District Committee
-
‘కారు’ స్టీరింగ్ ఎవరికో..!?
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై గులాబీ నేత కేసీఆర్ మళ్లీ దృష్టి సారించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీజీగా ఉన్న ఆయన.. పార్టీ సంస్థాగత పటిష్టత కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో మళ్లీ జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించిన ఆయన జూన్ నెలాఖరువరకు పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో జిల్లా కమిటీలు వేయడానికి టీఆర్ఎస్ అధిష్టానం సన్నద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. గతేడాది వరంగల్‌లో జరిగిన సభలో జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గస్థాయి కమిటీలు, జిల్లాస్థాయి సమన్వయకర్తలను నియమించాలని తీర్మానించింది. సమన్వయ కర్తలను నియమించినా.. క్షేత్రస్థాయిలో వారి పనితీరు ఆశాజనకంగా లేదు. దీంతో పార్టీలో నేతలను నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో అధిష్టానం మళ్లీ జిల్లా కమిటీల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే జూన్ నెలాఖరులోగా కమిటీల తంతు పూర్తి చేసేందుకు కసరత్తు మొదలెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం. ప్రయోజనం లేని ‘పరిశీలకుల’ ప్రక్రియ.. అందుకే జిల్లా కమిటీలకే మళ్లీ మొగ్గు జిల్లా కమిటీల విధానానికి స్వస్తి పలికిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలకు శ్రీకారం చుట్టింది. 2017 అక్టోబర్ 26న పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పలువురు సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుని ఈ జిల్లాకు చెందిన వారిని పొరుగు జిల్లాకు, పొరుగు జిల్లా నేతలను ఈ జిల్లాకు నియమించారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. అదే విధంగా హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల అప్పగించారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను సిద్దిపేట, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఒక్కరినీ నియమించారు. జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించాక కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ‘వి–కన్వెన్షన్’లో ఓ సమావేశం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటికీ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. దీంతో పార్టీ కేడర్ నియంత్రించే సి స్టం దెబ్బతినడంతో మళ్లీ జిల్లా కమిటీలవైపే అధిష్టానం మొగ్గు చూపింది. కొత్త సారథుల ప్రకటనపై ఉత్కంఠ నియోజకవర్గం సమన్వయ, పరిశీలన కమిటీల ప్రయోగం వికటించడంతో మళ్లీ జిల్లా కమిటీలపై అధిష్టానం మొగ్గుచూపగా.. కొత్త సారథులు ఎవరనే ఉత్కంఠ పార్టీ కేడర్‌లో మొదలైంది. అంతకు ముందు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మానకొం డూరుకు చెందిన జీవీ.రామకృష్ణారావు పేరు ఫైనల్‌కు వచ్చింది. అయితే ఆయనకు ‘సుడా’ చైర్మన్ దక్కడంతో ప్రస్తుతం కరీంనగర్‌కు చెందిన కట్ల సతీష్, వై.సునీల్‌రావు, హుజూరాబాద్ నుంచి బం డ శ్రీనివాస్, తన్నీరు శరత్‌రావు పేర్లు తెరమీదకు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి రఘువీర్‌సింగ్‌ను జిల్లా గ్రంథాలయ సంçస్థ పదవి వరించగా.. ప్రధానంగా కమాన్‌పూర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణా రెడ్డి, కోరుకంటి చందర్ పే ర్లు వినిపిస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల నుంచి కల్వ కుంట్ల గోపాల్‌రావు, చిక్కాల రామారావు, మో హన్‌రెడ్డి, ప్రవీణ్ పేర్లు వినిపిస్తున్నా.. తోట ఆగయ్యకే ప్రాధాన్యం దక్కనుందంటున్నారు. జగి త్యాల నుంచి గతంలో డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు, బాదినేని రాజేందర్, మిట్టపల్లి సుదర్శన్, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, గొడిశాల రాజేశంగౌడ్ పేర్లు వినిపించాయి. రాజేశం గౌ డ్, శ్రీకాంత్‌కు నామినేటెడ్ పదవులు దక్కగా.. బా దినేని రాజేందర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకుని పోలీసుకేసుల వరకు వెళ్లారు. దీంతో డాక్టర్ సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా టీఆర్ఎస్ నియోజకవర్గ కమి టీలు, సమన్వయకర్తల నియామకంపై వెనక్కి త గ్గి జిల్లా కమిటీలను నియమించేందుకు అధిష్ఠా నం మొగ్గు చూపుతుండటంతో పార్టీలో పదవుల కోసం ద్వితీయశ్రేణి నేతలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కాలం కావడంతో చిన్న ప దవిఉన్నా చక్రం తిప్ప వచ్చునని గులాబీ తమ్ము ళ్లు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరికీ దక్కుతాయన్న చర్చ ఆ పార్టీ కేడటర్లో హాట్ టాఫిక్‌గా మారింది. -
ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి
– జిల్లాస్థాయి కమిటీకి జేసీ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కొత్తగా గుర్తించిన ఇసుక రీచ్‌లను జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి ఫీజు బులిటీకి అవకాశం ఉందా లేదా అనే దానిపై వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. సోమవారం రాత్రి తన ఛాంబర్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుంగభద్రలో కౌతాళం మండలం గుడికంబాలిలో మూడు, నదిచాగిలో రెండు, హొళగుంద మండలం ముదటమాగిలో రెండు రీచ్‌లను గుర్తించినట్లు తెలిపారు. దేవనకొండ మండలంలోని హంద్రీ, ఇతర వాగులు, వంకల్లో ఏడు రీచ్‌లు గుర్తించామన్నారు. వీటిలో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని పరిశీలించాలన్నారు. ఇందుకు ఇరిగేషన్ ఎస్ఈ, భూగర్భ జలవనరుల శాఖ డీడీ, మైనింగ్ ఏడీ, సంబంధిత ఆర్డీఓలు రీచ్‌లను పరిశీలించి వచ్చే సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. హంద్రీ వెంట 36 గ్రామాలు ఉండగా లక్ష క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉన్న గ్రామాలు 15 ఉన్నాయన్నారు. వీటిలో కూడా ఇసుక తీసేందుకు వాల్టా చట్టం ప్రకారం అవకాశం ఉందా లేదా అనేదానిని అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రవీందర్రావు, ఇరిగేషన్ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి!
ఇక జిల్లా కమిటీలు లేనట్లే టీఆర్ఎస్లో గందరగోళం ముఖ్య నేతల నారాజ్ వరంగల్ : అధికార పార్టీ టీఆర్ఎస్లో పదవుల కోసం ఎదురుచూపులకు ఇప్పట్లో తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. నామినేటెడ్, ఇతర అధికార పదవుల విషయం పక్కనబెడితే... పార్టీ పదవుల విషయంలోనూ నేతలకు నిరాశే మిగులుతోంది. జిల్లాల పునర్విభజనతో అధికారిక, పార్టీ పరంగా ఎన్నో పదవులు పెరుగుతాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పలుసార్లు చెప్పారు. జిల్లాల పునర్విభజన జరిగి వరంగల్ జిల్లా... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా మారింది. దీంతో కొత్త జిల్లాల్లో టీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటవుతాయని, పదవులు వస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు. అయితే, జిల్లా కమిటీల ఏర్పాటుపై టీఆర్ఎస్ అధినేత ఇటీవల చేసిన ప్రకటనలతో పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గత నెలలోనే మొదలైంది. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు, గ్రామ పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఏప్రిల్ 12, 13వ తేదీల్లో పార్టీ మండల కమిటీలను నియమించాలని సూచించారు. అనంతరం వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. కానీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్లో టీఆర్ఎస్ అధిష్టానం... జిల్లా కమిటీలపై ఎక్కడా ప్రస్తావించ లేదు. దీంతో జిల్లా కమిటీల ఏర్పాటు ఉండదనే విషయంలో స్పష్టత వచ్చింది. జిల్లా కమిటీలే లేని పరిస్థితి ఉండడంతో పదవులు సంగతి మరిచిపోవాల్సిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫలితంగా పదవులు ఆశించిన నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అప్పుడు అలా... రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన ప్రక్రియను నిర్వహించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే టీఆర్ఎస్ కొత్త జిల్లా కమిటీల ఏర్పాటుపై పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అప్పట్లోనే ప్రకటిస్తారని భావించినా జరగలేదు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి జిల్లా పార్టీ కమిటీల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అప్పుడూ కొత్త జిల్లాల కమిటీ నియామకం జరగలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో... వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గుడిమల్ల రవికుమార్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తక్కెళ్లపల్లి రవీందర్రావు, జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఎడవెల్లి కృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది. భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. వీరితోపాటు జిల్లా కమిటీలోనూ పదవులు ఉంటాయని.. ఇలా వందల మందికి పదవులు వస్తాయని నేతలు ఆశించారు. తాజాగా జిల్లా కమిటీలు ఉండవనే విషయం బయటికి రావడంతో పదవులు ఆశించిన వారు నిరాశకు గురవుతున్నారు. -
ఐక్యతతో సాగితేనే అభివృద్ధి
వినాయక్‌నగర్ : ఐకమత్యంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. వంజరులను ఎస్టీల్లో చేర్చే అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యాస్ భవన్లో బుధవారం వంజరి సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీఎస్ ప్రసంగించారు. తన గురువు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో వంజరులను ఎస్టీ జాబితా నుంచి ఎందుకు తొలగించారో తనకు ఇప్పటివరకు తెలియదన్నారు. వంజరులను ఎస్టీల్లో చేర్చే అంశంపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమోనని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని చెప్పారు. ఫలానా రాష్ట్రంలో అదే జాబితాలో ఉంచారని, తమను కూడా చేర్చాలని కోరడం సరికాదని.. జీవనం విధానం, స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వంజరి సంఘం భవనానికి 500 గంజల స్థలం కావాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యం కోరగా.. ఎంపీ కవితతో మాట్లాడి వెయ్యి గజాలు ఇప్పిస్తానని డీఎస్ హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. కార్పొరేటర్లు శ్రీవాణి, దాత్రిక రేవతి, మయావర్ సాయిరాం, లక్ష్మిపతి, రవీందర్, ఆమంద్ విజయ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఇదే.. వంజరి సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా బోనేకర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా గంగోనె మల్లేశ్, కోశాధికారిగా నవాతె నర్సయ్య, ఉపాధ్యక్షులుగా ఎల్లయ్య, గంగోనే గంగాధర్, కానుగంటి దేవెందర్, కాసం సాయిలు, విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శులుగా కాలేరు సుభాశ్, దాత్రిక రాజేందర్, భీంకుమార్, భూమేశ్, శ్రీనివాస్, సుజాత, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వెంకటేశ్, అంజయ్య, మారుతి, సంతోష్, నందకిషోర్, ప్రచార కార్యదర్శిగా గణేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. -
త్వరలో నాయీబ్రాహ్మణుల జిల్లా కమిటీల ఏర్పాటు
చిలకలపూడి : నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి జిల్లాల వారీగా త్వరలో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమిటీల ద్వారా నాయీబ్రాహ్మణులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఆర్థిక వనరులు పెంపొందించుకునేందుకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. 11 మంది సభ్యులు ఉన్న ఒక్కొక్క సంఘానికి రూ. 7 లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని, ఈ మొత్తంలో 50 శాతం సబ్సిడీగా ఇస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నాయీబ్రాహ్మణులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి నిపుణులచే శిక్షణ ఇస్తామని, డోలు, నాదస్వరానికి నాదపాఠశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని చెప్పారు. దేవాదాయశాఖలో భజంత్రీల పోస్టులు భర్తీ చేసేలా మంత్రితో మాట్లాడామని చెప్పారు. దేవాలయాల్లో ఎలక్ట్రానిక్స్ డ్రమ్స్‌ను నిషేధించి నాయీబ్రాహ్మణులచే వాయిద్యాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెలలో నాయీబ్రాహ్మణ సంక్షేమంపై అధ్యయన కమిటీ ఏర్పాటు చే స్తామని వివరించారు. ఫెడరేషన్ డైరెక్టర్ ఇమ్మనపూడి విజయకుమార్, సీహెచ్ వీరవసంతరావు, జి. యలమందరావు, రాయపూడి చిన్ని పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
♦ ప్రధాన కార్యదర్శులుగా ఆరుగురికి అవకాశం ♦ కార్యదర్శులుగా తొమ్మిది మందికి చోటు ♦ అనుబంధ శాఖల అధ్యక్షుల నియామకం పూర్తి ♦ ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటైంది. జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీనివాస్‌రెడ్డిని ఇటీవల ప్రకటించగా.. పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమిస్తూ గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా నియమించారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ముదిగొండ రాజయ్య, మాదరగాని జంగయ్య, పొగాకు మల్లేష్, దొంతిరెడ్డి బలవంత్‌రెడ్డి, మామిడి సంగమేశ్వర్, భూర్‌కాని రామ్మోహన్‌లను నియమించారు. కార్యదర్శులుగా మల్లా రాజేందర్, భూమపూడి ప్రతాప్‌రెడ్డి, కొత్త మానిక్‌రెడ్డి, బండారి శ్రీనివాస్ యాదవ్, ఎన్.ప్రభాకర్, గుర్రం మల్లారెడ్డి, అతిరామ్ నాయక్, బి.శ్రీరాములు, ఎండీ ఖలీల్, సంయుక్త కార్యదర్శులుగా జోసెఫ్, శ్రీరాములు నియమితులయ్యారు. అదేవిధంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బాయిని చంద్రశేఖర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా సత్యమూర్తి, జిల్లా సేవాదళ్ విభాగం అధ్యక్షుడిగా బండారు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వేమూరి వెంగల్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పట్లోల్ల రాఘవ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. -
నాయకుడు లేని ‘దేశం’
2 నెలలుగా భర్తీ కాని జిల్లా అధ్యక్ష పదవిఎవరూ ముందుకు రాకపోవడమే కారణంపార్టీ జిల్లా కమిటీది ఇదే పరిస్థితినాయకుల వలసలతో టీడీపీ బలహీనంఎర్రబెల్లి, గరికపాటి తీరుపై శ్రేణుల్లో అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం పార్టీ జిల్లాలో పూర్తిగా బలహీనపడిపోతోంది. పార్టీ జిల్లా కమిటీకి కనీసం అధ్యక్షుడు లేని దుస్థితిలో ఉంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు నెలలు గడిచినా... ఇప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ కావడం లేదు. ఈ పదవిని చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందే టీడీపీ ముఖ్య నాయకులు పార్టీని వీడారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు బాగా పెరిగాయి. నియోజకవర్గస్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. రాష్ట్ర స్థాయి నాయకుల తీరుతో మిగిలిన వారు ఇదే బాటలో ఉన్నారు. టీడీపీలోని ఒకరిద్దరు ముఖ్య నాయకుల తీరుతో జిల్లాలో పార్టీ పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారిందని ‘తమ్ముళ్లు’ చర్చించుకుంటున్నారు.గత ఏడాది డిసెంబర్లో టీడీపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చేపట్టింది. ఈ ఏడాది 18న పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో అధ్యక్షుడి ఎన్నిక జరగకుండానే ఈ సమావేశం ముగిసింది. ఇలా జిల్లాలో టీడీపీకి నాయకత్వం లేని పరిస్థితి ఉండడంతో ఈ అంశం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించాలని ఆయనకు పలువురు జిల్లా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతక్క, సాధారణ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఈ సమయంలోనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో ఓటుకు కోట్ల రూపాయలను ఇచ్చిన విషయంలో టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో ఈ పదవి ఖాళీగానే ఉంటోంది. జిల్లా కమిటీ పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. వర్ధన్నపేట(ఎస్సీ) నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఇప్పటికీ బీసీ వర్గానికి చెందిన ఈగ మల్లేశం వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. పరకాల నియోజకవర్గానికి నాయకుడు లేడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి ఇలాగే ఉంది. అసలే నాయకులు లేని పరిస్థితుల్లో ఉన్న టీడీపీలో ముఖ్య నాయకుల తీరుపై పార్టీ శ్రేణులు, నాయకులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా జిల్లాలో పార్టీ బలోపేతం విషయాన్ని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పట్టించుకోవడం లేదని ‘దేశం’ శ్రేణులు అంటున్నాయి. రాజ్యసభ సభ్యుడు గరికపాటి, ఎర్రబెల్లి కలిసి జిల్లాలో పార్టీని బాగు చేయడాన్ని పక్కనబెట్టి అధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ కారణాలతో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఏకంగా పార్టీకే దూరమవుతున్నారు. మొత్తంగా సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. -
వైఎస్సార్సీపీ సారథులు
- కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ అధినాయకత్వం - రాష్ర్ట అధికార ప్రతినిధిగా కొయ్య ప్రసాద్‌రెడ్డి - రాష్ర్ట కార్యదర్శిగా ఉమారాణి సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కమిటీతో పాటు అనుబంధ విభాగాల రాష్ర్ట కమిటీల్లో కూడా జిల్లాకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో జిల్లా నూతనకార్యవర్గాన్ని కూడా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. అన్ని నియోజకవర్గాలకు..అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ ప్రకటించిన ఈ కమిటీ కూర్పు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ అధిష్టానం ప్రకటించింది.వైఎస్సార్సీపీ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధిగా కొయ్య ప్రసాదరెడ్డిని రాష్ర్ట కార్యదర్శిగా పీలా ఉమారాణిని నియమించారు. అనుబంధ విభాగాల రాష్ర్ట కమిటీల్లో కూడా విశాఖజిల్లాకు మరింత ప్రాధాన్యతనిచ్చింది. రాష్ర్ట పబ్లిసిటీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జి.రవికుమార్ (రవిరెడ్డి), కార్యదర్శిగా బీఎన్వి రామకృష్ణంరాజు, ఎస్సీసెల్ రాష్ర్ట సంయుక్త కార్యదర్శిగా అల్లంపల్లి రాజబాబు, రాష్ర్ట మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శిగా అంబటి విజయరావులను నియమిస్తూ పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. 110 మందితో జిల్లా కార్యవర్గం ఏర్పాటు: జిల్లా నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్నాథ్ వ్యవహరిస్తుండగా, ఈయన నాయకత్వంలో పనిచేసే జిల్లా కమిటీతో పాటు అనుబంధ కమిటీల నియామకాలను కూడా అధిష్టానం పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షునిగా అమర్నాథ్, ప్రధాన కార్యదర్శులుగా పీజేకే వర్మ, పేర్ల విజయ చందర్, మెల్లి అప్పారావు (తూర్పు), సేనాపతి అప్పారావు, సదరంచిన అప్పారావు, మువ్వల పోలా రావు (ఉత్తరం), బాకి శ్యామ్‌కుమార్‌రెడ్డి,ఆళ్ల పైడిరాజు, (పశ్చిమ), పద్మనాభం అమ్మాజీ (దక్షిణం), గొర్లె రామునాయుడు(పెందుర్తి), కార్యనిర్వాహక కార్యదర్శులుగా పీతల పోలరావు, రాగతి అచ్యుతరావు, గుడ్ల పోలిరెడ్డి, ఆకేళ్ల రమణమూర్తి, సత్తి మందారెడ్డి (తూర్పు), లండా రమణ, ఎన్.మల్లిబాబు (దక్షిణ), సనపాల త్రినాధ్‌స్వామి, పెదిరెడ్ల వెంకట్రావు(బాబులు) , బొడ్డేటి గంగ మహేష్, పైడి శ్రీను, సింగంపల్లి రామారావు (ఉత్తరం), బల్లా లక్ష్మణరావు, గేదెల రమణె (పశ్చిమ), యతిరాజుల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరావు (పెందుర్తి), వెంపాడ అప్పారావు, ప్రగడ వేణుబాబు, బొడ్డు నరసింహపాత్రుడు (కేబుల్మూర్తి, నక్క రమణబాబు (గాజువాక), పార్టీ కార్యదర్శులుగా ఇమంది సత్యనారాయణ, గుడ్ల రామ్మూర్తిరెడ్డి, కోట్టెం చిన్నంనాయుడు, గూడపాటివిక్టర్, పీలా బాలరాజు, మెగ్గా ఆదినారాయణ, పిల్లా దాసరాజు, ఎండి మక్బుల్, పిఎస్ నాయుడు. పీతల మహేష్, చల్లా రామారావురెడ్డి, వైదా నారాయణరావు, సీహెచ్ చిరంజీవిరెడ్డి (తూర్పు), బంగారి వేణు, సయ్యద్అబ్బార్, పీతల వాసు, బొగ్గు శ్యామ్, పాల శ్రీహరిరెడ్డి(దక్షిణం), పైడి ప్రతాప్, జీవీ రమణారెడ్డి, బి.తిరుమల రావు(ఉత్తరం),ఆడారి శ్రీను, ధర్మాల అప్పారావు, వెదుర్ల శ్రీనివాస రావు, కె.పైడి రత్నాకర్, కొణతాల నర్సింగరావు, ఉరుకూటి శ్రీనివాసరావు, మద్దాల శీను, చల్లా ఈశ్వరరావు(పశ్చిమ), గుర్రం శ్రీను,వెలగల పరశురామ్(మెడికల్ బాబు), ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి, ఈగలపాటి యువశ్రీ, సండ్రాన నూకరాజు, వెంపాడ అప్పారావు(గాజువాక), రాపర్తి మాదవ్, జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులుగా ఎవిఎస్ నాయుడు(ఉత్తర), నడింపల్లి కృష్ణంరాజు (తూర్పు), కాకర్లపూడి నరసింహమూర్తి రాజు(పెందుర్తి),కోశాధికారిగా ఎన్.మంగా రాజు (గాజువాక), జిల్లా అధికార ప్రతినిధులుగా ఉరుకూటి అప్పారావు (గాజువాక), గుత్తుల నాగభూణం(దక్షిణం), పీతల మూర్తి(తూర్పు). బయగానిసన్నికృష్ణ (అల్ఫాకృష్ణ)(పశ్చిమ), పామేటి బాబ్జి (ఉత్తరం), జిల్లా సంయుక్త కార్య దర్శులుగా తాటికొండ జగదీష్, రాజాన రామారావు, పోలవరపు శ్రీహరి, పెద్దిరెడ్ల ఈశ్వరరావు, ఆకులదుర్గ, కాకి అప్పలరెడ్డి, నాడిగట్లసూర్యనారాయణ(గాజువాక), సరకం నాగేశ్వరరావు, సాగ జగపతి (తూర్పు), ఎన్. రవికుమార్, మహ్మద్ రఫీ, కొణతాల రేవతి రావు,(ఉత్తర), అర్జిల్ల మసేను, పల్లా శ్రీను (దక్షిణం), సీహెచ్ శ్రీనివాసరావు, పీలా అనంత కుమార్, కొల్లి నూకిరెడ్డి (పశ్చిమ), గొంతిన చైతన్య (గాజువాక)లతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా కాళ్ల అశోక్‌కుమార్,కోరాడ చంటి, ఆకుల అప్పరాజు, సింగంపల్లి త్రినాధ్‌రావు, కండేపల్లిసుందర్ రావు, చీపుళ్ల రామారావు, చింతలపూడి వెంకటరమణ, ఉప్పాడ ఆదిబాబు, వాకమల్లి జోగా రావు మురళి, వల్లి శ్రీనివాసరావు(దక్షిణం), సీహెచ్ మారుతినాయుడు, షేక్ బాబ్జి, కాళ్ల అప్పలనాయుడు, ఓం నమశ్శివాయ, హరిపట్నాయక్, గండ్రటి ఉగాది(ఉత్తరం) లను నియమించారు. డివిజన్ కమిటీ అధ్యక్షులు వీరే: డివిజన్ల అధ్యక్షులను కూడా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్‌కు ఎస్. హేమంత్‌కుమార్, 32వ డివిజన్‌కు కేవి బాబా, 33వ డివిజన్‌కు దుప్పలపూడి శ్రీనివాసరావు, 35వ డివిజన్‌కు కె.సతీష్, 37వ డివిజన్‌కు బొడ్డేటి నాగేశ్వరరావు(నాగు), పెందుర్తి నియోజక వర్గ పరిధిలో ఉన్న 55వ డివిజన్‌కు బట్టు సన్యాశిరావు,57వ డివిజన్‌కు దాడి నూకరాజు, 69వ డివిజన్కుదాసరి రాజు, గాజువాక నియోజక వర్గ పరిధిలోని 58వ డివిజన్‌కు ఆజ్కుమార్ ఆచార్య, 59వ డివిజన్‌కు బోగాది సన్యాశిరావు, 60వ డివిజన్‌కు ఉరుకూటి అప్పారావు, 65వ డివిజన్‌కు వరదాడ వెంకట రమణలు నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే అదే విధంగా విశాఖనగర పరిధిలోని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా అధినాయకత్వం ప్రకటించింది. నగర యువజన విభాగానికి విల్లూరి భాస్కరరావు, మహిళా విభాగానికి పసుపులేటి ఉషాకిరణ్, ట్రేడ్ యూనియన్ విభాగానికి కలిదిండి బద్రినాధ్, మైనార్టీ సెల్‌కు మహ్మద్ షరీఫ్, ఎస్సీసెల్‌కు బోను శివరామకృష్ణ, సాంస్కృతిక విభాగానికి బయ్యవరపు రాధ, ప్రచార విభాగానికి బర్కత్ అలీ, నగర టీచర్స్ ఫెఢరేషన్ కమిటీ అధ్యక్షునిగా దేముడు ఎద్దు, డాక్టర్ల విభాగానికి డాక్టర్ జగదీష్ ప్రసాద్ బల్లారపు, నగర విద్యార్థి విభాగం అధ్యక్షునిగా తిప్పల వంశీ, నగరసేవాదళ్ అధ్యక్షునిగా సిరతల శ్రీనివాస్‌లను నియమించింది. భీమిలి పట్టణాధ్యక్షునిగా అక్కరమాని భీమిలి మున్సిపాల్టీ అధ్యక్షునిగా అక్కరమాని వెంకట్రావును పార్టీ అధినాయకత్వం నియమిం చింది. అలాగే భీమిలి మండల పార్టీ అధ్యక్షునిగా శ్రీనివాస్‌రెడ్డి, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షునిగా బంక సత్యం, పద్మనాభం మండల పార్టీఅధ్యక్షునిగా మద్ది రాంబాబులను నియమించింది. -
వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ ఏర్పాటు
ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం కమిటీ వివరాలను మీడియాకు విడుదల చేసింది. ఆరుగురికి జిల్లా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కరిని మాత్రమే ఎంపిక చేశారు. ఏడుగురు జిల్లా కార్యదర్శులుగాను, 14 మంది జిల్లా సంయుక్త కార్యదర్శులుగాను, ఇద్దరు జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులు, ఒక జిల్లా అధికార ప్రతినిధి, 34 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆరుగురు అనుబంధ విభాగాల అధ్యక్షులను ప్రకటించారు. గతంలోనే పార్టీ జిల్లా అధ్యక్షునిగా ముత్తుమల అశోక్‌రెడ్డిని ప్రకటించినందున మిగతా కార్యవర్గాన్ని ప్రస్తుతం ప్రకటించారు. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు: జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా గంగాడ సుజాత (ఒంగోలు ), జిల్లా రైతు విభాగం అధ్యక్షునిగా మారెడ్డి సుబ్బారెడ్డి (సంతనూతలపాడు), జిల్లా బీసీసెల్ అధ్యక్షునిగా కఠారి శంకర్రావు (ఒంగోలు), జిల్లా లీగల్ సెల్ అధ్యక్షునిగా ఎంవీవీఎస్ వేణుగోపాల్(ఒంగోలు), జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షునిగా ఎస్.మణికంఠారెడ్డి(కందుకూరు) జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షునిగా కర్నేటి వెంకట ప్రసాద్(చీరాల). జిల్లా ప్రధాన కార్యదర్శులు: చింతల రామారావు(అద్డంకి), కుమ్మెత అంజిరెడ్డి (దర్శి), గోలి అంజలీదేవి (చీరాల), వై.వెంకటేశ్వరరావు (కొండపి), పాశం మురళీకృష్ణ (గిద్దలూరు), వీరగంధం ఆంజనేయులు (పర్చూరు). జిల్లా అధికారప్రతినిధి: సూర స్వామిరంగారెడ్డి (గిద్దలూరు) జిల్లా క్రమశిక్షణా సంఘం సభ్యులు: జ్యోతి హనుమంతరావు(అద్దంకి), వీరంరెడ్డి రాఘవరెడ్డి(గిద్దలూరు). జిల్లా కార్యదర్శులు: ఎం.రాజశేఖరరెడ్డి(అద్దంకి), దుగ్గిరెడ్డి రమణారెడ్డి(దర్శి), గొనిగెల పెటూరుబాబు(చీరాల), చింతపల్లి పేరయ్య(కొండపి), బి.మాల్యాద్రి చౌదరి(కనిగిరి), జువ్వా శ్రీను (పర్చూరు), పెరుమారెడ్డి ఈశ్వర్‌రెడ్డి(గిద్దలూరు) జిల్లా సంయుక్త కార్యదర్శులు: షేక్ మస్తాన్‌వలి, కొండూరి ముసలయ్య(అద్దంకి), చిల్ల సుశీల ప్రతాప్, సూరెదేవర అంజయ్య(దర్శి), ఎం.బలరాంరెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు(చీరాల), కసుకుర్తి శ్రీధర్, గొల్లమూడి సుందరరామిరెడ్డి (కొండపి), పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, సురసాని మోహన్‌రెడ్డి(కనిగిరి), మనుబోతు వెంకటరెడ్డి, తన్నెబోయిన వెంకటప్పయ్య(పర్చూరు), సయ్యద్ కమర్, చేగిరెడ్డి సుబ్బారెడ్డి(గిద్దలూరు). జిల్లా కార్యవర్గ సభ్యులు: గంగమనేని వెంకటరామిరెడ్డి, పాదర్తి చిరంజీవి, కె.వెంకటేశ్వరరెడ్డి, నార్ని సుబ్బారావు, పసుపులేటి కోటేశ్వరరావు, పోతుల వెంకటస్వామి(అద్దంకి), మీనిగ వెంకటేశ్వర్లు, వల్లభనేని వీరయ్యచౌదరి, వై.చినసుబ్బయ్య, ముప్పరాజు సుబ్బారావు, ఇడంకంటి బ్రహ్మారెడ్డి(దర్శి), కొండూరి వెంకటేశ్వర్లు, సయ్యద్ నాగూర్(చీరాల), గడ్డం భాస్కరరావు, మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, షేక్ షాజహాన్, బొల్లినేని రామకృష్ణ, చలంచెర్ల కోటేశ్వరరావు, మంచినేని వెంకటరావు(కొండపి), చింతగుంట్ల సాల్మన్‌రాజు, కాకర్ల వెంకటేశ్వర్లు, పందీటి వెంగళరావు, కల్లూరి రామిరెడ్డి, ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, ఎన్.నారాయణస్వామి(కనిగిరి), పీ.కాలేషావలి, తుమ్మలపెంట శ్రీనివాసరావు, మువ్వల రాంబాబు, తోట వెంకట శ్రీనివాసరావు(పర్చూరు), కత్తి అనూజీరావు, అంబవరం శ్రీకాంత్‌రెడ్డి, కలగొట్ల సిద్దయ్య, బియ్యల నారాయణ, చింతా దేవభూషణం(గిద్దలూరు).