చంద్రగిరిలో ప్రతిభా అవార్డుల ప్రదానం
ముఖ్యఅతిథిగా సీనియర్ పాత్రికేయులు జీవీడీ కృష్ణమోహన్
చంద్రగిరి: వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలు విద్యార్థుల పాలిట వరమని సీనియర్ పాత్రికేయులు జీవీడీ కృష్ణమోహన్ అన్నారు. చంద్రగిరిలోని పద్మావతి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించి, వారిలో పోటీతత్వం పెంచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పేరిట పురస్కారాలను విస్తృత స్థాయిలో ప్రదానం చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అభినందించారు. కార్పొరేట్, పెద్దపెద్ద పాఠశాలల్లోని విద్యార్థులు సుఖానికి అలవాటుపడి చదువుపై అశ్రద్ధ వహిస్తారన్నారు.
అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని జీవితంలో అనుకున్నది సాధిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి, కృష్ణమోహన్ పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన నాగతనూశ్రీకి కంప్యూటర్‌ను అందజేశారు. అనంతరం విద్యార్ధులకు ట్యాబ్‌లు, నిఘంటువులు అందజేశారు. అలాగే విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమ, తహశీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీవో వెంకటనారాయణ, వైఎస్‌ఆర్ సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు పార్లపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ పురస్కారాలు విద్యార్థులకు వరం
Published Tue, Feb 23 2016 1:06 AM | Last Updated on Tue, May 29 2018 7:26 PM
Advertisement
Advertisement