బాబు గద్దె దిగడం ఖాయం | ysrcp leader chalamalasetty sunil fire on TDP govt | Sakshi
Sakshi News home page

బాబు గద్దె దిగడం ఖాయం

Published Wed, Dec 20 2017 9:30 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM

ysrcp leader chalamalasetty sunil fire on TDP govt

గండేపల్లి(జగ్గంపేట): శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి చలమశెట్టి సునీల్‌ పేర్కొన్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం కలేనని సూరంపాలెం గ్రామంలో మంగళవారం పార్టీలో చేరిన వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాసంక్షేమ అభివృద్ధిని విస్మరించడంతోనే ప్రజలు వైఎస్సార్‌ సీపీలోకి చేరుతున్నారని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు జీవన భృతి ఇస్తామని నేటికీ అమలుచేయకపోవడం శోచనీయమన్నారు. రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధికారం కైవసం చేసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హామీల అమలుపైనే సంతకం చేస్తారని సునీల్‌ స్పష్టం చేశారు. జగన్‌ నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు.

ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన వారిని అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకుందని ప్రత్తిపాడు కో ఆర్డినేటర్‌ పర్వత ప్రసాద్‌ అన్నారు. సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోచుకునే పనులకే ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, నవరత్నాల అంశాలపై ప్రసంగించారు. పార్టీలోకి చేరిన పోశ్ని బాబురావు, అల్లం కాపు, తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా రామాలయంలోకి పూర్ణకుంభతో స్వాగతం పలికి అర్చకులు అర్చనలు జరిపారు. అనతరం గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కంపర రమేష్, వరసాల ప్రసాద్, చలగళ్ల దొరబాబు, పెనుగంటి రాజేష్, మురారి రవికుమార్, బంటు వాసు, అడబాల పెదబాబు, తోట చినబాబు, దోని దొరబాబు, కాపరపు వరప్రసాద్, బత్తిన సత్యనారాయణ, కోడిగుడ్ల శ్రీను, ప్రగడరెడ్డి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement