Ministry of Urban Development
-
‘సైకిల్స్ ఫర్ చేంజ్’
సాక్షి, హైదరాబాద్ : నగరాల్లో పెరిగిపోతున్న వాయు, ధ్వని కాలుష్యాలను అరికట్టడం, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపర్చడం, జీవన ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘సైకిల్స్ ఫర్ చేంజ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 141 నగరాల్లో సైకిల్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతులను చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. ఈ మూడు నగరాల్లో మొదటి దశలో భాగంగా సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో సైకిళ్లు అద్దెకు ఇవ్వడం, ఒకచోట ఉన్న సైకిల్‌ను మరోచోటకు తీసుకువెళ్లి నిర్దేశిత ప్రదేశంలో వదిలివెళ్లే అవకాశం కల్పించడంలాంటి వెసులుబాట్లు కల్పిస్తారు. ప్రజలు సొంతంగా ఉపయోగించుకునే వాటితో పాటు, దాతల ద్వారా సేకరించే సైకిళ్లను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. 21లోగా దరఖాస్తు చేసుకోవాలి.. ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో భాగస్వామ్యమయ్యేందుకు ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దశలో ఎంపిక చేసిన నగరాలను వడపోసిన తర్వాత రెండో దశకు వెళ్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా చేపట్టే ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, స్మార్ట్ మిషన్‌లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించింది. సైక్లింగ్ ఫ్రెండ్లీ నగరాలను రూపొందించడం ద్వారా ప్రజల జీవన విధానాల్లో, ఆర్థిక ప్రమాణాల్లో పెద్దఎత్తున మార్పులు తీసుకురావచ్చని, కరోనా నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత నగరాల్లో 50–65 శాతం సైక్లింగ్ పెరిగిందని, వ్యక్తిగత రవాణా సౌకర్యం కింద సైక్లింగ్ ఉత్తమ మార్గమమని తెలిపింది. పాశ్చాత్య దేశాల్లో ప్రధాన నగరాల స్ఫూర్తితో సైక్లింగ్‌జోన్ల ఏర్పాటు, ప్రజల్లో అవగాహన కోసం వర్క్‌షాప్‌ల నిర్వహణలాంటి కార్యక్రమాలు ఈ చాలెంజ్‌లో భాగంగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. గొప్ప అవకాశం: బి.వినోద్‌కుమార్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం నగర ప్రజలు తమ జీవనశైలిని మార్చుకునేందుకు మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సైక్లింగ్ వల్ల కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యా తగ్గుతుంది. వీధులు శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి. శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
రాజన్న సాక్షిగా రైతన్న పండగ
సాక్షి, విజయనగరం : పట్టణాలు, పల్లెలకు సోమవారం పండగ వచ్చింది. మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం, సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి తొలి సంతకంతో పెంచిన పింఛన్లను జిల్లా అంతటా పంపిణీ చేయడంతో పండగ వాతావరణ నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలోని అన్నివర్గాల పింఛన్ లబ్ధిదారులకు నెలకు 27 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం కేటాయించగా... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు రూ.73 కోట్లు అంటే 46 కోట్లు అధికంగా పింఛన్ సొమ్ము పంపిణీకి శ్రీకారం చుట్టింది. తొలిరోజు 35 శాతం పంపిణీ.. సాయంత్రం 6 గంటలకు తీసుకున్న నివేదిక ప్రకారం జిల్లాలో ఉన్న 3,05,618 మందిలో 35 శాతం అంటే 1,07,561 మందికి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. అత్యధిక శా తం బొండపల్లి మండలం 60.65 శాతం పంపిణీ నమోదయిం ది. మండలలో 7,214 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా 4,375 మందికి పింఛన్ చేతికి అందింది. అత్యల్పంగా రామభద్రపురంలో 10.14 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారు. జిల్లాలో 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థినులకు 200 సైకిళ్లు పంపిణీ చేశారు. వాడవాడలా వైఎస్సార్ జయంతి... వైఎస్సార్ జయంతి వాడవాడలా నిర్వహించారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని వైఎస్సార్ విగ్రహానికి రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, పార్టీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛను డబ్బులు పంపిణీని ప్రారంభించారు. నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు నాలుగు మండల కేంద్రాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడుతో పాటు వైఎస్సార్సీపీ నాలుగు మం డలాల అధ్యక్షులు చనమల్లు వెంకటరమణ, పతివాడ అప్పలనాయు డు, బంటుపల్లి వాసుదేవరావు, ఉప్పాడ సూర్యునారాయణరెడ్డి తది తరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లిమర్లలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధి లోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. సీతానగరం, పార్వతీపురం మండలాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించగా, బలిజిపేట మండలంలో స్థానిక నాయకులు జయంతి వేడుకలు జరుపుకున్నారు. బొబ్బిలి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సావు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అనంతరం మరిశర్ల రామారావు ఆధ్వర్యంలో అమ్మిగారి కోనేటి గట్టు వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సుమారు 150 మందికి స్కూల్‌బ్యాగ్‌లు, పుస్తకాలు, పెన్నులను అందజేశారు. బాడంగిలో వైఎస్సా ర్ సీపీ నాయకులు నాగిరెడ్డి విజయకుమారి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఎస్.కోట మండల కేంద్రం, వేపాడ మండలంలో రాజన్న విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్‌చేసి అభిమానులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. కొత్తవలస మండలం చీడివలసలో వైఎస్సార్ మండల యువజన సంఘ అధ్యక్షుడు లెంక వరహాలు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి జయంతి వేడుకలు నిర్వహించారు. వద్ధులకు పింఛన్లు పంపిణీచేశారు. అనంతరం కొత్తవలస జంక్షన్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. విజయనగరం పట్టణంలోని 10వ వార్డు ఖమ్మవీధిలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పింఛన్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో పార్టీ విజయనగరం మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్నదొర క్షీరాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. పాచిపెంట మండల కేంద్రంలోని సాలాపు వీధిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, మాజి వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరిశ్వరరావు తదితరులు కేక్ కట్ చేశారు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలల వేసి నివాళులర్పించారు. జియ్యమ్మవలసలోని పెదమేరంగి కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మండల కన్వీనర్ గౌరీశంకరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నివాళులర్పించారు. -
స్మార్ట్ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశామంది. -
దేశంలో అత్యంత చెత్త నగరం ఏదో తెలుసా ?
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత చెత్తనగరం ఏదో తెలుసా..? దేశంలోని పది అత్యంత మురికినగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఇందులో ఐదు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. గురువారం విడుదల చేసిన ఈ చెత్త నగరాల జాబితాలో యూపీలోని గోండా ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానం మహారాష్ట్రలోని భుసావల్‌కు, బిహార్ రాష్ట్రం బగహా, యూపీలోని హర్దోయి నగరాలకు మూడు, నాలుగు స్థానాలు దక్కాయి. అపరిశుభ్ర నగరాల జాబితాలో యూపీలోని బహ్రాయిచ్ ఆరు, షాజహాన్‌పూర్ తొమ్మిది, ఖుర్జా పదో స్థానాల్లో ఉండగా బిహార్‌లోని కటిహార్ ఐదో స్థానంలో నిలిచింది. దీంతోపాటు పంజాబ్‌లోని ముక్తసర్‌కు ఏడో స్థానం, అబోహార్‌కు ఎనిమిదో స్థానం దక్కాయి. గురువారం విడుదల చేసిన స్వచ్ఛ నగరాల ర్యాంకుల్లో టాప్ 5లో ఇండోర్, భోపాల్, విశాఖపట్నం(వైజాగ్) సూరత్, మైసూరు ఉన్నాయి. తొలి 50 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు వైజాగ్(3), తిరుపతి (9), విజయవాడ(19), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(22), వరంగల్(28), సూర్యాపేట(30), తాడిపత్రి (31), నరసారావుపేట(40), కాకినాడ(43), తెనాలి(44), సిద్దిపేట(45), రాజమండ్రి (46) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. -
తాగునీటిపై ‘తోడేయండి’!
-
తాగునీటిపై ‘తోడేయండి’!
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా సేవా చార్జీల మోత మోగిపోనుంది. మంచినీటి, మురుగునీటి పారుదల సేవల చార్జీలు పెంచేయాల్సిందిగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది మరి! ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుధీర్ కృష్ణన్ ఇటీవలే లేఖ రాశారు. దేశంలో మంచినీటి, మురుగునీటి పారుదల సేవలకు వసూలు చేసే చార్జీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం అనంతరం ఆయన ఈ లేఖ రాశారు. చేస్తున్న వ్యయాన్ని రాబట్టుకోలేకపోతే పథకం మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అందులో హెచ్చరించారు. స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పథకాల వ్యయాన్ని పూర్తిగా రాబట్టుకోలేకపోయినా కనీసం అమలు, నిర్వహణ (ఓ అండ్ ఎం) వ్యయాలనైనా పూర్తిగా రాబట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అందులో రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలివీ... ప్రతి కనెక్షన్‌కూ విధిగా మీటర్లు ఏర్పాటు చేయాలి దేశంలోని మొత్తం 7,935 పట్టణాలు/నగరాల్లో కేవలం 5 పట్టణాలు మాత్రమే తాగునీటి సరఫరా వ్యయాన్ని చార్జీల రూపంలో పూర్తిగా వసూలు చేస్తున్నాయి. 16 నగరాల్లో 65 శాతం వసూలవుతోంది. మంచినీటి చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండేందుకు వీలుగా పురపాలక సేవల నియంత్రణ సంస్థ (మున్సిపల్ సర్వీస్ రెగ్యులేటర్ అథారిటీ)ని ఏర్పాటు చేసుకోండి మీటర్లు లేని చోట ఇంటి స్థల విస్తీర్ణం ఆధారంగా చార్జీలు వసూలు చేయండి. 100 చదరపు గజాల్లోపు విస్తీర్ణం, 900 చదరపు అడుగుల ఇల్లుంటే నెలకు రూ.60, 100-200 చ.గ.లోపు విస్తీర్ణం, 1,000 చ.అ. లోపు బిల్టప్ ఏరియా ఉంటే రూ.150, 200 చ.గ. కంటే ఎక్కువ విస్తీర్ణం, 1,500 చ.అ. లోపు బిల్టప్ ఏరియా ఉంటే రూ.250, 300 చ.గ. విస్తీర్ణంలో 1,500 చ.అ.. కంటే ఎక్కువ బిల్టప్ ఏరియా ఉంటే రూ.400 చొప్పున ప్రతి కనెక్షన్‌కూవసూలు చేయాలని స్పష్టం చేశారు. వాణిజ్య, పరిశ్రమలకైతే ఈ చార్జీలు మరీ అధికంగా ఉండాలని పేర్కొన్నారు. నీటి వాడకం ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు పెరిగితే మొత్తం వినియోగంపైనా అధిక చార్జీలను వసూలు చేయాలని తెలిపారు. ప్లాటు విస్తీర్ణం లాగే మంచినీటి కనెక్షన్ తీసుకున్న పైపు పరిమాణం ఆధారంగా కూడా చార్జీలు వసూలు చేయవచ్చన్నారు. 15 ఎంఎం కనెక్షన్‌కు నెలకు రూ. 50, 20 ఎంఎం అయితే రూ. 75 వసూలు చేసుకోవచ్చు. మురుగునీటి పారుదల సేవల చార్జీలను మంచినీటి చార్జీల్లో కనీసం 50 శాతం చొప్పున వసూలు చేయండి. వీటిని ఆస్తి పన్నులో భాగంగానే వసూలు చేస్తున్నారు. అలాకాకుండా విడిగా వసూలు చేయాలి నీటి చార్జీలు పెంచడం వల్ల పెరుగుతున్న మంచినీటి వినియోగాన్ని తగ్గించవచ్చు