్షపై ఏపీ సర్కార్ నిర్లక్ష్యం
గుంటూరు: ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజా గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపడుతున్న సమరదీక్షపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నా భద్రత కల్పించలేదు. కనీసం దీక్షాస్థలిలో కూడా పోలీసులు అందుబాటులో లేకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వస్తున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇప్పటికే దీక్షా స్థలికి బయలు దేరారు. -
సమరదీక్షకు బీసీలు తరలిరావాలి
పట్నంబజారు(గుంటూరు): ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజా గళం వినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సమరదీక్షకు బలహీన వర్గాలు మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్, వెనుకబడిన తరగతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పిలుపునిచ్చారు. సమరదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మంగళవారం గుంటూరులో విలేకర్లతో మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో వడ్డెర, వాల్మీకి, బెస్త కులాల వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని, బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్న మాటలు నీటిమీద రాతలుగా మిగిలిపోయాయని విమర్శించారు. బీసీల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, ఆయన చేపట్టిన సమరదీక్షను జయప్రదం చేసేందుకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. జగన్‌కు మద్దతుగా నిలుస్తామనే ఉద్దేశంతో టీడీపీ నేతలు, తనపై దాడులకు పాల్పడుతున్నారని, దీనిపై ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
బాబు మోసాలపై జగన్ సమరం
-
బాబు మోసాలపై జగన్ సమరం
⇒ నేటి నుంచి రెండు రోజులపాటు ప్రతిపక్ష నేత సమరదీక్ష ⇒ మంగళగిరి ‘వై’ జంక్షన్ ⇒ సమీపంలో సువిశాల దీక్షా శిబిరం ⇒ ప్రజలకు, కార్యకర్తలకు ⇒ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి చేపడుతున్న సమరదీక్షకు సర్వం సిద్ధమైంది. రెండు రోజుల పాటు సాగే సమరదీక్షకు గుంటూరు జిల్లా మంగళగిరి ‘వై’ జంక్షన్ సమీపంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద్రబాబు మోసాలపై ప్రజల్లో ఎండగట్టడంతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఈ దీక్ష చేపడుతున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సువిశాల ప్రదేశంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్ దీక్షను కొనసాగిస్తారు. ప్రధానంగా వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడం, ఇంటింటికీ ఉద్యోగం.. లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటను విస్మరించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలం కావడం, రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములను సమీకరించి వారి జీవితాలను బజారున పడేయడం వంటి కీలక అంశాలపై ఈ వేదిక ద్వారా సర్కారుపై సమర శంఖం పూరించనున్నారు. ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందీ జగన్ ఈ సమరదీక్షలో ఎండగట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగిస్తున్న వైనంపై వైఎస్సార్ సీపీ గత నవంబర్, డిసెంబర్ నెలల్లో మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించింది. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షలను పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం నాటి సమరదీక్ష కోసం జగన్మోహన్రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నేరుగా దీక్షాస్థలికి చేరుకుంటారని ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ తెలిపారు. తరలివచ్చిన అభిమానులు, నేతలు సమరదీక్ష ప్రారంభానికి ఒక రోజు ముందే మంగళగిరి పట్టణం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, వివిధ జిల్లాల నేతలతో నిండిపోయింది. రుణమాఫీ హామీని నమ్మి మోసపోయిన అనేక మంది రైతులు, నిరుద్యోగ భృతికి ఆశపడి ఓటు వేసిన నిరుద్యోగులు, రాజధాని నిర్మాణం పేరుతో భూములు కోల్పోయిన రైతులు, వ్యవసాయ కార్మికులు దీక్షా స్థలికి చేరుకున్నారు. దీక్షలో పాల్గొనేందుకు తమిళనాడులోని సేవాదళ్ సభ్యులు మంగళవారం చెన్నై నుంచి బయలు దేరారు. సేవాదళ్ తమిళనాడు ప్రధాన కార్యదర్శి మేడగం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి, అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డి నాయకత్వంలో పలు వాహనాల్లో చెన్నై మధురవాయల్ నుంచి బయలుదేరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మంగళగిరిలో స్థానికంగానే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇతర సీనియర్ నాయకులు సమరదీక్ష విజయానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్, సభాస్థలిలో తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు, మంచినీటి సౌకర్యం, అంబులెన్స్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కలవరంలో టీడీపీ: విజయసాయి రెడ్డి సమరదీక్షా శిబిరంలో జగన్మోహన్రెడ్డి ఏవిషయంపై మాట్లాడతారోనని టీడీపీ పాలకుల్లో కలవరం పుడుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏడాది పాలనలో వివిధ వర్గాల ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఎమ్మెల్సీ ఓటు కొనుగోలుకు టీడీపీ దిగజారుడు విధానాలపై జగన్ ప్రసంగిస్తారని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబు తీరు విడ్డూరం
‘రేవంత్’ ఎపిసోడ్ తరువాత కూడా నిజాయితీ గురించి మాటలా? వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ సమరదీక్ష విజయవంతం చేయాలని పిలుపు రాజమండ్రి : విజయవాడ నవనిర్మాణ దీక్షలో అవినీతి లేని ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామంటూ ప్రజలచేత ముఖ్యమంత్రి ప్రమాణం చేయించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఎద్దేవా చేశారు. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం వెలుగు చూసిన తరువాత కూడా బాబు నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతి గురించి చంద్రబాబు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ‘ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉండి, అభివృద్ధి చేయాల్సింది పోయి, నవనిర్మాణ దీక్షలు చేయడం విడ్డూరంగా ఉంది’ అని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ దాడిలో పట్టుబడిన సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. విజయవాడలో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ చంద్రబాబు నవనిర్మాణ దీక్షకు దిగారన్నారు. అధికారంలో ఉన్నవారు దీక్షలు చేయరని, వారికి కనువిప్పు కలిగించేందుకు ప్రతిపక్షాలు మాత్రమే దీక్షలు చేస్తాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటూ ఏకపక్షంగా పాలిస్తున్న చంద్రబాబు అభివృద్ధి చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరూ లేరని, అభివృద్ధి ముసుగులో పట్టిసీమ ఎత్తిపోతల పథకం, రాజధానిని ప్రైవేట్‌పరం చేస్తే మాత్రం పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో చంద్రబాబు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరిలో బుధ, గురువారాల్లో సమరదీక్ష చేస్తున్నారని జ్యోతుల వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కనువిప్పు కలిగిస్తారన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, నక్కా రాజబాబు, సంయుక్త కార్యదర్శి దంగేటి రాంబాబు, పార్టీ కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరిజాల వెంకట స్వామినాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మజ్జి నూకరత్నం, నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, లంకా సత్యనారాయణ, మోటూరి సాయి, భద్రి బాబ్జీ పాల్గొన్నారు. -
సమరోత్సాహం
దీక్షకు పయనమైన విజయనగరం శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్న నాయకులు చంద్రబాబు మోసాన్ని ఎండగడతామన్న కోలగట్ల వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో సమరోత్సాహం నెలకొంది. ప్రజలకు అండగా ఉండేందుకు తమ పార్టీ అధ్యక్షుడు రెండు రోజుల పాటు సమర దీక్ష చేపడుతుండడంతో ఆ దీక్షలో తాము భాగస్వాములం కావాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం జిల్లా నుంచి పెద్ద ఎత్తున మంగళగిరికి బయలు దేరారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలివెళ్లారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబానాయుడు మోసాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో 3,4వ తేదీల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న సమర దీక్షకు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. రెండు రోజులు పాటు అక్కడే ఉండి వైఎస్ జగన్ చేపట్టే దీక్షల్లో పాల్గోనున్నారు. దాదాపు అన్నీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా కొందరు, బస్సులు, రైళ్ల ద్వారా మరికొందరు పయనమయ్యారు. విజయనగరం నియోజకవర్గం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, మామిడి అప్పలనాయుడు, సంగిరెడ్డి బంగారునాయుడు, బాలబ్రహ్మారెడ్డి, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పెనుమత్స సాంబశివరాజు, డాక్టర్ సురేష్‌బాబు, అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమల్ల వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి బెల్లాన చంద్రశేఖర్, కె.వి.సూర్యనారాయణరాజు, పార్వతీపురం నియోజకవర్గం నుంచి జమ్మాన ప్రసన్నకుమార్, గర్బాపు ఉదయభాను, మజ్జి వెంకటేష్, కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, గజపతినగరం నియోజకవర్గం నుంచి కడుబండి రమేష్ , పీరుబండి జైహింద్‌కుమార్,బి.వెంకటరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లాయి. అలాగే, బొబ్బిలి, సాలూరు ఎమ్మెల్యేలు అక్కడే ఉండటంతో వారి అనుచరవర్గమంతా ఇక్కడి నుంచి ఎవరికి వారు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. ఇక, ఎస్‌కోట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఇక, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ బుధవారం బయలుదేరి వెళ్లనున్నారు. చంద్రబాబు నైజాన్ని ఎండగడతాం: కోలగట్ల జిల్లా నాయకులతో పాటు విజయనగరం పట్టణ నేతలు మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేసిన నైజాన్ని ఎండగట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రాజధాని పేరుతో రైతుల నయవంచన తదితర అంశాలపై సమర దీక్ష సాగుతుందన్నారు. మంగళగిరికి బయలు దేరిన వారిలో కోలగట్లతో పాటు కేంద్ర పాలక మండలి సభ్యులు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల శ్రీరాములనాయుడు, కె.వి.సూర్యనారాయణరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు బాలబ్రహ్మారెడ్డి ఉన్నారు. -
రేపే సమరదీక్ష..
విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు నియోజకవర్గాల వారీ సమావేశాలు. సమాయత్తమవుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు వెల్లడికానున్న బాబు మోసపూరిత విధానాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించనున్న రెండురోజుల సమరదీక్షకు పార్టీలోని అన్ని శ్రేణులు కలసి పనిచేస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళగిరి వై-జంక్షన్‌కు సమీపంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న సువిశాలమైన ప్రదేశంలో భూమి చదును చేసే కార్యక్రమం పూర్తికాగా, వేదిక నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు, మహిళలు, యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, నాయకులు సమరదీక్షకు రాను ండడంతో అందుకు అనుగుణంగా వేదికపై ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం దీక్షాస్థలంలో జరుగుతున్న పనులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే ఆర్కే , మా జీ మంత్రి , పశ్చిమ కృష్ణా పార్టీ అధ్యక్షులు కొలుసు పార్ధసారథి, సీనియర్ నేత సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ ఐటీ విభాగం కన్వీనరు చల్లా మధుసూదనరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కర్నాటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. నియోజకవర్గాల్లో సమావేశాలు... అదే విధంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏడాది పాలనలోని వైఫల్యాలను వివరించారు. ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్సార్ సీపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. -
రేపే సమరదీక్ష..
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించనున్న రెండురోజుల సమరదీక్షకు పార్టీలోని అన్ని శ్రేణులు కలసి పనిచేస్తున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళగిరి వై-జంక్షన్‌కు సమీపంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న సువిశాలమైన ప్రదేశంలో భూమి చదును చేసే కార్యక్రమం పూర్తికాగా, వేదిక నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు, మహిళలు, యువకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, నాయకులు సమరదీక్షకు రాను ండడంతో అందుకు అనుగుణంగా వేదికపై ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం దీక్షాస్థలంలో జరుగుతున్న పనులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే ఆర్కే , మా జీ మంత్రి , పశ్చిమ కృష్ణా పార్టీ అధ్యక్షులు కొలుసు పార్ధసారథి, సీనియర్ నేత సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం, పార్టీ ఐటీ విభాగం కన్వీనరు చల్లా మధుసూదనరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కర్నాటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. నియోజకవర్గాల్లో సమావేశాలు... అదే విధంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏడాది పాలనలోని వైఫల్యాలను వివరించారు. ఐదు ప్రధాన అంశాల్లో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ తెగబడిన విధానాన్ని వివరించారు. ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి వైఎస్సార్ సీపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించాలని, పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వెల్లడి చేయాలని కోరారు. గుంటూరు నగరంలో... గుంటూరులోని వైన్ డీలర్ల అసోసియేషన్ హాలులో జరిగిన గుంటూరు నగర కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. సత్తెనపల్లిలో... సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తదితరులు ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఇప్పటికే కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసి సమరదీక్ష విజయానికి అన్నివర్గాలు కదలిరావడమే కాకుండా బాబు మోసపూరిత విధానాలపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలని సూచించారు.