సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు. ఈ ఘటనపై కేంద్రం పరిధిలోని ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని రాష్ట్రపతికి విన్నవించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం వచ్చే మంగళవారం రాష్ట్రపతిని కలవనుందని ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment