వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు | YSR CP District Committee set up | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు

Published Fri, Jul 1 2016 2:02 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు - Sakshi

వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఏర్పాటు

ప్రధాన కార్యదర్శులుగా ఆరుగురికి అవకాశం
కార్యదర్శులుగా తొమ్మిది మందికి చోటు
అనుబంధ శాఖల అధ్యక్షుల నియామకం పూర్తి
ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటైంది. జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీనివాస్‌రెడ్డిని ఇటీవల ప్రకటించగా.. పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమిస్తూ గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులను కూడా నియమించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా ముదిగొండ రాజయ్య, మాదరగాని జంగయ్య, పొగాకు మల్లేష్, దొంతిరెడ్డి బలవంత్‌రెడ్డి, మామిడి సంగమేశ్వర్, భూర్‌కాని రామ్మోహన్‌లను నియమించారు.

కార్యదర్శులుగా మల్లా రాజేందర్, భూమపూడి ప్రతాప్‌రెడ్డి, కొత్త మానిక్‌రెడ్డి, బండారి శ్రీనివాస్ యాదవ్, ఎన్.ప్రభాకర్, గుర్రం మల్లారెడ్డి, అతిరామ్ నాయక్, బి.శ్రీరాములు, ఎండీ ఖలీల్, సంయుక్త కార్యదర్శులుగా జోసెఫ్, శ్రీరాములు నియమితులయ్యారు. అదేవిధంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బాయిని చంద్రశేఖర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా సత్యమూర్తి, జిల్లా సేవాదళ్ విభాగం అధ్యక్షుడిగా బండారు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా వేమూరి వెంగల్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పట్లోల్ల రాఘవ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement