ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగోవ వర్థంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆయన వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ ప్రమాదం లో మరణించి నాలుగేళ్లయినా నిష్కల్మషమైన నవ్వుతో కూడిన ఆయన మోము జనం మనోఫలకాలపై చెక్కుచెదరకుం డా ఉంది. అందుకే భౌతికంగా ఈ లోకం నుంచి నిష్ర్కమించినా కోట్లాది హృదయాల్లో దైవసమానునిగా కొలువుదీరారు.
రాష్ట్రమంతటా మహానేత వైఎస్ వర్ధంతిని ఘనంగా జరుపుకొనేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు అన్న,వస్త్ర, రక్తదానాల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నారు. వైఎస్ పథకాలతో లబ్ధి పొందినవారంతా ఆయన లేని లోటును జ్ఞప్తికి తెచ్చుకుంటూ అనేక చోట్ల వైఎస్ ఫొటోలు పెట్టుకుని కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ వర్థంతి కార్యక్రమాలకు ఏర్పాట్లు
Published Mon, Sep 2 2013 8:19 AM | Last Updated on Sat, Jul 7 2018 3:36 PM
Advertisement
Advertisement