మార్కాపురం జెడ్పీటీసీ సభ్యుడు జవ్వాది రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రకాశం జడ్పీ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తుంది. జడ్పీ ఎన్నిక స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... హైకోర్టుకు విజ్ఞప్తి చేయనుంది.
నేడు ప్రకాశం జడ్పీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంది. అందులోభాగంగా హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న మార్కాపురం జడ్పీటీసీ సభ్యుడు జవ్వాది రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జవ్వాదిపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయిందని పోలీసులు తెలిపారు. అందువల్లే అయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. జవ్వాది అరెస్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని ఎలాగైనా అధికార టీడీపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అందులోభాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగేలా చూడాలని ఆ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.