
సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూముల కోల్పోయిన బాధితులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి, పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ముఖాముఖి సమావేశమైయ్యారు. ల్యాండ్ పూలింగ్, రిజర్వ్ జోన్, స్పిడ్ యాక్సెస్ రోడ్ వల్ల భూములు కోల్పోయిన బాధితులు వైఎస్ షర్మిల వద్ద వారి కష్టాలను పంచుకున్నారు. రాజధాని పేరుతో తమ భూములను దోచుకోని టీడీపీ ప్రభుత్వం తమ బతుకులను నాశనం చేసిందని.. స్థానిక 29 గ్రామాలకు చెందిన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మిస్తే తమకు లాభం జరుగుతుందన్ని భావించామని, కానీ దానితోనే తమకు కష్టాలకు ప్రారంభమయ్యాయని షర్మిల వద్ద వాపోయారు.
పుష్కరాల పేరుతో ఇళ్లు కూడా తీసేయడంతో వేలమంది వీధులపాయ్యామని కన్నీరుమున్నీరయ్యారు. పుష్కరాల అనంతరం ఇళ్లు కట్టిస్తామని స్లిప్పులు ఇచ్చారని, కానీ ఇంతవరకు ఊసేలేదని బాధిత మహిళలు వైఎస్ షర్మిలతో వారి బాధలను పంచుకున్నారు. కరకట్ట మీద ఉన్న ఇళ్లని పూర్తిగా తొలగించారని, వైఎస్ జగన్ సీఎం అయితేనే తమకు న్యాయం జరుగుతుందని అక్కడికి వచ్చిన సీతానగరం గ్రామానికి చెందిన ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకిృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీ బుట్టా రేణుక, తదితరులు పాల్గొని.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
‘‘సీఎం అంటే అధికారం అనుభవింవడమే కాదు ప్రజలకు సేవ చేయడమే తన ధర్మం అనుకోవాలి. చంద్రబాబులా తాను ఏది చేయాలని అనుకుంటే అధి చేస్తాను అనుకోవడం దుర్మార్గం. చంద్రబాబు, వైఎస్ జగన్లను చూడండి.. మంచివారిని ఎన్నుకోండి. అధికారమే ముఖ్యం అనుకుంటే చంద్రబాబులా వైఎస్ జగన్ కూడా అబద్దాలు చెప్పేవారు కాదా?. జగన్ వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి, అబద్దాలు చెప్పని వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబుకు తన కొడుకు మేలు తప్ప ప్రజల మేలు అక్కర లేదు’ అని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.