హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్(రిజిస్టర్డ్ నెంబర్ హెచ్-129) వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్‌లో విలీనమైంది. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో విలీన కార్యక్రమం జరిగింది. యూనియన్ నాయకులందరికీ జగన్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. 2012 నుంచి కొనసాగుతున్న హెచ్-129 యూనియన్‌లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యుత్ సంస్థలకు చెందిన 2,000 మంది సభ్యులుగా ఉన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు తమ యూనియన్‌ను వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్‌లో విలీనం చేశామని యూనియన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.సుధాకర్‌రెడ్డి తెలిపారు.
వైఎస్సార్‌సీపీ మాత్రమే కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలను పరి రక్షిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ట్రేడ్‌యూనియన్ తరపున పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్ టీ యూసీలో చురుగ్గా ఉన్న ఉద్యోగులను తణుకు, తాడేపల్లిగూడెం, ఉభయగోదావరి జిల్లాల్లో సుదూర ప్రాం తాలకు బదిలీ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం బదిలీల్లో లంచాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కారక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు.
వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘంలో ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ విలీనం
Published Thu, Dec 11 2014 2:52 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement