వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ ఉద్యోగులు
Published Wed, Mar 22 2017 7:26 PM | Last Updated on Wed, Sep 5 2018 3:59 PM
విజయవాడ: వైఎస్‌ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధుల బృందం బుధవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసింది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి పత్రం అందజేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరింది. విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులతో మాట్లాడిన వైఎస్ జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement