వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషి: షర్మిల
జహీరాబాద్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మనిషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల అన్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు అని అన్నారు. వైఎస్‌ఆర్ చనిపోయాక కాంగ్రెస్ కక్ష సాధింపులు మొదలుపెట్టిందన్నారు.
చనిపోయిన వ్యక్తి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం శోచనీయమని షర్మిల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరిస్తుంటే టీడీపీ, బీజేపీలు ఒక్కరోజు కూడా నిలదీయలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూనే వైఎస్‌ఆర్ ఒక్క పైసా పన్ను కూడా పెంచలేదని షర్మిల తెలిపారు.