హిందూపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన ఇద్దరు నాయకులు అనంతపురం జిల్లా హిందూపురంలో సెల్ టవర్ ఎక్కారు. శనివారం ఉదయం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో విజయ్, దాదు లు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరో వైపు పట్టణంలోని సద్బావన సర్కిల్‌లో బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జి జరిపి చెల్లా చెదురు చేశారు.
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వినయ్‌తోపాటు పది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా, గుంతకల్ పట్టణంలో నిర్వహిస్తున్న బంద్ తో జనజీవనం స్తంభించింది. 200 పెట్రోల్, డీజిల్ రవాణా ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.