క్షేత్రస్థాయికి వైఎస్సార్ సీపీ
సాక్షి, ఏలూరు : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 18 నుంచి నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. తొలుత 18నుంచి 22వ తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అనంతరం మిగిలిన 10 నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన తేదీలను ఖరారు చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు అండగా నిలబడటంతోపాటు, ప్రభుత్వం అనుసరి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టేం దుకు రంగం సిద్ధం చేస్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో చేపట్టబోయే ప్రజా ఉద్యమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించి వారి నుంచి సూచనలు, అభిప్రాయాలు సేకరిస్తారు. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అనుబంధ సంస్థల కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తల అభిప్రాయాలు, సలహాలు తీసుకుంటారు.
తొలి విడత షెడ్యూల్ ఇలా..
నియోజకవర్గం పర్యటించే తేదీ
పోలవరం 18-09-2014
చింతలపూడి 19-09-2014
నిడదవోలు 20-09-2014
గోపాలపురం 21-09-2014
కొవ్వూరు 22-09-2014