సాక్షి, కడప : నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నా సమైక్య ఆందోళనల జోరు మాత్రం తగ్గడం లేదు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతునే ఉన్నాయి. పులివెందులలో బైక్ ర్యాలీ, కడపలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. భారీ ఎత్తున తరలివెళ్లి సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించారు. వైఎస్సార్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో బీసీ వర్గాల వారు సమావేశమై సభకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే పీఆర్‌టీయూ సంఘీభావం ప్రకటించింది.
జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ నేత సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది బీసీ కాలనీవాసులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు.
రైల్వేకోడూరులో ఓబులవారిపల్లె మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, డీసీసీబీ డెరైక్టర్ చిన్న గురవయ్య, ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 21 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మనందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు సుకుమార్‌రెడ్డి, సాయికిశోర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
రాజంపేటలో నందలూరు మండలం ఎర్రచెరువు పల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత యానాదిరెడ్డి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, పోలా శ్రీనివాసులురెడ్డి సంఘీభావం తెలిపారు.
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో కాశినాయన మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత వీరారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ నేతలు చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. లింగాల మండలానికి చెందిన 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటిలో సంబేపల్లె మండలానికి చెందిన రౌతుకుంట, సంబేపల్లె, నారాయణరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పార్టీ నేత, న్యాయవాది ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు రాంప్రసాద్‌రెడ్డి, దశరథరామిరెడ్డి సంఘీభావం తెలిపారు.
కమలాపురంలో వైఎస్సార్‌సీపీ నేత కొండాయపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి సంఘీభావం తెలిపారు.
కడప నగరంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా నేత బోలా పద్మావతి నేతృత్వంలో 15 మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌బీ అంజాద్‌బాష, మాసీమబాబు, కరీముల్లా సంఘీభావం తెలిపారు.
సమైక్య ఆందోళనలు
కడప ప్రెస్‌క్లబ్‌లో విద్యార్థి జేఏసీ సమావేశమై సమైక్యాంధ్ర ఆందోళనలపై కార్యచరణను రూపొందించింది. ఈనెల 29వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడించాలని, నవంబరు 1న పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద సామూహిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతోపాటు సభలు, సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. కడపలో న్యాయవాదులు, సమైక్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరులో న్యాయవాదులు దీక్షలు కొనసాగించారు. బద్వేలులో గోపీరెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో 50 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
అదే జోరు
Published Fri, Oct 25 2013 2:38 AM | Last Updated on Tue, May 29 2018 7:26 PM
Advertisement