సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్సే
Published Wed, Dec 25 2013 1:34 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
న్యూస్‌లైన్, పి.గన్నవరం (మామిడికుదురు) : సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే అని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. పి.గన్నవరంలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ జరిగింది. మండల కన్వీనర్ అడ్డగళ్ల వెంకటసాయిరామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్ అధ్యక్షతన ఈ సభ జరిగింది. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు కలిగే కష్టనష్టాలను జాతీయ పార్టీల నాయకులకు వివరించి వారి మద్దతు కూడగడుతూ జగన్ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్నారని చిట్టబ్బాయి చెప్పారు. ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలన్నారు.
ప్రాణాలు అర్పించైనా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతూ ప్రజల్ని వంచించేందుకు ప్రయత్నిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు, అధికార ప్రతినిధులు పీకే రావు, మోకా ఆనందసాగర్, జిల్లా ప్రచార విభాగం కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, కో-ఆర్డినేటర్లు రెడ్డిప్రసాద్, విప్పర్తి వేణుగోపాలరావు, కె. చిట్టిబాబు, ఎం. కిరణ్‌కుమార్, బొంతు రాజేశ్వర రావు, మత్తి జయప్రకాశ్, మట్టా శైలజ, వసుంధర, మండల కన్వీనర్లు బి. భగవాన్, మద్దా చంటిబాబు, డి. సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement