వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు రాధాకృష్ణ, గౌతంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో..
కృష్ణలంక : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారికి అండగా నేనున్నానంటూ పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. 24వ డివిజన్ మలేరియా ఆస్పత్రి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 3, 4, 14, 15, 16, 17, 18, 22, 24 డివిజన్ల కార్పొరేటర్ల మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. ముందుగా దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నియంత ధోరణితో వ్యవహరించటం, ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజలను సమస్యలకు గురిచేయడంతో.. ప్రజలకు అండగా నిలిచేందుకు తమ పార్టీ పుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా ప్రజలను బాధిస్తోందన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే తెలుగుదేశం పార్టీకీ పడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చందన సురేష్, సుంకర కిషోర్, తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, పులి రమణారెడ్డి, ఆరేళ్ల రాంబాబు, తెంటు రాజేష్, ప్రభుకుమార్, రంగారావు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో..
సత్యనారాయణపురం : వైఎస్సార్ సీపీ జెండా ప్రజలకు అనునిత్యం అండగా ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. సత్యనారాయణపురం భగత్‌సింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజాసంక్షేమమే ప్రధాన ఎజెండాగా పోరాటాలు చేసేందుకు జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కార్మిక సోదరులకు 37 రకాల హామీలు ఇచ్చి వాటి ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ ఎం.డి.కరిమున్నీసా, పార్టీ అధికార ప్రతినిధి యాదల శ్రీనివాసరావు, సిటీ సేవాదళ్ కన్వీనర్ కమ్మిలి రత్నకుమార్, నగర, జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షులు విశ్వనాథ రవి, మాదు శివరామకృష్ణ, ఎస్సీ నాయకులు కాలే పుల్లారావు, డివిజన్ అధ్యక్షులు టెక్యెం కృష్ణారావు, బోను రాజేష్, ఇసరపు రాజు, ఎం.డి.రుహుల్లా, సేతురామ్, బల్లం కిషోర్, ముద్దరబోయిన దుర్గారావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు నారుమంచి నారాయణ, సాంబశివారెడ్డి, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి డీవీబీ సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ ఆటో వర్కర్స్ యూనియన్‌నగర కార్యదర్శి ఏడుకొండలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జెండా.. ప్రజలకు అండ
Published Fri, Mar 13 2015 1:08 AM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM
Advertisement
Advertisement