రాజన్న సాక్షిగా రైతన్న పండగ | YS Rajashekar Reddy Birthday Celebrations In Vizianagaram District | Sakshi
Sakshi News home page

రాజన్న సాక్షిగా రైతన్న పండగ

Published Tue, Jul 9 2019 8:02 AM | Last Updated on Tue, Jul 9 2019 8:02 AM

YS Rajashekar Reddy Birthday Celebrations In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం : పట్టణాలు, పల్లెలకు సోమవారం పండగ వచ్చింది. మహానేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం, సీఎం వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి తొలి సంతకంతో పెంచిన పింఛన్లను జిల్లా అంతటా పంపిణీ చేయడంతో  పండగ వాతావరణ నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలోని అన్నివర్గాల పింఛన్‌ లబ్ధిదారులకు నెలకు 27 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం కేటాయించగా... వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సుమారు రూ.73 కోట్లు అంటే 46 కోట్లు  అధికంగా పింఛన్‌ సొమ్ము పంపిణీకి శ్రీకారం చుట్టింది. 

తొలిరోజు 35 శాతం పంపిణీ.. 
సాయంత్రం 6 గంటలకు తీసుకున్న నివేదిక ప్రకారం జిల్లాలో ఉన్న 3,05,618 మందిలో 35 శాతం అంటే 1,07,561 మందికి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. అత్యధిక శా తం బొండపల్లి మండలం 60.65 శాతం పంపిణీ నమోదయిం ది. మండలలో 7,214 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా 4,375 మందికి పింఛన్‌ చేతికి అందింది. అత్యల్పంగా రామభద్రపురంలో 10.14 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారు. జిల్లాలో 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థినులకు 200 సైకిళ్లు పంపిణీ చేశారు. 

వాడవాడలా వైఎస్సార్‌ జయంతి... 
వైఎస్సార్‌ జయంతి వాడవాడలా నిర్వహించారు. చీపురుపల్లి  మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని వైఎస్సార్‌ విగ్రహానికి రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛను డబ్బులు పంపిణీని ప్రారంభించారు. 

  • నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నాలుగు మండల కేంద్రాల్లో వైఎస్సార్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుతో పాటు వైఎస్సార్‌సీపీ నాలుగు మం డలాల అధ్యక్షులు చనమల్లు వెంకటరమణ, పతివాడ అప్పలనాయు డు, బంటుపల్లి వాసుదేవరావు, ఉప్పాడ సూర్యునారాయణరెడ్డి తది తరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లిమర్లలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. 
  • పార్వతీపురం నియోజకవర్గ పరిధి లోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో వైఎస్సార్‌ జయంతిని నిర్వహించారు. సీతానగరం, పార్వతీపురం మండలాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించగా, బలిజిపేట మండలంలో స్థానిక నాయకులు జయంతి వేడుకలు జరుపుకున్నారు. 
  • బొబ్బిలి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో  వైఎస్సార్‌ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు.  అనంతరం మరిశర్ల రామారావు ఆధ్వర్యంలో అమ్మిగారి కోనేటి గట్టు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించి సుమారు 150 మందికి స్కూల్‌బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులను అందజేశారు. బాడంగిలో వైఎస్సా ర్‌ సీపీ నాయకులు నాగిరెడ్డి విజయకుమారి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతి కార్యక్రమాలు జరిగాయి. 
  • ఎస్‌.కోట మండల కేంద్రం, వేపాడ  మండలంలో రాజన్న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌చేసి అభిమానులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. కొత్తవలస మండలం చీడివలసలో వైఎస్సార్‌ మండల యువజన సంఘ అధ్యక్షుడు లెంక వరహాలు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలువేసి జయంతి వేడుకలు నిర్వహించారు. వద్ధులకు పింఛన్లు పంపిణీచేశారు. అనంతరం కొత్తవలస జంక్షన్‌లో వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. 
  • విజయనగరం పట్టణంలోని 10వ వార్డు ఖమ్మవీధిలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పింఛన్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.  
  • సాలూరు పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్నదొర క్షీరాభిషేకం చేశారు. కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పాచిపెంట మండల కేంద్రంలోని సాలాపు వీధిలో  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, మాజి వైస్‌ ఎంపీపీ తట్టికాయల గౌరిశ్వరరావు తదితరులు కేక్‌ కట్‌ చేశారు.
  • గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలల వేసి నివాళులర్పించారు. జియ్యమ్మవలసలోని పెదమేరంగి కూడలిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి మండల కన్వీనర్‌ గౌరీశంకరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నివాళులర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement