YSR Memorial Foundation
-
నక్షత్రానికో మొక్క.. రాశికో చెట్టు
పూర్వం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలతో కొన్ని జీవులు, నదులు, వృక్షాలను పూజించడంతో అవి ఎంతో పవిత్రతను సంతరించుకున్నాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో దేవతా వృక్షాలు, మొక్కలు గురించి వివరించారు. వాటి ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు వివరించేందుకు నల్లకాల్వ సమీపంలోని వైఎస్ఆర్ స్మృతివనంలో పవిత్ర వనం, నక్షత్ర వనాలు ఏర్పాటు చేశారు. అరుదైన వృక్షజాతులను కాపాడుతున్నారు. సీతమ్మ సేదదీరిన అశోక వృక్షం.. శ్రీరాముడి పత్ని సీతను అపహరించిన రావణాసురుడు లంకలోని అశోకవనంలో నిర్భందించిన సమయంలో జీవవైవిధ్యానికి ప్రతిరూపమైన అశోకవనంలో అశోక వృక్షం కిందనే సేదదీరారు. ఈ వృక్షాన్నే సరాక్ అశోకంగా కూడా చెబుతారు. ఈ అరుదై వృక్షం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉందని ఇంతవరకు అనుకునే వారు. కాని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమలలో కూడా కనిపిస్తోంది. ఈ వృక్షాన్ని వైఎస్ఆర్ స్మృతివనంలోని పవిత్రవనంలో నాటి పెంచి పోషించడం స్మృతివనంలో ఆధ్యాత్మిక ప్రశాంతతకు సూచికగా చెప్పుకో వచ్చు. ఆఫ్రికా మహావృక్షం.. చెంతనే వీక్షణం ఆఫ్రికా ఖండంలోని పలు అరణ్యాలలో కనిపించే భారీ వృక్షం అడెన్ సోనియా. దీనిని ఏనుగు చెట్టు అని కూడా అంటారు. వరపగ్గం తిరిగే వలయం ఉన్న ఈ చెట్టు ఆఫ్రికాలో 2500 ఏళ్లకు పైగానే జీవిస్తుందని నిర్ధారణ అయ్యింది. ఈ వృక్షాలు మన దేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఎవరో ఎపుడో తెచ్చినాటిన ఈ వృక్షాలు జిల్లాలోని గార్గేయ పురం వద్ద కూడా ఉన్నాయి. వాటిలోని ఒక వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో తీసుకు వచ్చి వైఎస్ఆర్ స్మృతివనంలో పునఃప్రతిష్టించారు. అశోక చెట్టు, ఆఫ్రీకన్ భారీ వృక్షం(అడెన్ సోనియా) సర్వమత వృక్షాలు.. వైఎస్ఆర్ స్మృతివనాన్ని బహుళ అభిరుచుల ఆలవాలంగా నెలకొల్పేందుకు నిర్మాణ కర్తలు కొన్ని కచ్చితమైన మార్గ దర్శనాలను అనుసరించారు. అందులో ఆధ్యాత్మిక ప్రశాంతత ఒకటి. జీవవైవిధ్యంతో పాటు హిందూ, క్రిష్టయన్, ఇస్లాం మత గ్రంథాల్లో , ప్రవచనాల్లో, పురాణాల్లో కనిపించిన, ప్రస్తావించిన మొక్కలను, వృక్షాలను చాలా మటుకు పవిత్ర వనంలో చేర్చారు. అందులో మహాశివుడి కళ్ల నుంచి పుట్టిందని చెప్పబడే రుద్రాక్ష, అమరకోశంలో ప్రస్తావించ బడిన పొగడ, మత్స్య పురాణంలో చెప్పబడిన శతావరి, మహాభారత, వాయు, వరాహ, వామన పురాణాలలో మహాభారత ఇతిహాసంలో కనపడే పారిజాతంతో పాటు ముస్లింలు దంతావధానానికి వినియోగించే మిష్వాక్, క్రిస్మస్ ట్రీకి పాకించే పిల్లి తీగల వంటి అనేక పౌరాణిక సంబంధ వృక్షజాతులను వైఎస్ఆర్ స్మృతివనంలోని పవిత్రవనంలో ఉంచారు. రుద్రాక్ష వృక్షం, ఎర్రచందన వృక్షం జన్మ నక్షత్రం.. వృక్ష సంబంధం ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మనక్షత్రం ఉండి తీరుతుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన వృక్షాలను వైఎస్ఆర్ స్మృతివనంలో ఒక చోట చేర్చి దాన్ని నక్షత్రవనంగా నామకరణం చేశారు. తమ జన్మ నక్షత్రానికి అనుసంధానమైన వృక్షం కింద యోగా చేసుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు ఎందరో ఇక్కడికి వస్తుంటారు. ఇవే కాకుండా ఆరు రాశులకు, సప్తరుషులకు, నవగ్రహాలకు కూడా ప్రత్యేక అనుసంధాన మొక్కలు వృక్షాలు, మొక్కలు వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్నాయి. స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ విషయాలు తెలుసుకుని కాసేపు ఇక్కడ సేద తీరి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. -
వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
-
వైఎస్‌నగర్‌పై కక్ష్య సాధింపు
- వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని నిధులు కేటాయించని వైనం - స్థానికుల నరకయాతన నంద్యాల: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆవిర్భవించిన వైఎస్‌నగర్‌పై ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోంది. కాలనీ ఓటర్లు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని, ఉప ఎన్నికల్లో కూడా అదే పార్టీకి వేస్తారని భావించిన అధికార పార్టీ నేతలు నిధుల కేటాయింపుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రూ.2వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంపై వైఎస్‌నగర్‌పై వివక్ష చూపుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ జెండాపై గెలిచిన కౌన్సిలర్ శివశంకర్ అధికార పార్టీలో చేరినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. వైఎస్సార్ సీఎం ఉన్న 2006లో 6500 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని నందమూరినగర్ పక్కన ఉన్న 200 ఎకరాల్లో అన్ని వర్గాల పేదలకు కేటాయించారు. 5వేల కుటుంబాలు ఈ కాలనీలో నివాసం ఉన్నాయి. వైఎస్ హయాంలో నిర్మితమైన రెండు నీళ్ల ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు మినహా ఇతర అభివృద్ధి పనులే లేకపోవడం గమనార్హం. వైఎస్సార్సీపీకి పట్టం కట్టిన స్థానికులు.. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చలువ వల్ల తలదాచుకోవడానికి ఇల్లు దొరికిందనే భావనతో స్థానికులు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి వైఎస్సార్‌పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. అప్పటి నుంచి వైఎస్‌నగర్ పార్టీకి పెట్టని కోటగా మారింది. కానరాని అభివృద్ధి.. వైఎస్‌నగర్ ఓటర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తుండటంతో అధికార పార్టీ నేతలు కాలనీ అభివృద్ధిని విస్మరించారు. భూమా నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం అధికార పార్టీలో చేరినా కాలనీని పట్టించుకోలేదు. భూమా మృతి తర్వాత ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. అయితే వైఎస్‌నగర్ వాసులు ఎలాగూ తమకు ఓట్లు వేయరని భావించి కాలనీకి నిధులు కేటాయించలేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించలేని కౌన్సిలర్.. స్థానిక కౌన్సిలర్ శివశంకర్‌యాదవ్ సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో స్థానికేతరుడైనా కాలనీవాసులు గెలిపించారు. కాని ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే భూమాతో పాటు అధికార పార్టీలో చేరారు. అధికార పార్టీలో ఉన్నా, వైఎస్‌నగర్‌కు ఎలాంటి సేవలందించడం లేదన్న భావన ప్రజల్లో ఉంది. -
వైఎస్సార్‌నగర్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ నగర్ లబ్ధిదారులకు న్యాయం చేయాలని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య పేర్కొన్నారు. వైఎస్సార్‌నగర్‌లో కాంగ్రెస్ నేతలు బుధవారం పర్యటించి ప్రజల సమస్యలను ఆరాదీశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరమ్మ శాశ్వత గృహనిర్మాణ పథకంలో 170 ఎకరాల విస్తీర్ణంలో 6500 మందికి పక్కా గృహాలను మంజూరు చేశారని, అయితే ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో లబ్ధిదారులు చేరలేదని వివరించారు. అధికార టీడీపీ ప్రభుత్వం వేరే వారికి ఈ గృహాలను కేటాయించాలనుకోవడం దారుణమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఈ ప్రాంతంలో కనీస వసతులను కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌నగర్ లబ్ధిదారులకు అండగా ఉంటామని, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపడతామన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెంచలబాబుయాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గాలాజు శివాచారి, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ శీలం తిరుపతయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు పత్తి సీతారామ్‌బాబు, మైనార్టీ నాయకులు ఫయాజ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ, అనిల్, సుమన్, రాజాయాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఇళ్లు కట్టించాలి
ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు(పొగతోట): వైఎస్సార్‌నగర్‌లో నాసిరకంగా నిర్మించిన ఇళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త ఇళ్లు కట్టించాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు వినతిపత్రం అందజేశారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 6,500 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆయన పాలన కాలంలో పనులు జోరుగా సాగాయన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన పాలకులు వైఎస్సార్నగర్ను పట్టించుకోకపోవడంతో పనులు నాసిరకంగా జరిగాయన్నారు. గతంలో చంద్రబాబు, మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో పర్యటించి కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. ఇప్పటికైనా స్పందించి నాణ్యతతో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. బ్యారేజీ నిర్వాసితులను ఆదుకోవాలి 53వ డివిజన్ పరిధిలోని సాలుచింతల ప్రాంతంలో పెన్నాబ్యారేజీ నిర్మాణంతో నిర్వాసితులవుతున్న పేదలనుఆదుకోవాలని ఎమ్మెల్యే అనిల్ కోరారు. అక్కడ అనేక ఏళ్లుగా పేదలు నివసిస్తున్నారని, బండ్‌కు బదులు ప్రహరీ నిర్మాణం లేదా ప్రత్నామ్నాయం చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, దేవరకొండ అశోక్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఆర్ ఇంతియాజ్, నాయకులు వేలూరు మహేష్, వందవాశి రంగా తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ పురస్కారాలు విద్యార్థులకు వరం
చంద్రగిరిలో ప్రతిభా అవార్డుల ప్రదానం ముఖ్యఅతిథిగా సీనియర్ పాత్రికేయులు జీవీడీ కృష్ణమోహన్ చంద్రగిరి: వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలు విద్యార్థుల పాలిట వరమని సీనియర్ పాత్రికేయులు జీవీడీ కృష్ణమోహన్ అన్నారు. చంద్రగిరిలోని పద్మావతి బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను ప్రోత్సహించి, వారిలో పోటీతత్వం పెంచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరిట పురస్కారాలను విస్తృత స్థాయిలో ప్రదానం చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అభినందించారు. కార్పొరేట్, పెద్దపెద్ద పాఠశాలల్లోని విద్యార్థులు సుఖానికి అలవాటుపడి చదువుపై అశ్రద్ధ వహిస్తారన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని జీవితంలో అనుకున్నది సాధిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి, కృష్ణమోహన్ పదో తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన నాగతనూశ్రీకి కంప్యూటర్ను అందజేశారు. అనంతరం విద్యార్ధులకు ట్యాబ్‌లు, నిఘంటువులు అందజేశారు. అలాగే విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమ, తహశీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీవో వెంకటనారాయణ, వైఎస్ఆర్ సీపీ ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు పార్లపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల పేరుతో మోసం
రూ.32 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు స్వాహా న్యాయం కోసం మహిళ వేడుకోలు కడప రూరల్ : గుప్త నిధుల పేరుతో వృద్ధులమైన తమను నిండా మోసగించారని హైదరాబాద్‌కు చెందిన వి.ఈశ్వరమ్మ ఆరోపించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను ఉద్యోగ విరమణ పొందడంతో హైదరాబాద్‌లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్లో నివసిస్తున్నానని తెలిపారు. పులివెందులకు చెందిన మీ-సేవా కేంద్రం మేనేజర్, ఒక పత్రికా విలేకరి (సాక్షి కాదు) తమ్మిశెట్టి అమర్నాథ్ తమకు సమీప బంధువని తెలిపారు. అతను తనకు బలపనూరులో ఒక తోట ఉందని, అందులో గుప్త నిధులు ఉన్నాయని తెలిపాడన్నారు. అవి బయటికి తీయాలంటే ఖర్చుతో కూడుకున్న పని, అంత డబ్బు తన వద్ద లేదని, మీరిస్తే వెలికి తీస్తానని, పైగా అది నా తోటే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడన్నారు. డబ్బులు లేకపోయినా సరే వడ్డీకైనా తెచ్చిస్తే గుప్త నిధుల్లో సగం, లేక డబ్బులైనా తిరిగి ఇస్తానని నమ్మబలికాడన్నారు. తమ దగ్గర డబ్బులు లేకపోయినా వడ్డీకి తెచ్చి రూ. 32 లక్షలు నగదు, 23 తులాల బంగారు నగలు ఇచ్చామన్నారు. కొన్ని రోజుల తర్వాత మీ తోట వద్దకు వెళదామని చెబితే వద్దు.. అక్కడికి వస్తే మీ కూతురు చనిపోతుందని మమ్మల్ని భయపెట్టే వాడన్నారు. మరికొన్ని రోజులకు వాకబు చేయగా, తమ అనుమానం నిజమేనని తేలిందన్నారు. ఆ మేరకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీకి ఫిర్యాదు చేయగా, ఆయన సమస్యను పరిష్కరించాలని పులివెందుల సీఐకి సిఫార్సు చేశారన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మోసగించిన విషయం వాస్తవమేనని గ్రహించి అతనిపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తాము ఇచ్చిన డబ్బు, బంగారు నగలు తమకు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆమె కుమారుడు గురురాజ్ పాల్గొన్నారు. -
ఈ కలెక్టర్ మాకొద్దు..
కడప రూరల్ : జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆయన ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. జిల్లాకు రావడానికి పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారంటూ జిల్లా ప్రతిష్ఠను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కలెక్టర్ ఈ జిల్లాకు వద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాలని, మంచి అధికారిని ఇక్కడికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్‌తోపాటు చీఫ్ సెక్రటరీలకు తీర్మానం కాపీలను పంపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడిలకు కూడ ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకులు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదు జిల్లా కలెక్టర్ కేవీ రమణ పరిపాలన, వ్యవహార శైలి ఏమాత్రం బాగా లేదు. ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక బాలిక పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. అది జిల్లాలో పెద్ద సంచలనం అయింది. ఆ గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విచారణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్ సదరు ఉపాధ్యాయునికి వత్తాసు పలకడం దారుణం. పాఠాలు చెప్పడంలో భాగంగానే ‘గిల్లడం’ జరిగిందని పేర్కొనడం మరీ దారుణం. పోలీసులు అతనిపై కేసు పెట్టినా కలెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడం శోచనీయం. మైదుకూరులో ఒక కంపెనీ మందును రైతులు వాడడంతో వంద ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. న్యాయం కోసం ఆ రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిస్తే రెండు, మూడు దఫాలు తిప్పుకుని ఫోరంకు వెళ్లాలని సూచించడం ఈ కలెక్టర్‌కే చెల్లింది. కడప స్పోర్ట్స్ స్కూలు వ్యవహారానికి సంబంధించి అవినీతికి పాల్పడిన స్పెషల్ ఆఫీసర్‌ను తన పక్కనే కూర్చొబెట్టుకుని అతనికి అనుకూలంగానే మాట్లాడి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు చేపట్టడం ఎంత వరకు సబబు? ప్రజలకు మేలు చేయని ఈ కలెక్టర్ మాకొద్దు. జిల్లాలో ప్రొద్దుటూరు ఆస్పత్రి సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అటువైపు కన్నెత్తి చూడలేదు. విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే స్పందనే ఉండదు. ఫిర్యాదు చేయాలని వస్తే కలిసే అవకాశం ఇవ్వరు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారి నియంతృత్వంతో వ్యవహరించడం ఎంత వరకు సమంజసం? - జయశ్రీ, మానవ హక్కుల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ప్రజలన్నా, ప్రజా ప్రతినిధులన్నా లెక్కలేదు కేవీ రమణ జిల్లా కలెక్టర్ కాకముందు బ్యాగుల కుంభకోణంలో సస్పెండ్ అయ్యారు. అనంతరం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. ఆయన తీరు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలంటే కలవనీయలేదు. ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి వెళితే కనీసం తలెత్తి కూడా చూడరు. సాక్షాత్తు జెడ్పీ చైర్మన్‌నే పట్టించుకోలేదు. నాకు కలెక్టర్‌ను కలవడానికి మూడు రోజుల సమయం పట్టింది. కలెక్టర్‌ను ఇక్కడి నుంచి పంపడమే మేలు. ఇది వెనుకబడిన జిల్లా. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నాం. కరువు జిల్లాలో ఇలాంటి కలెక్టర్ పనిచేస్తే ప్రజలకు మరింత నష్టమే. - నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలెక్టర్ తీరు మారాలి జిల్లా కలెక్టర్ అనుసరిస్తున్న తీరు పద్ధతిగా లేదు. ఆయన తీరు మారాలి. ప్రజల కోసం పని చేయాలి. అపాయింట్మెంట్ పద్ధతిని రద్దు చేయాలి. కలెక్టర్ అంటే జిల్లా సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం పని చేయాలి. అన్ని వర్గాలను కలుపుకు పోవాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే ఎవరూ ఒప్పుకోరు. - నాగ సుబ్బారెడ్డి, సీపీఐ నాయకుడు జిల్లా కలెక్టర్‌పై చర్చ ఇదే మొదటిసారి జిల్లా చరిత్రలో కలెక్టర్ వ్యవహార శైలిపై చర్చ జరగడం ఇదే మొదటిసారి. నచ్చిన వారికి క్లీన్ చిట్ ఇవ్వడం, నచ్చని వారికి పనిష్మెంట్ ఇవ్వడం తగదు. జిల్లా అభివృద్ధి కోసం మాత్రమే ఆయన పని చేయాలి. రాజకీయ నాయకునిలా వ్యవహరించడం, మాట్లాడటం పనికిరాదు. జిల్లా కలెక్టర్ కలెక్టర్‌గానే వ్యవహరించాలి. వంద సంవత్సరాలుగా ఒకే సమయపాలన పాటిస్తున్న విద్యా మందిర్‌లో పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నా, ఆయన కుమార్తె కోసం పాఠశాల వేళలు మార్పించిన ఘనత ఈ కలెక్టర్‌దే. - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావడం మంచిది పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావాలంటే భయపడుతున్నారని కలెక్టర్ చెప్పడం దారుణం. ఆయన జిల్లా ప్రతిష్ఠను దెబ్బ తీశారు. అవమానపరిచారు. జిల్లా అంటే అందరికీ ప్రేమ, అభిమానం ఉంది. 2004 నుంచి 2009 వరకు పారిశ్రామికవేత్తలు కడప చుట్టూ తిరిగారు. ఇక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు ఏర్పాటు కావాల్సి ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అవి ఏర్పాటు కాలేదు. ఆ మేరకు ప్రభుత్వం మౌలిక వసతులు, నీటి సౌకర్యం కల్పించలేదు. దానిని విస్మరించి.. ‘పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు.. ఎలాంటి రాజకీయ వివక్ష లేదు’ అంటూ జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకుడిలా మాట్లాడటం తగదు. ఆసక్తి ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం మంచిది. ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకుని సమర్థుడైన కలెక్టర్‌ను పంపాలి. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా పరువు తీశారు పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావడానికి భయపడుతున్నారని కలెక్టర్ వ్యాఖ్యానించి జిల్లా పరువు తీశారు. కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారి అలా వ్యాఖ్యానించడం మంచి పద్ధతి కాదు. కలెక్టర్ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించడానికి సన్నద్దం కావాలి. ఆయన మాట వినని అధికారులకు వేధింపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది అధికారులు కలెక్టర్ తీరుతో వేదనకు గురవుతున్నారు. జిల్లా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ఆయన టీడీపీలోని కొందరికి మాత్రమే జవాబుదారిగా ఉంటున్నారు. - గూడూరు రవి, జెడ్పీ చైర్మన్ కలెక్టర్‌తో ప్రభుత్వం క్షమాపణ చెప్పించాలి జిల్లా వాసులు ఆవేశపరులని, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని కలెక్టర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన అంత మాటన్నా జిల్లా ప్రజలు శాంతి స్వభావులు కాబట్టే ఏమి పట్టించుకోలేదు. ఈ సంగతిని ఆయన గమనించాలి. బాధ్యతగల అధికారిగా ఆయన ఇలా అమర్యాదగా ప్రవర్తించడం తగదు. ఇదే సంఘటన తెలంగాణలో జరిగి ఉంటే కేసులు నమోదయ్యేవి. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు కాబట్టి సరిపోయింది. రాయలసీమ పట్ల, జిల్లా పట్ల అనాదిగా వివక్ష కొనసాగుతోంది. కనీస పరిజ్ఞానం లేని అధికారికి ఐఏఎస్ గుర్తింపు ఇవ్వడమే సరైంది కాదు. పారిశ్రామిక ప్రగతి కోసం కనీస వసతులు కల్పించకుండా ‘పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.. నమ్మకం లేక వెనుకంజ వేస్తున్నార’ని స్వయాన కలెక్టరే వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. కలెక్టర్ తీరు పద్ధతిగా లేదు. తక్షణమే ప్రభుత్వం ఆయనతో జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పించాలి. - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు -
నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్ నెల్లూరురూరల్ : వైఎస్సార్ నగర్లో నివాసయోగ్యమైన ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యమని నెల్లూరు రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేదలకు గూడు వసతి కల్పించే ఉద్దేశంతో నగర శివారు కొత్తూరు పరిధిలోని వైఎస్సార్‌నగర్‌లో చేపట్టిన పక్కాగృహాల నిర్మాణం అస్తవ్యస్తంగా జరిగిందన్నారు. ఎమ్మెల్యేలు శనివారం వైఎస్సార్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఇక్కడ పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పాలకులు నాసిరకంగా పక్కాగృహాల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా గృహాలు నిర్మించారని మండిపడ్డారు. నగరంలోని 16 డివిజన్లకు చెందిన పేదలకు 6,500 ఇళ్లు మంజూరు చేశారన్నారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల ను గృహాల నిర్మాణానికి ఖర్చు చేసినా పూర్తి కాలేదన్నారు. నాసిరకం నిర్మాణాలపై విచారణ జరగలేదన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 50 కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నా రు. 2015 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించడమే తమ లక్ష్యమన్నారు. గృహనిర్మాణ సమస్యపై అసెంబ్లీలో గళమెత్తుతామన్నారు. గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే హడ్కో ద్వారా చేపట్టే విధంగా గృహ నిర్మాణశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇకపై తా ము ప్రతి రోజూ గృహాల నిర్మాణ పురోగతిపై మాట్లాడతామన్నారు. అధికారులతో సమీక్ష వైఎస్సార్‌నగర్‌లో గృహాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై రూరల్, నగర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ పలు శాఖల అధికారులతో వైఎస్సార్‌నగర్‌లో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను హౌసింగ్ ఈఈ ద్వారా అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని ఇళ్లు పూర్తి చేసి ఇవ్వగలరని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనికి నెలకు 1000 పూర్తి చేస్తామని ఈఈ సమాధానమిచ్చారు. ఇళ్ల లబ్ధిదారులు రూ.3వేలు కట్టాలంటూ హౌసింగ్ అధికారులు నోటీసులు ఇవ్వడం సమంజసంగా లేదని, లబ్ధిదారులపై ఒత్తిడి తేవద్దని ఎమ్మెల్యేలు హౌసింగ్ ఈఈకి సూచించారు. వైఎస్సార్‌నగర్‌లో విద్యుత్ లైన్ల పనుల పై ఆ శాఖ డీఈతో చర్చించారు. రెండు నెలల్లో విద్యుత్ పరమైన పనులు పూర్తి చేస్తామని డీఈ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌నగర్‌లో మంచినీ టి సరఫరా, అంతర్గత రోడ్ల నిర్మాణానికి సంబంధితశాఖ అధికారులు చొర వ తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు. కార్పొరేటర్లతో సమావేశం వైఎస్సార్‌నగర్‌లో పలు ప్రాంతాల కా ర్పొరేటర్లతో రూరల్, నగర ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. ఆయా డివిజన్లలో గృహాలు పొందిన లబ్ధిదారుల జాబితా తీసుకుని లబ్ధిదారుల గృహాల వద్దకు వెళ్లాలన్నారు. గృహాల నిర్మాణంలో ఉన్న ప్రగతిని వారికి వివరించాలన్నారు. రోజుకు ఒక్కొక్క డివిజన్లో కనీసం 30 మంది లబ్ధిదారులనైనా కలవాలన్నారు. ఇళ్ల పరిశీలన వైఎస్సార్‌నగర్‌లోని పక్కా గృహాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. నిర్మాణదశలో ఉన్న, నాసిరకంగా ఉన్న గృహా లను సందర్శించారు. ఎమ్మెల్యేల వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు పావళ్ల మాధవి, తురకా అనిత, షేక్ తాజున్నీ, కొమరగిరి శైలజ, యాకసిరి ప్రశాంతికిరణ్, ఎస్కే వహిదా, బొబ్బల శ్రీనివాసయాదవ్, కాకుటూరు లక్ష్మీసునంద, కమల్‌రాజ్ సంపూర్ణ, ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, ఎ.బాలకోటేశ్వరరావు, దేవరకొండ అశోక్ ఉన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
కదిరి : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు. కదిరి ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్ ఇంటిపై శనివారం దాడులు చేశారు. రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు. అందుకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వినాయక ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆరు గంటలకే కదిరి పట్టణంలోని వైఎస్సార్ నగర్లో ఉన్న ఆయన ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. దీంతో డీఈని అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. ఇంకా కదిరి, పుట్టపర్తి బ్యాంకుల్లో డీఈకి సంబంధించిన లాకర్లను తెరవాల్సి ఉంది. ఆయనపైకొంతకాలంగా రైతుల నుంచి పలు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ప్రత్యేక నిఘా పెట్టారు. అవి నిజమని ధ్రువీకరించుకొని కదిరిలోని ఆయన ఇంటి పైనే కాకుండా ధర్మవరం, అనంతపురంలోని బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులు చేశారు. అయితే.. అక్కడ ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. సోదాల అనంతరం ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి కదిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. వినాయక ప్రసాద్‌కు బెంగళూరు, అనంతపురంలో మూడంతస్తుల భవనాలు రెండు చొప్పున, హిందూపురంలో ఒకటి, పుట్టపర్తిలో మూడిళ్లు.. ఇలా మొత్తం ఆరు ఖరీదైన ఇళ్లు ఉన్నట్లు పత్రాల ద్వారా తెలుస్తోందన్నారు. సికింద్రాబాద్, హిందూపురం, కదిరి, పుట్టపర్తిలో ఐదు చోట్ల విలువైన ఇళ్ల స్థలాలు కూడా ఉన్నట్లు ధ్రువీకరించుకున్నామన్నారు. వీటి విలువ రూ.6-7 కోట్లు ఉంటుందన్నారు. (మార్కెట్ విలువ ప్రకారమైతే ఈ విలువ రూ.15 కోట్లు) గోరంట్లలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోందని, వాస్తవానికి ఏడెనిమిది ఎకరాలు ఉన్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. కదిరిలోని ఎస్బీఐ, పుట్టపర్తిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో డీఈకి సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరిస్తే బంగారం, మరిన్ని పత్రాలు, నగదు లభిస్తుందని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇంటి నుంచి రూ.71 వేల నగదు, 31 తులాల బంగారం, ఒకటిన్నర కిలో వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో డీఎస్పీతో పాటు ఏసీబీ సీఐలు గిరిధర్, ప్రభాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మైన్స్ అండ్ జియాలజీ శాఖ గెజిటెడ్ అధికారులు ధనుంజయ్, బాలసుబ్రమణ్యం సహకారం కూడా తీసుకున్నారు. మున్సిపల్ ఈఈ ఇంట్లో సోదాలు ధర్మవరం : కదిరి ట్రాన్స్‌కో డీఈ వినాయక ప్రసాద్‌కు బావ వరుస అయిన ధర్మవరం మునిసిపల్ ఈఈ నాగమోహన్ ఇంట్లో శనివారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ కర్నూలు డీఎస్పీ మహబూబ్ బాషా నేతృత్వంలో సీతారామారావు, రమేష్, వెంకటశివారెడ్డిల బృందం ఉదయం నుంచి ముమ్మరంగా సోదాలు చేసింది. పలు రికార్డులను, కంప్యూటర్లో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలించారు. కదిరి ట్రాన్స్‌కో డీఈ ఆదాయానికి మించి ఆస్తులు కల్గివున్నారన్న సమాచారంతో ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశామని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. -
అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట
కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి బెంగళూరు, న్యూస్‌లైన్ : అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు మించిన వారు లేరని కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి దుయ్యబట్టారు. గురువారం నగరంలోని యలహంక, బొమ్మనహళ్లి నియోజకవర్గంలోని హెబ్బగోడిలో ప్రవాసాంధ్ర ఓటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో కే.భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నోటి నుంచి ఏనాడు నిజం రాదని అన్నారు. ఈనెల 7న సీమాం ధ్రలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నగరంలోని ప్రతి ప్రవాసాంధ్రుడు తమతమ గ్రామాలకు వెళ్లి ఓటును వైఎస్ఆర్ సీపీ చిహ్నమైన ఫ్యాన్ గుర్తు వేసి పార్టీ విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మొసలి కన్నీరు కారుస్తున్నారని అలాం టి వ్యక్తి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన తొమ్మిదే ళ్ల పాలనలోకి ఎవరు తొంగి చూడలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశానని చంద్ర బాబు చెప్పడం అనుమానం కలుగుతోందన్నారు. బాబు పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా కుంటుపడటమే గాక రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని గుర్తు చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ గురించి నటుడు పవన్‌కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడటం తగదని, ఆయన వ్యాఖ్యలు కాస్త తగ్గించుకుంటే మంచిద ని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను సహించలేక నటుడు బాలకృష్ణ పిచ్చిగా మాట్లాడుతున్నారని, హిందూపురం ఓటర్లను ఆయన బుద్ధి చెప్పే సమయంలో ఆసన్నమైందన్నారు. సీమాంధ్ర అన్నిరంగాల్లో అభివృద్ధిలో నడవాలంటే వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ ుుఖ్యమంత్రి కావాలని ఆ దిశగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, తమ గ్రామాలకు తరలివెళ్లి పార్టీ విజయానికి కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ జాయింట్ సెక్రటరి బత్తుల అరుణాదాస్, కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, కోశాధికారి కొండా దామోదరరెడ్డి, ఫౌండేషన్ ఆర్గనైజింగ్ సభ్యుడు ఎస్.రాజశేఖర్‌రెడ్డితో పాటు ప్రవాసాంధ్రులు మదుసూధన్‌రెడ్డి, అమరనాథరెడ్డి, నాగరాజు, అరుణ, అబ్దూల్ లతీఫ్, శ్రీను, హరీష్, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 7న ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు తరలివెళ్లే హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ ప్రవాసాంధ్ర ఓటర్లు కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి-8880022888, బత్తులఅరుణాదాస్-9535119942, ఎస్.రాజశేఖర్‌రెడ్డి-9448854651 నెంబర్లును సంప్రదించాలని కోరారు. -
పాపాఘ్నిలో ఇద్దరు గల్లంతు
వేంపల్లె, న్యూస్‌లైన్ : పాపాఘ్ని నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గాజులపేట, వైఎస్ఆర్ నగర్‌కు చెందిన యువకులు పసుపులేటి మహేష్, కోనేటి నరహరి, పోలేపల్లె నవీన్ ఈత కొట్టేందుకు నది వద్దకు వెళ్లి గల్లంతు కాగా.. మహేష్‌ను స్థానికులు రక్షించడంతో సురక్షితంగా బయటపడ్డారు. సాయంత్రం 7గంటలవరకు గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ కనపడలేదు. రాత్రి కూడా జనరేటర్లు ఉపయోగించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ హాసం తెలిపారు. స్నేహితులకు ఫోన్ చేసి... వేంపల్లెలోని వైఎస్ఆర్ నగర్‌కు చెందిన నరహరి స్థానిక వాసవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం గాజులపేటలో ఉన్న పసుపులేటి మహేష్‌కు, వైఎస్ఆర్ నగర్లో ఉన్న నవీన్‌కు ఫోన్ చేసి పాపాఘ్ని నది వద్దకు రావాలని తెలిపారు. మధ్యాహ్నానికి ఇద్దరు కలిసి పాపాఘ్ని నది బిడాలమిట్ట వద్దనున్న నరహరి వద్దకు వెళ్లారు. అప్పటికే నరహరి బట్టలు విప్పి ఈత కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. మహేష్, నవీన్‌లు వద్దన్నా ఈత కొట్టాలని ఒత్తిడి తేవడంతో ముగ్గురు ఈత కొట్టేందుకు పాపాఘ్ని నదిలోకి దిగారు. కొంతసేపు ఆనందంగా ఈత కొట్టిన తర్వాత పెద్ద గుంతగా ఉన్న ప్రాంతంలో ముగ్గురు వెళ్లగా.. నరహరి, నవీన్‌లు గల్లంతయ్యారు. మహేష్ కేకలు వేయగా ఆ సమయంలో బహిర్భూమికి వచ్చిన హోటల్లో పనిచేస్తున్న సుబహాన్, మస్కగిరి చికెన్ సెంటర్లో పనిచేస్తున్న సర్దార్, ఒంటెద్దు యజమాని జాఫర్ అతనిని రక్షించగలిగారు. సహాయక చర్యలు ఇద్దరు గల్లంతైన విషయాన్ని సురిక్షితంగా బయటపడ్డ మహేష్ తెలియజేయడంతో అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాపాఘ్ని నది వద్దకు చేరుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సాయంత్రం 7గంటలైనా వారి ఆచూకీ కనపడలేదు. విషయాన్ని తెలుసుకుని వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, పరిశీలకుడు రామమునిరెడ్డి అధికారులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ నగర్, గాజులపేటలలో విషాదచాయలు వేంపల్లెలోని వైఎస్ఆర్ నగర్, గాజులపేటకు చెందిన ఇద్దరు యువకులు పాపాఘ్ని నదిలో గల్లంతు కావడంతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరహరి, నవీన్‌లు ఇద్దరు అక్కాచెల్లెళ్లయినా పెద్ద గంగమ్మ, భవానీల పిల్లలు. బంధువుల రోదనలు మిన్నంటాయి. -
అదే జోరు
సాక్షి, కడప : నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నా సమైక్య ఆందోళనల జోరు మాత్రం తగ్గడం లేదు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతునే ఉన్నాయి. పులివెందులలో బైక్ ర్యాలీ, కడపలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. భారీ ఎత్తున తరలివెళ్లి సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించారు. వైఎస్సార్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో బీసీ వర్గాల వారు సమావేశమై సభకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే పీఆర్టీయూ సంఘీభావం ప్రకటించింది. జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ నేత సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది బీసీ కాలనీవాసులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. రైల్వేకోడూరులో ఓబులవారిపల్లె మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు, డీసీసీబీ డెరైక్టర్ చిన్న గురవయ్య, ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 21 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు సుకుమార్‌రెడ్డి, సాయికిశోర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేటలో నందలూరు మండలం ఎర్రచెరువు పల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత యానాదిరెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, పోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో కాశినాయన మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వీరారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్సీపీ నేతలు చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. పులివెందులలో వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. లింగాల మండలానికి చెందిన 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రాయచోటిలో సంబేపల్లె మండలానికి చెందిన రౌతుకుంట, సంబేపల్లె, నారాయణరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పార్టీ నేత, న్యాయవాది ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు రాంప్రసాద్‌రెడ్డి, దశరథరామిరెడ్డి సంఘీభావం తెలిపారు. కమలాపురంలో వైఎస్సార్సీపీ నేత కొండాయపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి సంఘీభావం తెలిపారు. కడప నగరంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ మహిళా నేత బోలా పద్మావతి నేతృత్వంలో 15 మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బీ అంజాద్బాష, మాసీమబాబు, కరీముల్లా సంఘీభావం తెలిపారు. సమైక్య ఆందోళనలు కడప ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థి జేఏసీ సమావేశమై సమైక్యాంధ్ర ఆందోళనలపై కార్యచరణను రూపొందించింది. ఈనెల 29వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడించాలని, నవంబరు 1న పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద సామూహిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. కడపలో న్యాయవాదులు, సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరులో న్యాయవాదులు దీక్షలు కొనసాగించారు. బద్వేలులో గోపీరెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
రేపు సమైక్య శంఖారావం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ఆదివారం సమైక్య శంఖారావ సభను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ స్మారక ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కోశాధికారి రాకేశ్ రెడ్డి, మహిళా కార్యదర్శి బత్తుల అరుణాదాస్‌తో కలసి శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమైక్య శంఖారావాన్ని పురస్కరించుకుని స్థానిక విద్యారణ్యపురలోని కొడగు సమాజ భవనం ఆవరణలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ధర్నానుద్దేశించి ప్రవాసాంధ్ర ప్రముఖులు ప్రసంగిస్తారని తెలిపారు. సమైక్య ఉద్యమానికి ఇది కేవలం సన్నాహకం మాత్రమేనని, నగరంలోని ఇతర తెలుగు సంఘాలతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించనున్నామని చెప్పారు. 2009లోనే సమైక్యానికి అనుకూలంగా ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్‌లో 2009 జరిగిన శాసన సభ ఎన్నికల్లోనే ప్రజలు సమైక్యానికి అనుకూలంగా ఓటేశారని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, టీఆర్ఎస్, వామపక్షాలు తెలంగాణ అనుకూల వాణిని వినిపించాయని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ఆ మహా కూటమితో పాటు తెలంగాణకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ఆర్ ప్రవచించిన సమైక్య వాదానికే సీమాంధ్రతో పాటు తెలంగాణలో ఓట్లు పడ్డాయని వివరించారు. కనుక రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే అధికారం, హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఒక వేళ ఆ ఫలితాలపై ఎవరికైనా ఏవైనా అనుమానాలుంటే 2014 మేలో జరగాల్సిన శాసన సభ ఎన్నికలను ‘సమైక్యం-విభజన’ ప్రధానాంశంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పునకు ఎవరైనా కట్టుబడి ఉండాలని సూచించారు. అంతవరకు ఆంధ్రప్రదేశ్ విభజనను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని మనమంతా సమైక్యంగా ఉంచలేకపోతే భావి తరాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సమైక్య శంఖారావం సభ నిర్వహణలో ప్రధాన పాత్రను పోషించనున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలానికి చెందిన ప్రవాసాంధ్రులు కూడా పాల్గొన్నారు. -
రైతుల ఉద్యమ శంఖారావం
కడప, న్యూస్‌లైన్: ‘రాష్ట్ర విభజన సరైన పద్ధతికాదు. ప్రజల్లో విడిపోవాలనే ఆలోచన ఏకోశానా లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన జరుగుతోంది. విభజన జరిగితే ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమ మరింతగా వెనుకబాటుతనానికి గురవుతుంది. ముఖ్యంగా రైతులు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటారు. ఇప్పటికే అనేక త్యాగాలతో తప్పులు చేశాం. ఇకనైనా ఆ తప్పులు సరిదిద్దుకుందాం. సమైక్యంతోపాటు సీమ రైతు సంక్షేమానికి కలిసికట్టుగా పోరాడుదాం’’ అని రైతు జేఏసీ పిలుపునిచ్చింది. సోమవారం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో రైతు జేఏసీ కన్వీనర్ నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మద్రాసు నుంచి విడిపోగానే రాయలసీమ ప్రాంత అభ్యున్నతి కోసం శ్రీబాగ్ ఒడంబడిక జరిగిందన్నారు. ఆ ఒడంబడిక అమలుకానందునే నేడు ఈ దుర్భిక్షం దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణాకు ఏ అన్యాయం జరగలేదని ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని స్పష్టంచేశారు. విభజన జరిగితే సీమకు నీళ్లు రావడం కష్టమవుతుందన్నారు. సీమకు హంద్రీనీవా నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదన్నారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తికాక వరదనీరు సముద్రంలో కలిసిపోయిందన్నారు. దేవుడా సోనియాగాంధీకి మంచి బుద్ధిని ప్రసాదించి రాష్ట్రాన్ని కలిసివుండేలా చూడాలని వేడుకున్నారు. రాష్ట్ర విభజన సరైన పద్ధతి కాదని, ప్రజల్లో విడిపోవాలనే భావన ఏ కోశాన లేదన్నారు. జేఏసీ నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రం, ఈ ప్రాంత రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాలకు చెందిన ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకోకుండా విభజన ప్రకటన ఇవ్వడం దారుణమన్నారు. సమైక్య ఉద్యమంకోసం ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అంతకుముందు రైతు జేఏసీని ఏర్పాటుచేసి కన్వీనర్‌గా నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ రైతు నాయకులు కుమారస్వామి, కర్నూలు జిల్లా నాయకులు సిద్దారెడ్డి, మహేశ్వరరెడ్డి, మౌర్య రామచంద్రారెడ్డి, కిరణ్‌కుమార్, తిరుపతిరెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.