- కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ అధినాయకత్వం
- రాష్ర్ట అధికార ప్రతినిధిగా కొయ్య ప్రసాద్‌రెడ్డి
- రాష్ర్ట కార్యదర్శిగా ఉమారాణి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కమిటీతో పాటు అనుబంధ విభాగాల రాష్ర్ట కమిటీల్లో కూడా జిల్లాకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో జిల్లా నూతనకార్యవర్గాన్ని కూడా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. అన్ని నియోజకవర్గాలకు..అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ ప్రకటించిన ఈ కమిటీ కూర్పు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ అధిష్టానం ప్రకటించింది.వైఎస్సార్‌సీపీ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధిగా కొయ్య ప్రసాదరెడ్డిని రాష్ర్ట కార్యదర్శిగా పీలా ఉమారాణిని నియమించారు. అనుబంధ విభాగాల రాష్ర్ట కమిటీల్లో కూడా విశాఖజిల్లాకు మరింత ప్రాధాన్యతనిచ్చింది. రాష్ర్ట పబ్లిసిటీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జి.రవికుమార్ (రవిరెడ్డి), కార్యదర్శిగా బీఎన్‌వి రామకృష్ణంరాజు, ఎస్సీసెల్ రాష్ర్ట సంయుక్త కార్యదర్శిగా అల్లంపల్లి రాజబాబు, రాష్ర్ట మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా అంబటి విజయరావులను నియమిస్తూ పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
110 మందితో జిల్లా కార్యవర్గం ఏర్పాటు: జిల్లా నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్‌నాథ్ వ్యవహరిస్తుండగా, ఈయన నాయకత్వంలో పనిచేసే జిల్లా కమిటీతో పాటు అనుబంధ కమిటీల నియామకాలను కూడా అధిష్టానం పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షునిగా అమర్‌నాథ్, ప్రధాన కార్యదర్శులుగా పీజేకే వర్మ, పేర్ల విజయ చందర్, మెల్లి అప్పారావు (తూర్పు), సేనాపతి అప్పారావు, సదరంచిన అప్పారావు, మువ్వల పోలా రావు (ఉత్తరం), బాకి శ్యామ్‌కుమార్‌రెడ్డి,ఆళ్ల పైడిరాజు, (పశ్చిమ), పద్మనాభం అమ్మాజీ (దక్షిణం), గొర్లె రామునాయుడు(పెందుర్తి), కార్యనిర్వాహక కార్యదర్శులుగా పీతల పోలరావు, రాగతి అచ్యుతరావు, గుడ్ల పోలిరెడ్డి, ఆకేళ్ల రమణమూర్తి, సత్తి మందారెడ్డి (తూర్పు), లండా రమణ, ఎన్.మల్లిబాబు (దక్షిణ), సనపాల త్రినాధ్‌స్వామి, పెదిరెడ్ల వెంకట్రావు(బాబులు) , బొడ్డేటి గంగ మహేష్, పైడి శ్రీను, సింగంపల్లి రామారావు (ఉత్తరం), బల్లా లక్ష్మణరావు, గేదెల రమణె (పశ్చిమ), యతిరాజుల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరావు (పెందుర్తి), వెంపాడ అప్పారావు, ప్రగడ వేణుబాబు, బొడ్డు నరసింహపాత్రుడు (కేబుల్‌మూర్తి, నక్క రమణబాబు (గాజువాక), పార్టీ కార్యదర్శులుగా ఇమంది సత్యనారాయణ, గుడ్ల రామ్మూర్తిరెడ్డి, కోట్టెం చిన్నంనాయుడు, గూడపాటివిక్టర్, పీలా బాలరాజు, మెగ్గా ఆదినారాయణ, పిల్లా దాసరాజు, ఎండి మక్‌బుల్, పిఎస్ నాయుడు.
పీతల మహేష్, చల్లా రామారావురెడ్డి, వైదా నారాయణరావు, సీహెచ్ చిరంజీవిరెడ్డి (తూర్పు), బంగారి వేణు, సయ్యద్‌అబ్బార్, పీతల వాసు, బొగ్గు శ్యామ్, పాల శ్రీహరిరెడ్డి(దక్షిణం), పైడి ప్రతాప్, జీవీ రమణారెడ్డి, బి.తిరుమల రావు(ఉత్తరం),ఆడారి శ్రీను, ధర్మాల అప్పారావు, వెదుర్ల శ్రీనివాస రావు, కె.పైడి రత్నాకర్, కొణతాల నర్సింగరావు, ఉరుకూటి శ్రీనివాసరావు, మద్దాల శీను, చల్లా ఈశ్వరరావు(పశ్చిమ), గుర్రం శ్రీను,వెలగల పరశురామ్(మెడికల్ బాబు), ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి, ఈగలపాటి యువశ్రీ, సండ్రాన నూకరాజు, వెంపాడ అప్పారావు(గాజువాక), రాపర్తి మాదవ్, జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులుగా ఎవిఎస్ నాయుడు(ఉత్తర), నడింపల్లి కృష్ణంరాజు (తూర్పు), కాకర్లపూడి నరసింహమూర్తి రాజు(పెందుర్తి),కోశాధికారిగా ఎన్.మంగా రాజు (గాజువాక), జిల్లా అధికార ప్రతినిధులుగా ఉరుకూటి అప్పారావు (గాజువాక), గుత్తుల నాగభూణం(దక్షిణం), పీతల మూర్తి(తూర్పు).
బయగానిసన్నికృష్ణ (అల్ఫాకృష్ణ)(పశ్చిమ), పామేటి బాబ్జి (ఉత్తరం), జిల్లా సంయుక్త కార్య దర్శులుగా తాటికొండ జగదీష్, రాజాన రామారావు, పోలవరపు శ్రీహరి, పెద్దిరెడ్ల ఈశ్వరరావు, ఆకులదుర్గ, కాకి అప్పలరెడ్డి, నాడిగట్లసూర్యనారాయణ(గాజువాక), సరకం నాగేశ్వరరావు, సాగ జగపతి (తూర్పు), ఎన్. రవికుమార్, మహ్మద్ రఫీ, కొణతాల రేవతి రావు,(ఉత్తర), అర్జిల్ల మసేను, పల్లా శ్రీను (దక్షిణం), సీహెచ్ శ్రీనివాసరావు, పీలా అనంత కుమార్, కొల్లి నూకిరెడ్డి (పశ్చిమ), గొంతిన చైతన్య (గాజువాక)లతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కాళ్ల అశోక్‌కుమార్,కోరాడ చంటి, ఆకుల అప్పరాజు, సింగంపల్లి త్రినాధ్‌రావు, కండేపల్లిసుందర్ రావు, చీపుళ్ల రామారావు, చింతలపూడి వెంకటరమణ, ఉప్పాడ ఆదిబాబు, వాకమల్లి జోగా రావు మురళి, వల్లి శ్రీనివాసరావు(దక్షిణం), సీహెచ్ మారుతినాయుడు, షేక్ బాబ్జి, కాళ్ల అప్పలనాయుడు, ఓం నమశ్శివాయ, హరిపట్నాయక్, గండ్రటి ఉగాది(ఉత్తరం) లను నియమించారు.
డివిజన్ కమిటీ అధ్యక్షులు వీరే: డివిజన్ల అధ్యక్షులను కూడా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్‌కు ఎస్. హేమంత్‌కుమార్, 32వ డివిజన్‌కు కేవి బాబా, 33వ డివిజన్‌కు దుప్పలపూడి శ్రీనివాసరావు, 35వ డివిజన్‌కు కె.సతీష్, 37వ డివిజన్‌కు బొడ్డేటి నాగేశ్వరరావు(నాగు), పెందుర్తి నియోజక వర్గ పరిధిలో ఉన్న 55వ డివిజన్‌కు బట్టు సన్యాశిరావు,57వ డివిజన్‌కు దాడి నూకరాజు, 69వ డివిజన్‌కుదాసరి రాజు, గాజువాక నియోజక వర్గ పరిధిలోని 58వ డివిజన్‌కు ఆజ్‌కుమార్ ఆచార్య, 59వ డివిజన్‌కు బోగాది సన్యాశిరావు, 60వ డివిజన్‌కు ఉరుకూటి అప్పారావు, 65వ డివిజన్‌కు వరదాడ వెంకట రమణలు నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది.
అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే
అదే విధంగా విశాఖనగర పరిధిలోని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా అధినాయకత్వం ప్రకటించింది. నగర యువజన విభాగానికి విల్లూరి భాస్కరరావు, మహిళా విభాగానికి పసుపులేటి ఉషాకిరణ్, ట్రేడ్ యూనియన్ విభాగానికి కలిదిండి బద్రినాధ్, మైనార్టీ సెల్‌కు మహ్మద్ షరీఫ్, ఎస్సీసెల్‌కు బోను శివరామకృష్ణ, సాంస్కృతిక విభాగానికి బయ్యవరపు రాధ, ప్రచార విభాగానికి బర్కత్ అలీ, నగర టీచర్స్ ఫెఢరేషన్ కమిటీ అధ్యక్షునిగా దేముడు ఎద్దు, డాక్టర్ల విభాగానికి డాక్టర్ జగదీష్ ప్రసాద్ బల్లారపు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షునిగా తిప్పల వంశీ, నగరసేవాదళ్ అధ్యక్షునిగా సిరతల శ్రీనివాస్‌లను నియమించింది.
భీమిలి పట్టణాధ్యక్షునిగా అక్కరమాని
భీమిలి మున్సిపాల్టీ అధ్యక్షునిగా అక్కరమాని వెంకట్రావును పార్టీ అధినాయకత్వం నియమిం చింది. అలాగే భీమిలి మండల పార్టీ అధ్యక్షునిగా శ్రీనివాస్‌రెడ్డి, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షునిగా బంక సత్యం, పద్మనాభం మండల పార్టీఅధ్యక్షునిగా మద్ది రాంబాబులను నియమించింది.
వైఎస్సార్‌సీపీ సారథులు
Published Tue, Apr 14 2015 3:21 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement
Advertisement