వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు | YSR Congress today to meet a wide range | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు

Published Sun, Sep 28 2014 1:28 AM | Last Updated on Fri, Aug 17 2018 8:06 PM

వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు - Sakshi

వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు

  • పార్టీ బలోపేతమే లక్ష్యం
  •  జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
  • యలమంచిలి : విశాఖ రూరల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం యలమంచిలి గుర్రప్ప కల్యాణమండపంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం యలమంచిలిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్‌నాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.

    గత ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు, బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎదుర్కోవడం, వంటి అంశాలు అజెండాగా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement