గొల్లప్రోలులో వైఎస్సార్ సీపీ రాస్తారోకో
Published Wed, Oct 16 2013 5:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : గొల్లప్రోలులో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు, వైఎస్సార్ సీపీ నాయకులపై కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఆందోళన చేశారు. పార్టీ నియోజకవర్గసమన్వయకర్త పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి పళ్లంరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్యవాదుల వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి తీసుకోకపోవడాన్ని దొరబాబు తప్పుపట్టారు. దాడికి తెగ బడ్డవారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.
అడ్డుకున్న పోలీసులు
వైఎస్సార్ సీపీ నాయకుల రాస్తోరోకోను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన విరమించకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఆ సమయంలో పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీ నాయకులు ఆందోళన విరమించి మెయిన్‌రోడ్డు మీదుగా ర్యాలీ చేపట్టారు. సూర్యుడు చెరువు గట్టుపై ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వేగిశెట్టి సత్తిరాజు, దాసం లోవబాబు, బొజ్జా దొరబాబు, నడిగట్ల చింతలరావు, కాదులూరి చిన్నారెడ్డి, రాచమళ్ల వెంకటేశ్వర్రావు, గండేపల్లి బాబీ, వులవల భూష ణం, పెద్దింటి పుల్లారెడ్డి, ఆనాల సుదర్శన్, కర్రి రాంబాబు, కందా చినబాబు, పర్ల రాజా, జ్యోతుల సత్తిబాబు, నాగులాపల్లి సన్యాసిరావు, బండి శంకర్, యర్రంశెట్టి చైతన్య, జవ్వాది నాయుడు, ఆనందసాగర్, పాము బాబ్జీ, గొల్లపల్లి నాగు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు-అరెస్టు
గొల్లప్రోలులో సమైక్యవాదులపై దాడి జరిగిన సంఘటనలో సోమవారం ఒక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కేంద్ర మంత్రి పళ్లంరాజు వెంట వెళ్తున్న కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన మత్సా అప్పాజీకి చెందిన కారు వెనుక అద్దాలు పగిలాయి. దాడి చేసి పరారవుతున్న మంత్రి అనుచరుల వెంట సమైక్యవాదులు నిరసనలు చేస్తూ వెంబడించే ప్రయత్నంలో కారుపై గుర్తుతెలియని ఆందోళనకారులు దాడి చేశారు. ఈ సమయంలో కారువెనుక ఉన్న అద్దాలు పగిలాయి. వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ వేగిశెట్టి సత్తిరాజు, యువజన కన్వీనర్ దాసం లోవబాబు, వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శంక ర్‌పై పోలీసులకు కారు యజమాని కాంగ్రెస్ నేత అప్పాజీ ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు ముగ్గురుని అరెస్టు చేసి పిఠాపురం కోర్టుకు తరలించారు.
దాడిచేసిన వారిపై నమోదుకాని కేసు
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదులపై దాడి చేసిన మంత్రి అనుచరులపై పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కేంద్రమంత్రి అనుచరులు దాడి చేసి సమైక్యవాదులను గాయపరిచారు. ఈఘటనలో వేగిశెట్టి సత్తిరాజు, మొగలి అప్పారావు, కర్రి రాం బాబు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదు.
Advertisement