
ప్రత్యేక హోదాపై ఎందుకు నిలదీయరు?
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గట్టిగా నిలదీయడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యే హోదా రానప్పుడు టీడీపీ ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు ఎందుకని నిలదీశారు. ప్రత్యేక హోదా అన్న పదం విభజన చట్టంలోకి చేర్చకముందే ఓటు వేసి రాష్ట్రాన్ని విడగొట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి 'వై' జంక్షన్ సమీపంలో బుధవారం వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజధాని కోసం భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబుపై పోరాటానికి ఈ దీక్షే వేదికవుతుందన్నారు.