సాక్షిప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టతపై గులాబీ నేత కేసీఆర్ మళ్లీ దృష్టి సారించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో బీజీగా ఉన్న ఆయన.. పార్టీ సంస్థాగత పటిష్టత కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో మళ్లీ జిల్లా కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించిన ఆయన జూన్ నెలాఖరువరకు పూర్తి చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలను కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో జిల్లా కమిటీలు వేయడానికి టీఆర్‌ఎస్ అధిష్టానం సన్నద్ధం అవుతోంది.
ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. గతేడాది వరంగల్‌లో జరిగిన సభలో జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గస్థాయి కమిటీలు, జిల్లాస్థాయి సమన్వయకర్తలను నియమించాలని తీర్మానించింది. సమన్వయ కర్తలను నియమించినా.. క్షేత్రస్థాయిలో వారి పనితీరు ఆశాజనకంగా లేదు. దీంతో పార్టీలో నేతలను నియంత్రించే యంత్రాంగం లేకపోవడంతో అధిష్టానం మళ్లీ జిల్లా కమిటీల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే జూన్ నెలాఖరులోగా కమిటీల తంతు పూర్తి చేసేందుకు కసరత్తు మొదలెట్టినట్లు పార్టీవర్గాల సమాచారం.
ప్రయోజనం లేని ‘పరిశీలకుల’ ప్రక్రియ.. అందుకే జిల్లా కమిటీలకే మళ్లీ మొగ్గు
జిల్లా కమిటీల విధానానికి స్వస్తి పలికిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలకు శ్రీకారం చుట్టింది. 2017 అక్టోబర్ 26న పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పలువురు సీనియర్‌లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు. పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుని ఈ జిల్లాకు చెందిన వారిని పొరుగు జిల్లాకు, పొరుగు జిల్లా నేతలను ఈ జిల్లాకు నియమించారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. అదే విధంగా హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తకు అప్పగించారు.
ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల అప్పగించారు. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరికి పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను సిద్దిపేట, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఒక్కరినీ నియమించారు. జిల్లా ఇన్‌చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించాక కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ‘వి–కన్వెన్షన్’లో ఓ సమావేశం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటికీ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. దీంతో పార్టీ కేడర్ నియంత్రించే సి స్టం దెబ్బతినడంతో మళ్లీ జిల్లా కమిటీలవైపే అధిష్టానం మొగ్గు చూపింది.
కొత్త సారథుల ప్రకటనపై ఉత్కంఠ
నియోజకవర్గం సమన్వయ, పరిశీలన కమిటీల ప్రయోగం వికటించడంతో మళ్లీ జిల్లా కమిటీలపై అధిష్టానం మొగ్గుచూపగా.. కొత్త సారథులు ఎవరనే ఉత్కంఠ పార్టీ కేడర్‌లో మొదలైంది. అంతకు ముందు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మానకొం డూరుకు చెందిన జీవీ.రామకృష్ణారావు పేరు ఫైనల్‌కు వచ్చింది. అయితే ఆయనకు ‘సుడా’ చైర్మన్ దక్కడంతో ప్రస్తుతం కరీంనగర్‌కు చెందిన కట్ల సతీష్, వై.సునీల్‌రావు, హుజూరాబాద్ నుంచి బం డ శ్రీనివాస్, తన్నీరు శరత్‌రావు పేర్లు తెరమీదకు వచ్చాయి.
పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి రఘువీర్‌సింగ్‌ను జిల్లా గ్రంథాలయ సంçస్థ పదవి వరించగా.. ప్రధానంగా కమాన్‌పూర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణా రెడ్డి, కోరుకంటి చందర్ పే ర్లు వినిపిస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల నుంచి కల్వ కుంట్ల గోపాల్‌రావు, చిక్కాల రామారావు, మో హన్‌రెడ్డి, ప్రవీణ్ పేర్లు వినిపిస్తున్నా.. తోట ఆగయ్యకే ప్రాధాన్యం దక్కనుందంటున్నారు. జగి త్యాల నుంచి గతంలో డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు, బాదినేని రాజేందర్, మిట్టపల్లి సుదర్శన్, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, గొడిశాల రాజేశంగౌడ్ పేర్లు వినిపించాయి.
రాజేశం గౌ డ్, శ్రీకాంత్‌కు నామినేటెడ్ పదవులు దక్కగా.. బా దినేని రాజేందర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకుని పోలీసుకేసుల వరకు వెళ్లారు. దీంతో డాక్టర్ సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా టీఆర్‌ఎస్ నియోజకవర్గ కమి టీలు, సమన్వయకర్తల నియామకంపై వెనక్కి త గ్గి జిల్లా కమిటీలను నియమించేందుకు అధిష్ఠా నం మొగ్గు చూపుతుండటంతో పార్టీలో పదవుల కోసం ద్వితీయశ్రేణి నేతలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కాలం కావడంతో చిన్న ప దవిఉన్నా చక్రం తిప్ప వచ్చునని గులాబీ తమ్ము ళ్లు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరికీ దక్కుతాయన్న చర్చ ఆ పార్టీ కేడటర్‌లో హాట్ టాఫిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment