రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ | Ysr congress Plenary session to be held on Sunday | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ

Published Sat, Feb 1 2014 2:13 PM | Last Updated on Mon, Sep 17 2018 7:53 PM

రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ - Sakshi

రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ

వైఎస్సార్ జిల్లా:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి రెండో తేదీన నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరగనున్న ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతోపాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగానే నేటి మధ్యాహ్నం పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలకు కావాల్సిన షెడ్యూలును వైఎస్సార్ సీపీ నేతలు విడుదల చేయనున్నారు. ఇడుపులపాయలో చురుగ్గా ప్లీనరీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్లీనరీ ఏర్పాట్లును పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా కన్వీనర్ సురేష్బాబు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement