ఐక్యతతో సాగితేనే అభివృద్ధి
ఐక్యతతో సాగితేనే అభివృద్ధి
Published Thu, Sep 15 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
వినాయక్‌నగర్ :
ఐకమత్యంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. వంజరులను ఎస్టీల్లో చేర్చే అంశంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని వ్యాస్ భవన్‌లో బుధవారం వంజరి సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీఎస్ ప్రసంగించారు. తన గురువు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో వంజరులను ఎస్టీ జాబితా నుంచి ఎందుకు తొలగించారో తనకు ఇప్పటివరకు తెలియదన్నారు. వంజరులను ఎస్టీల్లో చేర్చే అంశంపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమోనని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని చెప్పారు. ఫలానా రాష్ట్రంలో అదే జాబితాలో ఉంచారని, తమను కూడా చేర్చాలని కోరడం సరికాదని.. జీవనం విధానం, స్థితిగతులు, ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వంజరి సంఘం భవనానికి 500 గంజల స్థలం కావాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యం కోరగా.. ఎంపీ కవితతో మాట్లాడి వెయ్యి గజాలు ఇప్పిస్తానని డీఎస్ హామీ ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. కార్పొరేటర్లు శ్రీవాణి, దాత్రిక రేవతి, మయావర్ సాయిరాం, లక్ష్మిపతి, రవీందర్, ఆమంద్ విజయ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఇదే..
వంజరి సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా బోనేకర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా గంగోనె మల్లేశ్, కోశాధికారిగా నవాతె నర్సయ్య, ఉపాధ్యక్షులుగా ఎల్లయ్య, గంగోనే గంగాధర్, కానుగంటి దేవెందర్, కాసం సాయిలు, విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శులుగా కాలేరు సుభాశ్, దాత్రిక రాజేందర్, భీంకుమార్, భూమేశ్, శ్రీనివాస్, సుజాత, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వెంకటేశ్, అంజయ్య, మారుతి, సంతోష్, నందకిషోర్, ప్రచార కార్యదర్శిగా గణేశ్ ప్రమాణ స్వీకారం చేశారు.
Advertisement