సాక్షి, కాకినాడ : పెదపూడి ఎస్సై కిషోర్‌బాబు వేధింపులు తాళలేక వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. పెదపూడికి చెందిన పెంకే ఏకాశిని ఎస్సై కిషోర్‌బాబు గత కొద్ది కాలంగా అకారణంగా వేధిస్తున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. అధికారుల తీరుతో విరక్తి పొందిన ఏకాశి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షడు కరసాల కన్నబాబు, అనపర్తి కోఆర్డినేటర్ సూర్యనారాయణ రెడ్డిలు ఆస్పత్రికి చేరుకొని ఏకాశిని పరామర్శించారు. తక్షణమే పెదపూడి ఎస్సై కిషోర్‌బాబును సస్పెండ్ చేసి కేసునమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే పోలీసు యంత్రాంగంపై ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment