Governing Council
-
Hyderabad: అవినీతి మకిలి.. అధ్వానపు పాలన
సాక్షి, హైదరాబాద్: అయిదేళ్ల కాల పరిమితి కలిగిన జీహెచ్ఎంసీ పాలక మండలికి(GHMC Governing Council) నేటితో నాలుగేళ్ల పదవీకాలం పూర్తవుతోంది. రేపట్నుంచి అయిదో (చివరి) సంవత్సరంలోకి అడుగిడనుంది. 2021 ఫిబ్రవరి 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం 150 డివిజన్లుగా ఉన్న జీహెచ్ఎంసీ(GHMC) విభజన జరిగే అవకాశాలుండటంతో ఆ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కొత్త పాలక మండలికి ఎన్నికలయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ముందస్తుగానే పాలకమండలి ఎన్నికలు జరిగే అవకాశం దాదాపు లేదు. ఏవైనా కారణాలతో నెల, రెండు నెలల ముందుగానే ఎన్నికలు జరిగినా ఈ పాలకమండలికి మిగిలింది పది నెలల గడువే. అందుకే ఈలోగా ఇంటిని చక్కదిద్దుకునేందుకు కాబోలు.. కార్పొరేటర్లు కాలికి పని చెబుతున్నారు. తిరిగి ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్లేందుకో, లేక పనుల టెండర్లలో వచ్చే కమీషన్ల కోసమో స్థానిక సమస్యలంటూ నిధుల కోసం కొట్లాడుతున్నారు. కార్పొరేటర్ల డివిజన్లకు నిధులివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. మేయర్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) సైతం గతంలో లేని విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు విస్తృతం చేశారు. హోటళ్ల తనిఖీలు వంటివి చేస్తున్నారు. కార్పొరేటర్లు సైతం తమ డివిజన్లలో పర్యటిస్తున్నారు. కోఆప్షన్ ఎన్నిక లేదు.. వార్డు కమిటీలూ లేవు పాలకమండలికి నాలుగేళ్లు పూర్తవుతూ.. అయిదో ఏట అడుగుపెడుతున్నా ఇప్పటి వరకు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. వార్డు కమిటీలు, ఏరియా కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. ఈ ఎన్నికలేవీ జరగకుండానే నాలుగేళ్లు పూర్తి చేసిన పాలకమండలి బహుశా ఇదేనేమో. మరణించిన కార్పొరేటర్ల స్థానాల్లో.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కార్పొరేటర్ల స్థానాల్లో వాటి భర్తీకి ఉప ఎన్నికలూ జరగలేదు. ఇలా.. రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన పనుల ఊసే లేకుండాపోయింది. స్టడీ లేని టూర్లు సభ్యులు స్టడీ టూర్ల పేరిట వివిధ నగరాలు చుట్టివచ్చినా అక్కడి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటో, వాటిల్లో వేటిని ఇక్కడ అమలు చేయవచ్చో నివేదిక ఇవ్వని పాలకమండలి కూడా ఇదే. ఇక పాలకమండలి సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రతిసారీ గందరగోళాలే. ఏనాడూ సమావేశాలు సవ్యంగా సాగలేదు. ఇలా.. చెబుతూపోతే నెగెటివ్ అంశాలు తప్ప పాజిటివ్ అంశాలు కనిపించకపోవడం దురదృష్టకరం. కప్పదాట్లు.. పాలకమండలిలో చెప్పుకోదగిన అంశాల్లో పార్టీ మారి్పడులు ప్రముఖంగా ఉన్నాయి. పాలకమండలికి జరిగిన ఎన్నికల్లో తొలుత కేవలం రెండుస్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ బలం ఇప్పుడు 24కు చేరడం ఇందుకు దృష్టాంతం. చివరకు ఒక పారీ్ట(బీఆర్ఎస్)లో ఉండి మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వారు సైతం మరో పార్టీ(కాంగ్రెస్)లోకి మారడం ఇందుకు నిలువెత్తు నిదర్శనం.ప్రత్యేకంగా చేసిందేమిటి? నాలుగేళ్లు పూర్తయినా.. ఈ పాలకమండలి హయాంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంటూ ఒక్కటి కూడా లేకపోవడమే దీని ప్రత్యేకత. పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నిషేధం, కల్తీ లేని ఆహారం.. ఇలా ఏ కార్యక్రమం చూసినా అమలులో విఫలమైంది. విజయవంతం చేయలేకపోయింది. పరమ అధ్వానపు పరిపాలన కూడా ఈ పాలకమండలి హయాంలోదే కావడం గమనార్హం. బర్త్, డెత్ సరి్టఫికెట్లు, మ్యుటేషన్లు, ఇతరత్రా ఎన్నో అంశాల్లో అవినీతి వెల్లడైంది. వెలుగునిచ్చే వీధి దీపాల్లోనూ అవినీతి చీకట్లే నిండుకున్నాయి. -
పాతబకాయిలే అడుగుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాత్రమే వచ్చాయని.. తాము అడిగింది కూడా పాత బకాయిలేనని, కొత్తగా కేంద్రం ఇచ్చింది ఏమీలేదని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. విభజన సమయం కంటే గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలవల్ల రాష్ట్రానికి మరింత నష్టం జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.ఆ తర్వాత సాయంత్రం కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరా యులతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం డయాఫ్రమ్ వాల్‌కు సంబంధించిన డిజైన్ల విషయంలో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రమంత్రిని కోరారు. సమావేశానంతరం చంద్రబాబు అక్కడున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విభజన చట్టంవల్ల నష్టం..: విభజన చట్టాన్ని రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని.. వాళ్లు చేసిన ఆ చట్టం ద్వారా పోలవరానికి ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. విభజన చట్టంలో ఏర్పడిన నష్టం నుంచి తేరుకుంటున్న సమయంలో తమ ప్రభుత్వం ఓటమి పాలైందని.. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.అదేవిధంగా అప్పులు పెరగడం, రాష్ట్రానికి ఆదాయం తగ్గడం, అమరావతిని నాశనం చేయడం, పరిశ్రమలు పారిపోయేలా చేశారని విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని, అందుకే పోలవరం పునర్నిర్మాణానికి పాత బకాయిలను అడుగుతున్నామని, కొత్తగా ఇచ్చిందేమీ లేదనే విషయాన్ని విమర్శించే వాళ్లు గుర్తించాలని చంద్రబాబు కోరారు. విభజన సందర్భంగా అన్యాయం జరిగిన దానిని ఇస్తే తాము నిలదొక్కుకునే అవకాశముందన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు. నవంబర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం..: ఇక నవంబరు నెలలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని, అప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతామని.. ఆ తర్వాత ఎర్త్‌కం రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు తెలిపారు. -
Mamata Banerjee: ఘోరంగా అవమానించారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/పటా్న: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ దుమారానికి కారణంగా మారింది. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో తనకు ఘోర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో, ఆ తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర సీఎంలకు 10 నుంచి 20 నిమిషాలు సమయమిచ్చి తనకు మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు. ‘‘కేంద్రంపై పెద్దగా ఆశలు లేకపోయినా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో భేటీకి వచ్చా. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి హాజరైన ఏకైక సీఎంను నేనే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 20 నిమిషాలిచ్చారు. గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ తదితర సీఎంలకు కూడా 10 నుంచి 12 నిమిషాల దాకా ఇచ్చారు. నన్ను మాత్రం ఐదు నిమిషాల కంటే మాట్లాడనివ్వలేదు. పైగా ఆ ఐదు నిమిషాల్లోనూ పదేపదే బెల్లు కొడుతూ దారుణంగా అవమానించారు. భేటీని పర్యవేక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పదేపదే బెల్లు కొట్టారు. పక్కనే కూర్చున్న మోదీ, కేంద్ర హోం మంత్రి సూచన మేరకే ఆయనలా చేశారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశా’’ అని వివరించారు. ఇకపై నీతి ఆయోగ్ భేటీలకు ఎప్పటికీ హాజరు కాబోనని ప్రకటించారు. మైక్ కట్ చేయలేదు: నిర్మల మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమెకు కేటాయించిన సమయం మేరకు పూర్తిగా మాట్లాడారని పేర్కొంది. ‘‘నిజానికి అక్షరక్రమంలో మమత లంచ్ అనంతరం మాట్లాడాల్సింది. కానీ ఆమె అర్జెంటుగా కోల్‌కతా తిరిగి వెళ్లాల్సి ఉందన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతకుముందే ఏడో వక్తగా అవకాశమిచ్చాం. మమతకు కేటాయించిన సమయం పూర్తయిందని కేవలం అందరి ముందూ ఉన్న స్క్రీన్లపై కని్పంచింది. అంతే తప్ప టైం అయిపోయిందంటూ ఎవరూ బెల్ కూడా మోగించలేదు’’ అని వివరణ ఇచి్చంది. మమత పూర్తి సమయం మేరకు మాట్లాడారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మధ్యలో మైక్ కట్ చేయడం నిజం కాదు. ఎవరెంతసేపు మాట్లాడుతున్నదీ మా ముందున్న స్క్రీన్లపై కనిపిస్తూనే ఉంది. కొందరు సీఎంలు కేటాయించిన సమయం కన్నా ఎక్కువగా మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు అదనపు సమయం కేటాయించాం. అంతే తప్ప ఎవరికీ, ముఖ్యంగా బెంగాల్ సీఎంకు మైకు కట్ చేయలేదు’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్రానిది రాజకీయ వివక్ష విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం దారుణమైన రాజకీయ వివక్ష కనబరుస్తోందని మమత ఆరోపించారు. ‘‘ఈ వివక్ష కేంద్ర బడ్జెట్లో కూడా కొట్టొచి్చనట్టు కని్పంచింది. ఈ వైనాన్ని భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే లేవనెత్తా. వారికి కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఉండొచ్చు. వాటికి ఎక్కువ నిధులు కేటాయించడంపైనా నాకు అభ్యంతరం లేదు. కానీ బెంగాల్ తదితర రాష్ట్రాలపై మాత్రం ఎందుకిలా వివక్ష చూపు తున్నారని ప్రశ్నించా. దీనిపై సమీక్ష జరగాలని డిమాండ్ చేశా. అన్ని రాష్ట్రాల తరఫునా భేటీలో మాట్లాడా’’ అని తెలిపారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలూ లేవు. దానికి అధికారాలన్నా ఇవ్వాలి. లేదంటే ప్రణాళిక సంఘాన్నే పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉపాధి హామీ వంటి పలు కీలక కేంద్ర పథకాల అమలును బెంగాల్లో మూడేళ్లుగా నిలిపేయడాన్ని భేటీలో ప్రస్తావించా. స్వపక్షం, విపక్షాల మధ్య కేంద్రం ఇలా వివక్ష చూపుతుంటే దేశం ఎలా నడుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అందరి మేలూ పట్టించుకోవాలి’’ అన్నారు. అధికార, విపక్షాల పరస్పర విమర్శలు కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు మమతకు సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేత అ న్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ముఖ్యమంత్రినే ఇంతగా అవమానించడం దారుణమని మండిపడ్డాయి. దీన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేమని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ (తమిళనాడు) సహా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచి్చంది. కేవలం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ముందుగా నిర్ణయించుకుని మరీ మమత ఇలా వాకౌట్ చేశారని కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, ప్రహ్లాద్ జోషీ తదితరులు విమర్శించారు. బెంగాల్ పీసీసీ చీఫ్ అ«దీర్ రంజన్ చౌధరి మాత్రం మమత కావాలనే డ్రామా చేశారంటూ కొట్టిపారేయడం విశేషం.‘‘సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ అంటే ఇదేనా? సీఎంతో ప్రవర్తించే తీరిదేనా? మన ప్రజాస్వామ్యంలో విపక్షాలు కూడా అంతర్గత భాగమని కేంద్రంలోని బీజేపీ సర్కారు అర్థం చేసుకోవాలి. శత్రువుల్లా చూడటం ఇకనైనా మానుకుంటే మంచిది’’ – తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‘‘మన దేశంలో పతాక శీర్షికలకు ఎక్కడం చాలా తేలిక. ఏకైక నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ఏకైక విపక్ష సీఎం నేనే అని ముందుగా చెప్పాలి. బయటికొచ్చి, ‘నా మైక్ కట్ చేశారు. అందుకే బాయ్‌కాట్ చేశా’ అని చెప్పాలి. ఇక రోజంతా టీవీలు దీన్నే చూపిస్తాయి. పని చేయాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఇదీ దీదీ తీరు!’’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ -
‘వికసిత భారత్’ సాకారంలో... రాష్ట్రాలదే కీలక పాత్ర: మోదీ
న్యూఢిల్లీ: 2047 కల్లా వికసిత భారత్ కలను సాకారం చేసుకోవడంలో రాష్ట్రాలది ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘పేదరిక నిర్మూలనే మన లక్ష్యం కావాలి. గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి దాకా ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. ఇందుకు ప్రతి జిల్లా, రాష్ట్రం 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయి దాకా వికసిత్ భారత్ ఆకాంక్ష చేరాలి’’ అని సూచించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ శనివారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. భేటీకి సారథ్యం వహించిన మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధే లక్ష్యంగా పాలనలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి సాగాలని అభిలషించారు. ‘‘ఇది సాంకేతిక మార్పుల దశాబ్ది. ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయి. వాటిని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించాలంటే శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు చాలా కీలకం. జల వనరుల సమర్థ వినియోగానికి రివర్ గ్రిడ్లు ఏర్పాటు చేసుకోవాలి’’ అని సూచించారు. ముఖ్యమంత్రులు తమ అవసరాలు, ప్రాథమ్యాలను వివరించారు. పేదరిక నిర్మూలన (జీరో పావరీ్ట) లక్ష్యాలను సాధించిన గ్రామాలను పేదరికరహిత గ్రామాలుగా ప్రకటిస్తామని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. భేటీలో చర్చించిన విషయాలపై 45 రోజుల్లో ‘విజన్ ఇండియా 2047’ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు. -
నీతి ఆయోగ్ వేదికపై రాష్ట్ర ప్రగతి చిత్రం
సాక్షి, అమరావతి: గత నాలుగేళ్లలో వివిధ అంశాలు, పలు రంగాల్లో సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వివరించడంతోపాటు కేంద్రం నుంచి సహాయాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేయనుంది. ఈనెల 27న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో చర్చించనున్న అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులు.. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను స్పష్టంగా వివరించేలా సన్నద్ధం కావాలన్నారు. 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వివరించడంతో పాటు పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో తెలియజేయాలని నిర్ణయించారు. సమీక్షలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. మహిళా సాధికారిత దిశగా అడుగులు ► మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. దీంతోపాటు బహుళజాతి కంపెనీలతో కలిసి చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించింది. ► మహిళా సాధికారిత దిశగా చేయూతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాలు కీలక పాత్ర పోషించాయి. ‘దిశ’ కింద చేపట్టిన కార్యక్రమాలు.. సత్వరమే స్పందించిన తీరు వల్ల వేలాది మంది బాలికలు, మహిళలకు రక్షణ లభించింది. ► మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ.. ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలి. తల్లి గర్భం దాల్చి, కాన్పు పూర్తి కాగానే శిశువుకు ఆధార్ నంబరు కేటాయింపు జరిగేలా చూడాలి. ► ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్ చేయడానికి సులభతరం అవుతుంది. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ ట్రాక్ చేయొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్లో కీలక ప్రగతి ► రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ రంగంలో త్వరితగతిన ఘనణీయమైన ప్రగతి సాధ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఎంఎస్ఎంఈలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మద్దతు కావాలి. ► రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగా పెరగనున్నాయి. ► కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తి స్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చాం. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకు సాగేలా అడుగులు వేస్తున్నాం. పరిశ్రమల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ ► పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి. ► ఫ్యామిలీ డాక్టర్ విధానంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్.. రెండూ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీరికి వైద్యం అందించడం, ఫాలోఅప్ చేయడం చాలా ముఖ్యం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాస్పత్రుల్లో తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్ ల్యాబ్స్ తప్పనిసరిగా పెట్టాలి. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలి. స్కిల్ కార్యక్రమాల్లో వేగం పెరగాలి ► స్కిల్ డెవలప్మెంట్ రంగంలో కార్యక్రమాల వేగం పెంచాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఇదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఈ స్కిల్ సెంటర్లు ఉపయోగపడతాయి. ► నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్సిటీ ద్వారా రూపొందించాలి. ► స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి. రూ.371 కోట్లు దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. తద్వారా నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. -
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 27న న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. వికాస్ భారత్ @ 2047, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళాసాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్మెంట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నీతిఆయోగ్ పాలక మండలి చర్చించనుంది. ఈ సందర్భంగా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్న అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వివిధ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని రాష్ట్రం కోరనుంది. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేయనుంది. ఇక సమీక్ష సందర్భంగా నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలిచ్చారు. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు-నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను వివరించనుంది. 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్ల్ మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. ఇదే సమయంలో అధికారులకు సీఎం.. కీలక అదేశాలు ఇచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్, రెండూ ఉన్న వారిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. వీరికి వైద్యం అందించడం, ఫాలో అప్ చేయడం అన్నది చాలా ముఖ్యమని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాసుపత్రుల్లోనూ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్ ల్యాబ్స్ తప్పనిసరిగా పెట్టాలన్న సీఎం.. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య డేటా సమ్మిళితం చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్య–ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలన్న సీఎం.. తల్లి గర్బం దాల్చి, కాన్పు పూర్తి అయిన తర్వాత శిశువుకు ఆధార్ నెంబరు కేటాయింపు జరిగేలా చూడాలన్నారు. ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్ చేయడానికి సులభతరం అవుతుందని, పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ కూడా ట్రాక్ చేయడం కూడా సులభతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను, బహుళజాతి కంపెనీలతో కలిసి చేసిన చేయూత పథకాన్ని ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఏ రకంగా పథకం ఉపయోగపడిందో, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు ఎలా తోడ్పాటు నందించిందో, మహిళా సాధికారిత దిశలో చేయతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాల పాత్రను రాష్ట ప్రభుత్వం వివరించనుంది. దిశ కింద చేపట్టిన కార్యక్రమాలనూ వివరించడంతో పాటు, దాదాపు 30వేలకుపైగా ఇంటర్వెన్షన్స్ జరిగిన విషయాన్ని హైలెట్ చేయనుంది. స్కిల్ డెవలప్మెంట్ రంగంలో కార్యక్రమాల వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న సీఎం.. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. అదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కిల్ సెంటర్లు ఉపయోగపడతాయన్న సీఎం.. నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్శిటీని ఏర్పాటు చేయాలన్నారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్శిటీ ద్వారా తయారు చేయించాలని సీఎం సూచించారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి.. ప్రభుత్వం సొమ్మ రూ.371 కోట్లను దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.’’ అని సీఎం అన్నారు. చదవండి: సీఎం జగన్ గొప్ప మనసు.. గంటల వ్యవధిలోనే.. ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని, మద్దతును నీతి ఆయోగ్ సమావేశంలో ప్రభుత్వం వివరించనుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్టిమెంట్ రంగంలో సాధించిన ప్రగతిని ప్రభుత్వం వివరించనుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో కొనసాగుతున్న పనులను వివరించనుంది. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లతోనూ తీర ప్రాంతంలో గణనీయంగా పెరగనున్న మౌలిక సదుపాయాలు అంశాన్ని రాష్ట్రం వివరించనుంది. కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తిస్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చిన అంశాన్ని ప్రభుత్వం వివరించనుంది. కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్టు అంశాన్నీ కేంద్రం ప్రస్తావించనుంది. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగాలన్న సీఎం.. పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు.. వారితో నిరంతరం మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్న సీఎం.. బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి -
NITI Aayog governing council: జీఎస్టీ వసూళ్లు పెరగాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో భారత్ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలి ఏడో సమావేశం ఆదివారం ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఇది నీతి ఆయోగ్ తొలి భౌతిక సమావేశం. కరోనా కారణంగా 2021లో భేటీ వర్చువల్‌గా జరిగింది. 4 కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలన విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతి ఆయోగ్ భేటీని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సమావేశానికి రాలేదు. రాష్ట్రానికో జీ20 టీమ్ నీతీ ఆయోగ్ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందదన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అన్నది ఏ ఒక్క పార్టీ అజెండానో కాదని, అందరి ఉమ్మడి లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తొలిసారిగా ఒక్కచోటికి వచ్చి జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై మూడు రోజుల పాటు చర్చించడం గొప్ప విషయమన్నారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రమూ ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలేమన్నాయంటే... వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. రాజ్యాంగం తాలూకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోవొద్దన్నారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు. చిన్న అణు విద్యుత్కేంద్రాలు మేలు ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు పాతబడుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాల స్థానంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్)ను ఏర్పాటు చేసుకోవడంపై కేంద్రం దృష్టి సారించాలని నీతీ ఆయోగ్ సభ్యుడు, శాస్త్రవేత్త వీకే సారస్వత్ సూచించారు. అణు విద్యుత్కేంద్రాల స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎస్ఎంఆర్లు 300 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన అధునాతన అణు రియాక్టర్లు. ప్రస్తుతం దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 22 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. జాతీయ విద్యా విధానం కింద టీచర్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, అభ్యసన ఫలితాలను మెరుగు పరిచేందుకు చేపట్టిన చర్యలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రగతికి కేంద్రం, రాష్ట్రాలు కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం మరింతగా ఉందని నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్సుమన్ బెరీ అన్నారు. కేంద్ర విధానాలను రుద్దొద్దు: రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం అమలుకు ఒత్తిడి తేవొద్దన్నారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్ సీఎంలు కోరారు. జార్ఖండ్‌లో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం హేమంత్ సోరెన్ కోరారు. వ్యవసాయ, విద్యా రంగాల్లో మహారాష్ట్రకు కేంద్రం మరింత దన్నుగా నిలవాలని సీఎం ఏక్నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్ డిమాండ్ చేశారు. విపత్తుల నిర్వహణకు ఒడిశాకు మరిన్ని నిధులు కేటాయించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలు, వాటి ఆందోళనలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు తదితరాలను నీతీ ఆయోగ్ లోతుగా అధ్యయనం చేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. -
7న ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి ఈ సమావేశం మరింతగా తోడ్పడుతుందన్నారు. 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరుగుతుందన్నారు. పంటల వైవిధ్యం, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అగ్రి కమ్యూనిటీస్, ఎన్ఈపీ అమలు, పట్టణ పాలన వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు ఉంటాయన్నారు. -
30 మందితో టీటీడీ పాలక మండలి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) 30 మంది సభ్యులతో కొత్త పాలక మండలిని ప్రభుత్వం బుధవారం నియమించింది. అధికారులతో కలిసి 28 మందిని పాలక మండలి సభ్యులుగా, మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 8వ తేదీనే టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం పాలక మండలి చైర్మను మాత్రమే ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించింది. చైర్మన్ సహా సభ్యుల పదవీ కాలం దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 99ను అనుసరించి ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఇద్దరికి పాలక మండలిలో ఓటు హక్కు ఉండదన్నారు. కొత్త పాలక మండలి ఇలా.. 1. పొలకల అశోక్‌కుమార్, 2. మల్లాడి కృష్ణారావు 3.టంగుటూరు మారుతీ ప్రసాద్, 4. మన్నే జీవన్‌రెడ్డి, 5. డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, 6. జూపల్లి రామేశ్వరరావు, 7. ఎన్. శ్రీనివాసన్, 8. రాజేష్ శర్మ, 9. బోరా సౌరభ్, 10. మూరంశెట్టి రాములు, 11. కల్వకుర్తి విద్యాసాగర్, 12. ఏపీ నందకుమార్, 13. పచ్చిపాల సనత్‌కుమార్, 14. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, 15. డాక్టర్ కేతన్ దేశాయి, 16.బూదాటి లక్ష్మీనారాయణ, 17. మిలింద్ కేశవ్ నర్వేకర్, 18. ఎంఎన్ శశిధర్, 19 అల్లూరి మల్లేశ్వరి 20. డాక్టర్ ఎస్.శంకర్, 21. ఎస్ఆర్ విశ్వనాథ్‌రెడ్డి, 22. బుర్రా మధుసూదన్‌యాదవ్, 23. కిలివేటి సంజీవయ్య, 24. కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులు 1. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, 2. దేవదాయ శాఖ కమిషనర్, 3. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, 4. టీటీడీ ఈవో ప్రత్యేక ఆహ్వానితులు 1. భూమన కరుణాకర్ రెడ్డి 2. సుధాకర్ (బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్) ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది ఏపీ టూరిజం పాలసీలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా భవిష్యత్‌లో తిరుమల ఆలయానికి భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా, ఇంకొక 50 మందిని టీటీడీ ఆలయ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ మరో ఉత్తర్వు జారీ చేశారు. టీటీడీ పాలక మండలి సభ్యుల పదవీ కాలం కొనసాగినంత కాలం ఆలయ ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ఉంటుందని.. పాలక మండలి సభ్యులకు వర్తించే ప్రొటోకాల్ వీరికీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నేడు టీటీడీ పాలకమండలి సమావేశం
-
ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం
-
టీటీడీ బడ్జెట్ 3,243 కోట్లు
తిరుమల: 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.3,243.19 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వార్షిక రివైజ్డ్ బడ్జెట్‌కు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. తిరుమలలో జరిగే పలు అభివృద్ధి పనులు, స్థానికుల సమస్యలపై టీటీడీ బోర్డు సభ్యులు చర్చించారు. అలాగే 2019–20కి సంబంధించిన బడ్జెట్‌ను టీటీడీ విడుదల చేసింది. హిందూ ధర్మ ప్రచారం, భక్తుల సౌకర్యాలు, దేవాలయ నిర్మాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు ఈ బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. పాలక మండలి చర్చించిన ముఖ్యమైన అంశాలు ►భక్తుల మనోభావాలు దెబ్బతినేలా గత నెలలో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన కథనంపై రూ.100 కోట్ల క్రిమినల్ పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం. టీటీడీ వెబ్సైట్లో యేసు ప్రభువు కనిపిస్తున్నాడని ఆ పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ పరువు నష్టం దావా వేయనుంది. ►జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. ప్రొటోకాల్ ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. ►2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ రూ.3,116.25 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించగా, రూ.3,243.19 కోట్లుగా సవరించారు. ►ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం. స్థలం కేటాయించాలని కోరుతూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని నిర్ణయం. ►ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణానికి ఆమోదం. ►డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు. ►రమణ దీక్షితులకు గౌరవ ప్రధానార్చకుల(హానరరీ బేసిస్) హోదా కల్పిస్తూ నిర్ణయం. ►టీటీడీలో ప్రత్యేక అకౌంటింగ్ విభాగం ఏర్పాటు. ►రూ.14 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయ విమానానికి రాగిరేకులపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ఆమోదం. ఇందుకు అవసరమైన బంగారాన్ని టీటీడీ ఖజానా నుండి తీసుకునేందుకు అనుమతి. ►చెన్నై అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డిని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా(హానరీ బేసిస్) నియమిస్తూ నిర్ణయం. ►తిరుపతిలోని శ్రీ పద్మావతి, శ్రీశ్రీనివాస కల్యాణ మండపాల్లో రూ.3.20 కోట్లతో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు. ►రెండో ఘాట్ రోడ్లో రూ.10 కోట్ల వ్యయంతో ఆర్సీసీ క్రాష్ బ్యారియర్లు, సీసీ కెర్బ్ వాల్స్ నిర్మాణం. ►తిరుమల ఘాట్ రోడ్లలో మరమ్మతులు చేపట్టేందుకు ఐఐటీ చెన్నై, జేఎన్టీయూ నిపుణులతో కమిటీ ఏర్పాటు. ►తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.14.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం. -
నోబాల్ అంపైర్...
ముంబై: ఐపీఎల్–2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందా! ముంబైతో మ్యాచ్‌లో చివరి బంతికి విజయం కోసం బెంగళూరు 7 పరుగులు చేయాల్సి ఉండగా, మలింగ వేసిన బంతికి పరుగు రాలేదు. అయితే టీవీ రీప్లేలో అది ‘నోబాల్’గా తేలింది. దానిని అంపైర్లు సరిగా గమనించి ఉంటే అదనపు పరుగు రావడంతో పాటు సిక్సర్‌తో తాము గెలిచే అవకాశం ఉండేదని భావించిన కోహ్లి ‘అంపైర్లు కళ్లు తెరచి పని చేయాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. రాజస్తాన్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో అంపైర్లు ముందుగా ‘నోబాల్’ ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో చెన్నై కెప్టెన్ ధోని ఆగ్రహంతో మైదానంలోకి దూసుకొచ్చి వాదనకు దిగాడు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఐపీఎల్ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. 2020 ఐపీఎల్లో తొలిసారి ‘నోబాల్ అంపైర్’ అంటూ ప్రత్యేకంగా నియమించనున్నారు. ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్లకు ఇది అదనం. కేవలం మ్యాచ్‌లో నోబాల్స్‌నే ప్రత్యేకంగా పరిశీలించడమే అంపైర్ పని. ‘ఈ అంపైరింగ్ గురించి చెబుతుంటే కొంత వింత గా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. మేం టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం. కాబట్టి నోబాల్స్ పొరపాట్లనే ప్రత్యేకంగా గుర్తించేందుకు ఒక అంపైర్ ఉంటే మంచిదే. రాబోయే ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది’ అని కౌన్సిల్ సభ్యుడొకరు వెల్లడించారు. మరోవైపు మ్యాచ్‌లో ‘పవర్ ప్లేయర్’ను తీసుకొచ్చే నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటి వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి లభించలేదని తెలిసింది. ఎక్కువ మంది సీనియర్లు ఉన్న ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి తమ అనుకూలత కోసమే ఈ కొత్త తరహా ప్రతిపాదన చేశాడని సమాచారం. డిసెంబర్ 19న వేలం... ఐపీఎల్–2020 కోసం జరిగే ఆటగాళ్ల వేలంను డిసెంబర్ 19న కోల్‌కతాలో నిర్వహించాలని గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతీ సారి వేలం బెంగళూరులోనే జరిగింది. 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ మరో రూ. 3 కోట్లు అదనంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ గరిష్టంగా రూ. 85 కోట్లకు పెంచారు. -
1,448 ఆలయాలకు పాలక మండళ్లు
-
ఒకేసారి 1,448 ఆలయాలకు..పాలక మండళ్లు
సాక్షి, అమరావతి: మరో సంచలనానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసింది. దేవదాయ శాఖ పరిధిలోని 1,448 ఆలయాలకు ఒకే విడతలో పాలక మండళ్ల నియామకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఒక్కో ట్రస్టు బోర్డులో ఉండే మొత్తం సభ్యులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడంతో పాటు మొత్తంగా అన్ని కేటగిరీలలో సగం పదవుల్లో మహిళలనే నియమించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వీటిలోని మొత్తం 10,256 నామినేటెడ్ పదవులకుగాను సగం అంటే.. 5128 పదవులు హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతాయి. అలాగే.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీల కేటగిరీలలోని మొత్తం 10,256 మంది నియామకాల్లో సగం అంటే 5,128 పదవులు మహిళలకే లభించనున్నాయి. ఒక్కో గుడికి 7–9 మంది చొప్పున.. రూ.25 లక్షలలోపు ఆదాయం ఉండే 1,388 ఆలయాలతో పాటు రూ.25 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఆదాయం ఉండే మరో 60 ఆలయాలకు కలిపి మొత్తం 1,448 ఆలయాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రూ.కోటిలోపు ఆదాయం ఉన్న మొత్తం 172 ఆలయాలకుగాను ప్రస్తుతం 60కి మాత్రమే పాలక మండళ్లను నియమిస్తున్నారు. దేవదాయ శాఖ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రూ.25 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలకు ఏడుగురు సభ్యుల చొప్పున పాలక మండలిని నియమించాల్సి ఉంది. అలాగే, రూ.కోటిలోపు ఆదాయం ఉండే ఆలయాలకు తొమ్మిది మంది చొప్పున సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం అనుమతి తెలిపిన ఆలయాల వివరాలను సంబంధిత ఆలయ కార్యనిర్వహణాధికారులు ఎక్కడికక్కడ ఆయా ఆలయాలు, పంచాయతీ, మండల కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ఉంచుతారు. ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. గడువు ముగిసిన తర్వాత పాలక మండళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. కాగా, రూ.25 లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్, రూ.కోటిలోపు ఆదాయం ఉండే ఆలయాలకు థార్మిక పరిషత్ అనుమతితో పాలక మండలి సభ్యుల నియామకం జరుగుతుంది. -
నాలుగు జెడ్పీలకు పాలకమండళ్లు
సాక్షి, హైదరాబాద్: బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కొత్త జెడ్పీపీ చైర్పర్సన్లు , వైస్ చైర్పర్సన్లు కో ఆప్షన్ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జడ్చర్ల ఎంపీపీలు, ఎంపీటీసీలు బుధవారం తొలిసారిగా సమావేశమై బాధ్యతలు చేపట్టారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీలు పదవులు చేపట్టారు. వీరంతా బుధవారం నుంచి ఐదేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. మహబూబాబాద్ జిల్లా జెడ్పీపీని అక్కడి ఎంపీడీవో కార్యాలయంలో, ములుగు జిల్లా జెడ్పీపీని ములుగు ఎంపీడీవో ఆఫీసులో, ఖమ్మం జిల్లా జెడ్పీపీని పాత జిల్లా పరిషత్‌లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీపీని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా జెడ్పీ తొలి సమావేశంలో పీఆర్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. గత నెలలోనే 28 జెడ్పీపీల్లో పాలకమండళ్లు... గత నెల 7న 28 జిల్లా పరిషత్‌ల చైర్పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. అప్పుడు పదవుల్లోకి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్లు అదే రోజున తొలి సమావేశం నిర్వహించి పదవులు చేపట్టారు. పదవీకాలం ముగియకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నాలుగు జెడ్పీపీల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడలేదు. ఇప్పుడు అన్ని జిల్లా పరిషత్‌లలో పాలక వర్గాలు కొలువుదీరినట్టు అయింది. -
నేటితో వారందరూ మాజీలే..
సాక్షి, తూర్పు గోదావరి: ఐదేళ్ల రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పాలకమండలి పదవీకాలం మంగళవారంతో ముగుస్తోంది. పాలక మండలి సభ్యులందరూ బుధవారం నుంచి మాజీలుగా మారిపోనున్నారు. వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్పొరేటర్లు 2014 జూలై రెండో తేదీన రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ పాలమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన పంతం రజనీశేషసాయి వ్యవహరిస్తున్నారు. మళ్లీ కొత్త పాలకవర్గం ఎన్నికయ్యే వరకూ నగరపాలక సంస్థ పాలన అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో రాజమహేంద్రవరం నగరానికి విశిష్ట స్థానం ఉంది. ఈ చారిత్రక నగరంలో సుమారు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు. నగరాన్ని 50 డివిజన్లుగా విభజించారు. వాటిలో సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 42 డివిజన్లు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో 3,00, 546 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,45,319 మంది కాగా, మహిళలు 1,55,161 మంది. ఇతరులు 66 మంది జీవిస్తున్నారు. ఈ పాలకమండలిలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, స్వతంత్రులు కూడా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. వారితో పాటు వివిధ వర్గాలకు చెందిన ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల హోదాలో నగర పాలనలో భాగస్వాములుగా ఉన్నారు. ఇది మూడో పాలకవర్గం ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సార్లూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కావడం విశేషం. గత ఐదేళ్లలో నగరాభివృద్ధి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని, డివిజన్ల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పెద్దగా సహకరించలేదనే భావన ప్రజల్లో బలంగా ఉంది. పుష్కరాల సమయంలో కూడా నగరాన్ని ఏమంత అభివృద్ధి పరచలేదని, వచ్చిన నిధులను సద్వినియోగం చేయలేదనే విమర్శలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎదుర్కొంది. టీడీపీ డివిజన్లలోనే అభివృద్ధి తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టి, మిగతా పార్టీల డివిజన్లలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. పాలక మండలి బడ్జెట్లో తెలుగుదేశం వారు తమకు అనుకూలంగా నిధులను మంజూరు చేయించుకున్నారు. ఫలితంగా మిగిలిన డివిజన్లలో అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. మరోపక్క తెలుగుదేశం కార్పొరేటర్ల ఏకపక్ష నిర్ణయాల వల్ల నగరంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని ప్రజలు విమర్శిస్తున్నారు. రేపటి నుంచి అధికారుల చేతికి పగ్గాలు మంగళవారంతో కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండడంతో నగరపాలక సంస్థ పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎన్నికల నిర్వహణకు స్పష్టమైన సంకేతాలు రావడంతో ఇప్పటికే అధికారులు నగరపాలక సంస్థలో డివిజన్ల వారీగా కులగణన చేసి జాబితాలు తయారు చేశారు. 50 డివిజన్లలో ఎస్సీ, బీసీ, మహిళల గణన కూడా పూర్తయ్యింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ సిద్ధంగా ఉంది. విలీనమైతే నగర విస్తీర్ణం పెరిగే అవకాశం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో చుట్టు పక్కల గ్రామాల విలీనం జరిగితే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజక వర్గాలతో పాటు విలీనం తర్వాత రాజానగరం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు కూడా నగరపాలక సంస్థలో అంతర్భాగం అవుతాయి. అదే జరిగితే నగర వైశాల్యం పెరగడంతో పాటు ప్రస్తుతం ఉన్న 50 డివిజన్ల సంఖ్య 75కు పెరిగే అవకాశం ఉంది. -
జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జెడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల మొదటివారంలో కొత్త జెడ్పీపీలు, మండల పరిషత్‌ల నూతన పాలకమండళ్లు ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికి అనుగుణంగా మొత్తం 32 జెడ్పీపీలు, 539 మండలాల్లో సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గతంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్‌లలోని పోస్టులను కొత్తగా ఏర్పడిన 32 జిల్లా పరిషత్‌లలో సర్దుబా టు చేస్తారు. ప్రస్తుతం 9 జిల్లా పరిషత్‌లలో 9 మంది జెడ్పీ సీఈవోలు, 9 మంది డిప్యూటీ సీఈవోలు పనిచేస్తున్నారు. తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలను మరో 9 జిల్లాలకు సీఈవోలుగా, మిగిలిన 14 జిల్లాల్లో ఇదివరకే డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందిన వారిని సీఈవోలుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. తొమ్మిది జెడ్పీలలో 9 మంది అకౌంట్స్ ఆఫీసర్లు (ఏవో) పనిచేస్తున్నందున, మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు పొందిన వారిని ఏవోలుగా నియమిస్తారు. పాత జెడ్పీపీలకు మంజూరైన పోస్టులన్నీ (రీ అలొకేట్ చేయాల్సిన మినహాయించి) కొత్త జెడ్పీపీలకు కేటాయిస్తారు. పని ఒత్తిడి ప్రాతిపదికన... కొత్త జిల్లాల్లో పని ఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి పోస్టులను జెడ్పీపీలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త జెడ్పీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జెడ్పీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త జెడ్పీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త పరిషత్‌లకు కేటాయించాల్సిన మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త జెడ్పీపీలకు కేటాయించిన వారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. సిబ్బంది విభజన... మునుపటి జెడ్పీపీ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జిల్లాల కలెక్టర్లు, వాటి పరిధిలో కొత్తగా ఏర్పడిన జిల్లాల కలెక్టర్లను సంప్రదించి సొంత ప్రాంతం, మండలం, సీనియారిటీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. జెడ్పీపీల్లోని మండలాల సంఖ్య నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సర్దుబాటు ఉంటుంది. జిల్లా పరిషత్‌లలో అందుబాటులో ఉన్న వాహనాలు, ఫర్నిచర్, మౌలిక వసతులు తదితరాలను కొత్త జెడ్పీపీలకు పాత జిల్లా కేంద్రాల కలెక్టర్లు పంపిణీ చేస్తారు. కొత్త జెడ్పీపీల కోసం భవనాలను (వీలైనంత మేరకు ప్రభుత్వ భవనాల్లోనే) జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. పాత జెడ్పీపీల్లోని వాహనాలను కూడా కొత్తగా ఏర్పడిన జెడ్పీపీలకు మండలాల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. మండల పరిషత్‌లలో... కొత్తగా ఏర్పడిన 112 మండలాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 539 మండలాలుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో గత మండల ›ప్రజాపరిషత్(ఎంపీపీ) కార్యాలయాల్లోని పోస్టులను కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సర్దుబాటు చేస్తారు. కొత్త మండలాల్లో పనిఒత్తిడి, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి కొత్త పోస్టులను కొత్త ఎంపీపీలకు కేటాయిస్తారు. దీనికి అనుగుణంగా రీ అలొకేట్ కాని పోస్టుల్లోని ఉద్యోగులంతా కూడా కొత్త ఎంపీపీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా ఎంపీపీ కార్యాలయాల్లో కొనసాగుతారు. వారిని కొత్త ఎంపీపీలకు ముందస్తు(ప్రొవిజనల్)గా కేటాయించినట్టుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త మండల పరిషత్‌ల అవసరాల మేరకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. కొత్త పరిషత్‌లకు కేటాయించినవారు, ఆర్డర్ టు సర్వ్ కింద నియమితులైన (పైన పేర్కొన్న విధంగా) ఉద్యోగులు సీనియారిటీ, పదోన్నతులు, సర్వీసు అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా/జోనల్/మల్టీజోనల్ కేడర్లలో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. రద్దయిన మండలాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమీప మండలాలు లేదా కొత్తగా ఏర్పడిన మండలాల్లో సర్దుబాటు చేస్తారు. కొత్తగా ఏర్పడిన ఎంపీపీల్లో సీనియారిటీ అధారంగా ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్లను ఇన్చార్జి ఎంపీడీవోలుగా జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. 32 జెడ్పీపీ చైర్పర్సన్లు, సీఈవోలు, ఇతర సిబ్బంది, 112 ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను కేటాయిస్తారు. -
ఏయూ పాలకమండలి రద్దు
ఉన్నత విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం కట్టింది. సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ప్రస్తుత పాలకవర్గాలపై వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గం కూడా రద్దయ్యింది. 2016 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గాన్ని నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరితోనే పాలకవర్గ పదవీకాలం పూర్తి కాగా.. మరో అరు నెలలు పొడిగిస్తూ అదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న పాలకమండలి వర్సిటీ అభివృద్ధికి చేసిన కృషి మచ్చుకైనా కనిపించలేదు. అధికారులు సూచించిన వాటికి తలూపడం తప్ప విలువైన సూచనలు గానీ, తమస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయించడానికి గానీ ప్రయత్నించకుండా నామమాత్రంగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిని మార్చడానికే వైఎస్ జగన్ సర్కారు వర్సిటీలపై వేటు వేయడంతో మంచి పాలకమండలి వస్తుందన్న ఆనందం వర్సిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: విశ్వ విద్యాలయాల బలోపేతం.. ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమర్థ వంతమైన సారథులను నియమించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని మెత్తం 10 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవోఆర్టీ 82ను విడుదల చేసింది. దీంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం పాలక మండలి రద్దయింది. తాజాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆచార్య హేమచంద్రారెడ్డి నియామకం.., నేడు పాలక మండళ్లు రద్దు చేయడం ప్రభుత్వం దూకుడును స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహాలో త్వరలో వర్సిటీల్లో పూర్తిస్థాయిలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో పాలక మండలి సభ్యులుగా ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆచార్య జి.శశిభూషణరావు, డాక్టర్ సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, గ్రంధి మల్లికార్జున రావు, డాక్టర్ కె.మురళీదివి, డాక్టర్ పి.సోమనాథరావు, ఆచార్య ఎన్. బాబయ్యలను నియమిస్తూ 2016 ఫిబ్రవరి 3న అప్పటి ప్రభుత్వం జీవోఎంఎస్ 5ను జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వీరిని నియమించింది. ఆ ప్రకారం వీరి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. అయితే పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 24న జీవో 32ను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నేపథ్యంలో నేటితో పాలక మండలి పూర్తిస్తాయిలో రద్దయ్యినట్లయింది. అలాగే వచ్చే నెల 16వ తేదీతో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ అయ్యే విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సైతం త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకమండలి సమావేశంలో చర్చిస్తున్న సభ్యులు (పాత చిత్రం) నామమాత్రంగా పాలక మండళ్లు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన పాలక మండలి సభ్యులు నామమాత్రంగానే మిగిలిపోయారు. పాలక మండలి సమావేశంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి వీరు అందించిన సూచనలు మచ్చుకైనా కనిపించలేదు. వర్సిటీ అధికారులు ప్రవేశపెట్టే వివిధ అంశాలను పరిశీలించడం, అనుమతించడం, తిరస్కరించడానికే పరిమితమైంది.వర్సిటీ అధికారులకు, పాలక మండలి సభ్యులకు మధ్య సమన్వయం కుదరడానికి చాలా సమయం పట్టింది. దీంతో వర్సిటీ పాలకులకు, పాలక మండలి సభ్యులకు మధ్య అగాథం పెరిగింది. పాలక మండలి సభ్యులు వర్సిటీ వికాసానికి ఉపకరించే పథకాలు అమలు చేయడానికి సూచనలు చేయలేదు. ఆ వర్సిటీలు యథాతథమే సబ్బవరంలోని న్యాయవిశ్వవిద్యాలయం హైకోర్టు పర్యవేక్షణలో నడుస్తోంది. ఇక మారిటైం యూనివర్సిటీ కేంద్రప్రభుత్వ పరిధిలో నడుస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వీటికి వర్తించదు. నెరవేరని ఆశయం విశ్వవిద్యాలయాల పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు ఉండాలనే గత ప్రభుత్వ ఆశయం పూర్తిగా నీరుగారింది. ఏయూ పాలక మండలి సభ్యులుగా నియమితులైన గ్రంధి మల్లికార్జున రావు(జీఎంఆర్), డాక్టర్ మురళీ దివిలు ఒక్క పాలక మండలి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు.దీంతో వారు నామమాత్రమే అయ్యారు. పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాల ప్రగతిని, అమలును తర్వాత సమావేశం జరిగేలోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌గా ఏయూ అధికారులు తయారు చేసి పాలక మండలి సభ్యులకు అందించాల్సి ఉంటుంది. దీన్ని అందించడంలో వర్సిటీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. వర్సిటీకి సంబంధించిన ఆర్థిక నిర్వహణ అనుమతులు, ఇతర అత్యవసర అనుమతులు అవసరమైన సందర్భాలలో మాత్రమే పాలక మండలి సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకు సామేశం జరగాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే అవకాశం పాత పాలక మండలి రద్దు కావడంతో త్వరలో నూతన పాలక మండలి ఏర్పాటు అవుతుందని ఆచార్యులు భావిస్తున్నారు. దీంతో పాలక మండలిలో స్థానం పొందడానికి ఆచార్యులు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నారు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే చోటు లభించే అవకాశం అవకాశం ఉంటుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇంకా సాగుతున్న పాలక మండళ్లు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన యూనివర్సిటీల పాలక మండలి సభ్యులు ఇంకా కొనసాగడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ మండళ్ల కాలపరిమితి ముగిసినా ఎన్నికల ముందు మరో దఫా కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని కొనసాగించడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పాలక మండళ్లు అక్రమ నిర్ణయాలు తీసుకోకముందే వీటిని రద్దుచేయాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ సానుభూతిపరుల నియామకాలన్నీ అక్రమం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 2010లో ఉమ్మడి రాష్ట్రంలో వర్సిటీల పాలక మండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత వివిధ కారణాలతో పాలక మండళ్లను నియమించలేదు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాలకు కొలీజియం కమిటి సిఫార్సులు లేకుండగానే పాలక మండలి సభ్యులుగా తమ అనుయాయులను నియమించింది. దీనిపై అప్పట్లో రాష్ట్ర గవర్నర్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ పాలక మండలి సభ్యుల పదవీకాలం 2019 ఫిబ్రవరితో ముగిసింది. అయితే ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడిగా ఫిబ్రవరి 24న పాలక మండలి సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విచిత్రమేమిటంటే మరో నాలుగు నెలల్లో రిటైరయ్యే సభ్యుల పదవీ కాలాన్ని కూడా పొడిగించారు. ఈ కమిటీల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్, జీఎమ్మార్ గ్రూప్స్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో సహ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా నియమించారు. చంద్రబాబు ప్రచారానికి తప్ప గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా వారు సమావేశానికి రాకపోయినా, ఆ సభ్యుల పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీల రిజిస్ట్రార్లను నియమాలకు విరుద్ధంగా పాలక మండలి సభ్యులుగా నియమించారు. అధ్యాపకుల కోటాలో నాగార్జున వర్సిటీలో ఒక లైబ్రేరియన్‌ను నిబంధనలకు విరుద్ధంగా పాలక మండలి సభ్యునిగా నియమించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నిర్ణయాలు ఈ పాలక మండళ్లు స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే తీర్మానాలు చేశాయి. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సమావేశానికి ఎక్స్ఆఫీషియో సభ్యులు, ప్రభుత్వ ఉన్నతవిద్య కార్యదర్శి హాజరు కాకుండానే అనంతపురం జేఎన్టీయూ పాలక మండలి ఆమోదించింది. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం ఓ ప్రైవేట్ క్లబ్లో నిర్వహించడం వివాదాస్పదమైంది. శ్రీవేంకటేశ్వర, ఆదికవి నన్నయ్య, కృష్ణా విశ్వవిద్యాయాల్లో పాలక మండలి సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వర్సిటీల పరువును బజారుపాలు చేశాయి. తక్షణమే రద్దు చేయవచ్చు అంటున్న చట్టం విశ్వ విద్యాలయ చట్టం ప్రకారం పాలక మండలి సభ్యుల పదవికాలం సాధారణంగా మూడు సంవత్సరాలలో ముగుస్తుంది. గవర్నర్ ఎప్పుడైనా పాలక మండళ్లను రద్దు చేసేలా విశ్వవిద్యాలయాల చట్టంలో ఉంది. చట్టానికి విరుద్ధంగా ఆరు నెలలపాటు పొడిగించిన పాలక మండలి సభ్యులను వెంటనే రద్దు చేయాలనీ, నూతన ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కొత్త వారిని నియమించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొనసాగుతున్న రిజిస్ట్రార్లు గత ప్రభుత్వ హయాంలో పాలక మండళ్లను ఏర్పాటుచేసిన వెంటనే అప్పటి వరకు కొనసాగుతున్న వర్సిటీల రెక్టార్లను, రిజిస్ట్రార్లను తొలగించింది. వారి స్థానంలో అనుభవంలేని వారిని, తమ పార్టీ అనుచరులను సామాజికవర్గం ప్రాతిపదికన చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రార్లు, రెక్టారులుగా నియమించింది. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ, రాయలసీమ వర్సిటీ, జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్లు ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. రాష్ట్రంలోని మిగతా వర్సిటీలలోని అప్పటి రిజిస్ట్రార్లు ఇంకా కొనసాగుతున్నారు. ఈ రిజిస్ట్రార్లపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్సు రిపోర్టులు, ఉపకులపతి సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రార్లు, రెక్టార్లను నియమించాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో కేవలం సీఎం కార్యాలయంలోని ఒక సలహాదారు సిఫార్సుల మేరకే వీరి నియామకాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. -
ఫెయిలైన వారిని పాస్ చేసేశారు!
పాలకమండలి నిర్ణయం గుట్టు చప్పుడు కాకుండా అమలు చేసిన ఎన్టీఆర్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా ప్రమాణాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాతరేసింది. పీజీ మెడికల్ - 2016 పరీక్షలు ఈనెల 24 న నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో.. కేవలం నాలుగు రోజుల ముందు (ఈనెల 20న) రహస్యంగా గ్రేస్ మార్కులు కలిపేసింది. తద్వారా వైద్యవిద్యలో ప్రతిభ, నైపుణ్యం లేని ఆ 8 మందిని పరీక్షల నుంచి గట్టెక్కించింది. ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు, వైద్య విద్యా ప్రమాణాలకు పాతరేయడమేనని వైద్య నిపుణులు మండిపడుతున్నారు. ప్రభు త్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో గ్రేస్ మార్కులు కలిపేం దుకు యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ నెల మూడో తేదీన ‘సాక్షి’ బట్టబయలు చేసింది. -
తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు?
తిరుమలకు ఇప్పటికే ఉన్న రెండు ఘాట్ రోడ్లకు తోడు మరో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ తలపెట్టింది. దీనిపై సాధ్యాసాథ్యాలను నిర్ణయించాల్సిందిగా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో వైద్య సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక బృందాలను పంపనున్నట్లు ప్రకటించింది. సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. పాలక మండలి సమావేశంలో అనేక అభివృద్ధి పనులపై నిర్ణయాలు తీసుకున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని రూ100 కోట్లతో అభివృద్ధి చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తొలి విడతగా..రూ.20కోట్లు మంజూరు చేయనున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన గోల్డ్ స్కీమ్ లో శ్రీవారి నగలు ఉంచాలని నిర్ణయించారు. వడ్డీ ఎక్కువగా వచ్చే పక్షంలో ఈ పథకం ఉపయోగించుకోవాలని పాలక మండలి భావిస్తోంది. కోటీ ఆరు లక్షల రూపాయలు వెచ్చించి శ్రీవారి పట్టువస్త్రాలను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఏకాదశి గందరగోళం.. కాగా.. వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి పాలకమండలి సమావేశంలో పాలక మండలి, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏకాదశి పాసుల వ్యవహారం ఇరు వర్గాల మధ్య బేదాభిప్రాయాలకు కారణమని తెలుస్తోంది. ఏకాదశికి కోరినన్ని పాసులు ఇవ్వాలని పాలక మండలి సభ్యులు డిమాండ్ చేశారు. కాగా.. దీనిపై అధికారాలు స్పందించలేదు. దీంతో పాసుల విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. -
ఎంతో మంది చూపు...
- భద్రాద్రి దేవస్థానం పాలక మండలిపై కసరత్తు - దరఖాస్తుదారుల జాబితాపై పరిశీలన పూర్తి - భద్రాచలం నుంచి తలపడుతున్న 27 మంది.. - బయటి జిల్లాల నుంచీ పోటీ.. - మంత్రి తుమ్మల ఆశీస్సుల కోసం యత్నాలు భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండలి ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలక మండలిలో చోటు కల్పించాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమగ్ర వివరాలపై ఇప్పటికే పరిశీలన పూర్తయింది. దేవాదాయశాఖకు చెందిన ఓ ప్రత్యేక అధికారి అభ్యర్థుల వివరాలను సేకరించి, ఉన్నతాధికారులకు అందజేశారు. భద్రాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎంపికయ్యేందుకు ఇలా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితా దేవాదాయశాఖ కమిషనర్‌కు చేరింది. విచారణ అనంతరం సిద్ధం చేసిన జాబితా నేడో రేపో దేవాదాయశాఖ నుంచి ప్రభుత్వానికి అందనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దసరాకు ముందే ప్రభుత్వం పాలక మండళ్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోకల్ డిమాండ్ దేవస్థానం పాలకమండలిలో చోటు కల్పించాలని కోరుతూ భద్రాచలం నుంచి 27 దరఖాస్తులు అందారుు. గతంలో ట్రస్టుబోర్డు సభ్యులుగా పనిచేసిన వారితో పాటు వివిధ రంగాలకు చెందిన వారు, టీఆర్ఎస్ నేతలు దరఖాస్తు చేశారు. దేవస్థానం పాలక మండలిలో 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఒకరు చైర్మన్‌గా నియమితులవుతారు. వీరిలో దేవస్థానం ప్రధానార్చకుల్లో ఒకరిని నామినేటెడ్‌గా ఎంపిక చేయటం ఆనవారుుతీ. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011 నవంబర్‌లో భద్రాద్రి పాలక మండలిని నియమించారు. ఇది రెండేళ్ల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు పాలకమండలిని నియమించలేదు. ఎవరిని వరించేనో..! రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో భద్రాచలం దేవస్థానం పాలకమండలిలో చోటు కోసం గట్టి పోటీనే ఉంది. చైర్మన్ పదవి కోసం భద్రాద్రి వాసులే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాలక మండలి చైర్మన్ రేసులో భద్రాచలానికి చెందిన ఓ విద్యాసంస్థల అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి తుమ్మలకు నమ్మినబంటు కావడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఆయనకు ఒకింత ఎక్కువే కావడంతో అతని వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ఆదాయం పెరుగుతున్నా అభివృద్ధి లేదు.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి ఏటేటా ఆదాయం పెరుగుతున్నా ఆ స్థారుులో అభివృద్ధి మాత్రం జరగటం లేదు. భక్తులిచ్చే కానుకులు, హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయంలో ఉత్సవాల నిర్వహణ, ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు చెల్లించాలి. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆలయాభివృద్ధి జరుగటం లేదు. దేవస్థానానికి పాలక మండలి ఉంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టే అవకాశం ఉంది. దాతల నుంచి వివిధ రూపాల్లో పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి ఉంటే ప్రయోజనాలనేకమనే వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది. -
చాంపియన్స్ లీగ్ టి20 రద్దు
♦ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం ♦ 8 జట్లతోనే ఐపీఎల్! న్యూఢిల్లీ : చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై రెండేళ్ల నిషేధం విధించి ఒక్క రోజు కూడా గడవకముందే క్రికెట్లో మరో పరిణామం చోటు చేసుకుంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు సంయుక్తంగా నిర్వహిస్తున్న చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేస్తూ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. మూడు దేశాలు ఏకగ్రీవంగా దీనికి ఆమోద ముద్ర వేశాయి. టోర్నీకి సరైన ప్రజాదరణ లేదని గతంలోనే రద్దు ప్రతిపాదనలు వచ్చినా... స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్తాన్, చెన్నై ఫ్రాంచైజీలపై వేటు పడటంతో ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టింది. ప్రజాదరణ దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం సరైందేనని కౌన్సిల్ తెలిపింది. సీఎల్‌టి20ని బీసీసీఐ, సీఏ, సీఎస్‌ఏలు కలిసి 2009లో ఏర్పాటు చేశాయి. ఎనిమిది జట్లతోనే ఐపీఎల్! చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై నిషేధంతో షాక్‌కు గురైన బీసీసీసీఐ మళ్లీ ఎనిమిది జట్లతోనే ఐపీఎల్‌ను నిర్వహించే దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు బోర్డు ఉన్నతాధికారులు దీనిపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం అనధికారికంగా చర్చలు కూడా ప్రారంభించారని సమాచారం. ఆదివారం ముంబైలో జరిగే ఐపీఎల్ పాలకమండలి అత్యవసర సమావేశం నాటికి దీనిపై తుది నిర్ణయానికి రావాలని భావిస్తున్నామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తు తం బీసీసీఐ రెండు రకాల ఆలోచనలు చేస్తోందన్నారు. ‘మొదటి అవకాశంగా... నిషేధానికి గురైన రెండు ఫ్రాంచైజీల జట్లను బోర్డు ఆధ్వర్యంలో కొనసాగించాలని అనుకుంటున్నాం. నిషేధం ముగిశాక పాత యజమానులు వాటి బాధ్యతలు తీసుకుం టారు. ఇక రెండో అవకాశం... కొత్త ఫ్రాంచైజీలకు బిడ్లను పిలవడం’ అని ఆ అధికారి పేర్కొన్నారు. నాకు అన్యాయం చేశారు: కుంద్రా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో లోధా కమిటీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని రాజస్తాన్ ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు చాలా నిరాశ కలిగించిన రోజు. నా నిజాయితీకి సవాలు ఎదురైంది. విచారణలో నేను ఇచ్చిన మద్దతే నాకు వ్యతిరేకంగా పని చేసింది. సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ నా కేసు విషయంలో ఇప్పుడు దాన్ని శంకించాల్సి వస్తోంది. నాకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని చూసైనా శిక్ష విషయంలో కాస్త సంతృప్తి పడతా’ అని కుంద్రా పేర్కొన్నారు. -
ప్రపంచానికి భారత్ అవసరం ఏర్పడుతుంది
-
విమ్స్ ఖజానా ఖాళీ..!
మూడు నెలలుగా విమ్స్ సిబ్బందికి జీతాల్లేవ్ బడ్జెట్ రాలేదంటున్న విమ్స్ అధికారులు కాంట్రాక్ట్ సిబ్బందిపై పాలక మండలి శీతకన్ను బళ్లారి (తోరణగల్లు): నెలంతా పనిచేస్తే వచ్చే జీతంతోనే ఇంటి అద్దె, ఇంటికి కిరాణా సరుకులు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటిది అసలు జీతమే రాకపోతే పరిస్థితి ఏంటని విమ్స్ ఉద్యోగులు వాపోతున్నారు. మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. వైద్యులు, అధికారుల పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి, వైద్య కళాశాలల్లో సుమారు 10 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ పద్దతిపై పని చేసే స్టాఫ్ నర్సులు, ల్యాబ్, ఎక్స్‌రే, ఎంఆర్డీ, ఆప్తాల్మాలజీ, టెక్నీషియన్లతో పాటు గుమస్తాల పరిస్థితి దయనీయంగా మారింది. శాశ్వత ఉద్యోగులకు మాత్రం నెలనెలా 5వ తేదీ లోపు జీతాలు చెల్లిస్తున్నారు. కాని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం గత నెల జీతం ఈ నెలాఖరున చెల్లిస్తు పాలక మండలి పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పైగా శాశ్వత ఉద్యోగులు విధులకు హాజరుకాక పోయినా సంతకాలు చేసి వెళ్లిపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి పనులను కాంట్రాక్ట్ ఉద్యోగులపై మోపుతున్నారు. ఇంత చేసినా జీతాలు మాత్రం సకాలంలో చెల్లించకుండాజాప్యం చేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో పిల్లలను పాఠశాలల్లో చేర్చలేక నానా తంటాలు పడుతున్నామని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయంపై విమ్స్ కార్యాలయ అధికారులను వివరణ కోరగా విమ్స్‌లో ఖజానా ఖాళీ అయింది. విమ్స్ అకౌంట్లో కేవలం 200 రూపాయలు మాత్రం ఉంది. ఈ పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు, ఏబీసీడీ గ్రూపు ఉద్యోగులకు బడ్జెట్ వస్తేగాని జీతాలు చెల్లించలేమని చేతులెత్తేశారు. -
రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ
-
రేపు వైఎస్సార్సీపీ రెండవ ప్లీనరీ
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో ప్లీనరీ (ప్రజాప్రస్థానం) ఫిబ్రవరి రెండో తేదీన నిర్వహించనున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో జరగనున్న ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికతోపాటు ఇతర సంస్థాగత కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగానే నేటి మధ్యాహ్నం పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యులు సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలకు కావాల్సిన షెడ్యూలును వైఎస్సార్ సీపీ నేతలు విడుదల చేయనున్నారు. ఇడుపులపాయలో చురుగ్గా ప్లీనరీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్లీనరీ ఏర్పాట్లును పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.