చింతలపూడి నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక! | ysrcp joining in cintalapudi VENKATRAMAIAH | Sakshi
Sakshi News home page

చింతలపూడి నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక!

Apr 21 2014 12:56 AM | Updated on Aug 10 2018 8:06 PM

చింతలపూడి నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక! - Sakshi

చింతలపూడి నేడు వైఎస్సార్‌సీపీలో చేరిక!

తమ సామాజిక వర్గంపై చులకన భావంతో ఉన్న టీడీపీని వదిలి వైఎస్సార్‌సీపీలో చేరాలని ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యపై ఆయన అనుచరులు ఒత్తిడి తెచ్చారు.

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : తమ సామాజిక వర్గంపై చులకన భావంతో ఉన్న టీడీపీని వదిలి వైఎస్సార్‌సీపీలో చేరాలని ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యపై ఆయన అనుచరులు ఒత్తిడి తెచ్చారు. ఆదివారం సాయంత్రం చింతలపూడి ముఖ్యఅనుచరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కోటరీ, స్థానిక నాయకులు తనపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కూడా తనను కలుపుకొని వెళ్లడానికి ఇష్టపడడం లేదన్నారు. ఆయనతో కలిసి పనిచేయాలని అధిష్టానం కూడా చెప్పకపోవడం బాధించిందన్నారు. తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన  వైఎస్సార్‌సీపీలో చేరాలని సమావేశంలో పాల్గొన్న అధిక శాతం మంది ఆయనపై ఒత్తిడి తెచ్చారు. దాదాపు 150 మంది పాల్గొన్నారు. సోమవారం చింతలపూడి వెంకట్రామయ్య వైఎస్సార్‌సీపీలో చేరేం దుకు సిద్ధమవుతున్నారు.

ఈ సమావేశంలో బొబ్బరి నారాయణరావు, బొండా అప్పారావు, మోటూరి మహాలక్ష్మినాయుడు, పట్టా రామఅప్పారావు, కర్రి నాగేశ్వరరావు, కోరాడ శ్యామ్, నగిరెడ్డి చిన్నారావు, శ్రీను, లక్కరాజు సోంబాబు, కె.రామారావు, భీశెట్టి నూకరాజు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement