'తూర్పు'లో 'పోరుబాట'
కాకినాడ: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు...
రాజమండ్రి: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ధర్నా
రామచంద్రాపురం: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ధర్నా
కాకినాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అమలాపురం: స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ సీపీ నేత పినిపె విశ్వరూప్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో డ్వాక్రా మహిళలు, రైతులు పెద్ద ఎత్తున్న ఆందోళనలో పాల్గొన్నారు.
పిఠాపురం: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, రైతులు భారీ సంఖ్యలో హాజరైయ్యారు.