సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ శర వేగంగా సాగుతోంది. లాక్‌డౌన్‌తో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు శుక్రవారం ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు 52 లక్షల మందికి పింఛన్లు పంపిణీ జరిగింది. ఉదయం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి మే నెల పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నవారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment