సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి వైస్సార్ రైతు భరోసా కార్యక్రమ అమలుకు శ్రీకారం చుట్టారని డిప్యూటి సీఎం ఆళ్లనాని అన్నారు. మంగళవారం ఆయన ఏలూరులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు అధ్యాయంలో వైఎస్సార్ రైతుభరోసా విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఈ పథకాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల 23వేల మంది రైతులుకు వైస్సార్ రైతు భరోసా సాయం అందుతుందని వెల్లడించారు. వైస్సార్ కంటి వెలుగు ఒక చారిత్రత్మమైన కార్యక్రమమని ఈ పథకానికి ప్రభుత్వం సుమారు రూ. 560 కోట్లను కేటాయించిందన్నారు. రైతులుకు 9గంటలు విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులు ఆత్మహత్యలుకు పాల్పడకూడదని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని నాని పేర్కొన్నారు.
కడప: ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రడ్డి అమలు చేస్తున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా అన్నారు. ఆయన మైదుకూరు మండలలోని తెలుగు గంగ ప్రాజెక్టు కాలనీలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 2020 మే నెల నుంచి ఇస్తామన్న రైతు భరోసాను ఎనిమిది నెలల ముందే చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు. కౌలు రైతులతో సహా రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, రైతులు పాల్గొన్నారు.
విజయవాడ: రైతు కళ్లల్లో ఆనందం నింపేందుకు ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుభరోసా పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం ఆయన కుందా వారి కండ్రికలో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్ పశునష్ట పరిహార పథకం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కర్షకుల కష్టాలు చూసి మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రైతులకి చంద్రబాబు ద్రోహం చేస్తే.. రైతు సంక్షేమంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ నమ్మారని పేర్కొన్నారు.
పెనమలూరు: దేశంలోనే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందచేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదే అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. మంగళవారం ఆయన ఉయ్యూరులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తమదేనని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. సీఎం జగన్ ఒక అడుగు ముందుకేసి పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ.13,500 పెంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతోపాటు సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్, అధికారిలు, రైతులు పాల్గొన్నారు.
పెడన: కృష్ణాజిల్లా పెడన పట్టణంలో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని మంగళవారం ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు వేలాది మంది రైతులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళావారం మర్కెట్ యార్డులో వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మర్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్స్‌ను పరిశీలించారు.
ప్రకాశం: జిల్లాలోని సంతనూతలపాడు మార్కెట్ యార్డులో నిర్వహించిన వైఎస్సార్ రెైతు భరొసా పథకాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మొదటి విడత చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన వ్యవసాయ శాఖకు సంబంధించిన స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గోన్నారు.
విశాఖప్నం: జిల్లాలోని చీడికాడలో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పభకాన్ని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సందీప్, రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కిలపర్తి భాస్కరరావు, రాజారాం, కర్రి సత్యం, బూరే బాబురావు, ఎర్రా అప్పారావు, రాజుబాబు పాల్గొన్నారు. రైతు శ్రేయస్సు కోసమే నిరంతరం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పాడేరు ఎమ్మెల్యే కోటగెళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం జిల్లాలోని చింతపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఐటీడీఏ పీఓ బాలాజీ, ఎంపీడీఓ ప్రేమకర్ పాల్గొన్నారు.
ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని చెప్పిన గడువుకు ముందే ప్రారంభించడం తన చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల రుణమాఫీ పేరుతో ఐదేళ్లు రైతులను మభ్యపెట్టిందని విమర్శించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
చోడవరం: విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, ఎమ్మెల్యే కరణం ధర్మ, రైతులు, అధికారలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అరకు: గిరిజన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీటి వేస్తుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. మంగళవారం ఆయన అరకులో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 56 వేల మంది రైతులకు రైతు భరోసా ద్వారా వ్యవసాయ పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం: జిల్లాలోని శింగణమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధికారులు, రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు భరోసా పథకం కింద అదనంగా రూ. వేయి పంపుపై రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రైతులకు కృతజ్ఞతగా వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
చిత్తూరు: రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, రైతులు, అధికారులు, వైఎస్సార్‌పీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాప్తాడు: అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. రైతుల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్న రోజని కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం నిర్వహించని వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిపాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన నాలుగు నెలల కాలంలో ఏ సీఎం అమలు చేయని పధకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని తెలిపారు.
హిందూపురం: దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రైతులను తన భుజాల మీద మోసి వ్యవసాయం అంటే పండుగ అని తెలియచేశారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన అసత్య హామీలతో మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం ఆయినాక వానలు వచ్చి చెరువులు నిండి రాష్ట్రమంతా జలకళలో నిండి ఉందని మాధవ్ తెలిపారు.
ప్రకాశం: జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో నిర్వహించిన వైస్సార్ రైతు భరోసా పథకాన్ని ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. 37 వేల 925 మంది రైతుకలు రైతు భరోసా పధకం ద్వారా 51 కోట్ల రుణాలను ఎమ్మెల్యే అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment