![Government releases Rs 9940 crore to states for Smart Cities Mission - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/12/SMSRT-CITY.jpg.webp?itok=nuIVQ52P)
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశామంది.
Comments
Please login to add a commentAdd a comment