అనంతపురం టౌన్ : స్థానిక కార్పొరేషన్‌లో అసిస్టెంట్ మేస్త్రీగా పనిచేస్తున్న రత్నాజీ స్థానిక 38వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ జానకిని అగౌరవ పరచడంపై కార్పొరేటర్లు గురువారం కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు గిరిజమ్మ, బాలాంజినేయులు, షుకూర్, మల్లికార్జున, సీపీఎం కార్పొరేటర్ భూలక్ష్మి ఆందో ళనలో పాల్గొన్నారు.
టీడీపీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు శేఖర్‌బాబు మద్దతు ఇచ్చారు. మేస్త్రీపై చర్యలు తీసుకోకపోతే శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పం టించుకుంటానని బాధితురాలు జానకి యత్నించగా తోటి కార్పొరేటర్లు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకున్న కమిషనర్ నాగవేణి హుటాహుటిన అక్కడికి చేరుకుని కార్పొరేటర్లతో మాట్లాడారు. బాధిత కార్పొరేటర్ కమిషనర్‌తో మాట్లాడుతూ డివిజన్‌లో కార్మికులు లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్య ఏర్పడిందన్నారు. దీనిపై గ్యాంగ్ వర్క్ చేయించాలని హెచ్‌ఓను కోరామన్నారు. ఈ లోగా బుధవారం మేస్త్రీ రత్నాజీ తన ఇంటి ఎదుట నిలబడి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేసింది.
శేఖర్‌బాబు మాట్లాడుతూ 50 డివిజన్‌లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయాలని చెప్పినందుకు తన భార్య కార్పొరేటర్ బిందుప్రియను కార్మికులు బెదిరించార ని, ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామన్నారని వివరించారు. అసిస్టెంట్ మేస్త్రీని సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేస్తే విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ధర్నా
Published Fri, Jun 12 2015 1:48 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement