వైద్య విద్యా ప్రమాణాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాతరేసింది. పీజీ మెడికల్ - 2016 పరీక్షలు ఈనెల 24 న నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో..
పాలకమండలి నిర్ణయం గుట్టు చప్పుడు కాకుండా అమలు చేసిన ఎన్టీఆర్ వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యా ప్రమాణాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పాతరేసింది. పీజీ మెడికల్ - 2016 పరీక్షలు ఈనెల 24 న నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో.. కేవలం నాలుగు రోజుల ముందు (ఈనెల 20న) రహస్యంగా గ్రేస్ మార్కులు కలిపేసింది. తద్వారా వైద్యవిద్యలో ప్రతిభ, నైపుణ్యం లేని ఆ 8 మందిని పరీక్షల నుంచి గట్టెక్కించింది.
ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు, వైద్య విద్యా ప్రమాణాలకు పాతరేయడమేనని వైద్య నిపుణులు మండిపడుతున్నారు. ప్రభు త్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో గ్రేస్ మార్కులు కలిపేం దుకు యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ఈ నెల మూడో తేదీన ‘సాక్షి’ బట్టబయలు చేసింది.