chalamalasetty sunil
-
పవన్ కళ్యాణ్ ప్రశంసలకు స్ట్రాంగ్ కౌంటర్
-
వైఎస్సార్ సీపీలోకి చలమలశెట్టి సునీల్
సాక్షి, అమరావతి : సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్లడించారు. జగన్‌కు ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం పార్టీ సమన్వయకర్త దవులూరి దొరబాబు పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి జగన్‌తో తనకు తొలి నుంచీ మంచి అనుబంధం ఉందని చలమలశెట్టి సునీల్ అన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ చిన్న సమస్య వల్ల కొంత కాలం దూరంగా ఉన్నానని, ఇకపై జగన్ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని స్పష్టం చేశారు. సునీల్‌ను తామంతా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణు అన్నారు. -
చంద్రబాబుకు సునీల్, రూప ఝలక్
సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులు ఝలక్ ఇచ్చారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. కాకికాడ, రాజమండ్రి లోక్‌సభ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప ఈరోజు సమావేశానికి హాజరుకాలేదు. రామచంద్రపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన తోట త్రిమూర్తులు కూడా ముఖం చాటేశారు. వీరు ముగ్గురు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తోట త్రిమూర్తులు టీడీపీని వీడతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు సమావేశానికి రాకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలోని కాపు నాయకులు గత జూన్‌లో రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే (చదవండి: టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల రహస్య భేటీ) చంద్రబాబు పర్యటనకు కాకినాడ నేతలు దూరం టీడీపీ జిల్లా స్దాయి విస్తృత సమావేశం, నియోజకవర్గాల సమీక్షలకు కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్, తొమ్మిది మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే సీటును వనమాడి కొండబాబుకు కేటాయించవద్దని వీరంతా చంద్రబాబును కోరారు. తమ మాట వినిపించుకోకుండా కొండబాబుకు టిక్కెట్ ఇవ్వడంతో వీరందరూ అసంతృప్తిగా ఉన్నారు. తమ వినతిని చంద్రబాబు పట్టించుకోక పోవడంతో ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. (చదవండి: చంద్రబాబుతో భేటీకి కాపు నేతల డుమ్మా) -
చలమలశెట్టి సునీల్‌పై పవన్ కల్యాణ్ ఫైర్
-
సునీల్‌కు చిడతలు కొని పంపిస్తా: పవన్
సాక్షి, కాకినాడ : నిన్న నటుడు ఆలీపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సునీల్ జనసేనలో చేరుతానంటూ తన టైమ్‌ను చాలా వృధా చేశాడంటూ విమర్శలు గుప్పించారు. అతడిని చూస్తుంటే కాలాన్ని హరించేవాడనిపిస్తోందంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తనకు చాలా సంతోషమని... సునీల్ చంద్రబాబు మనిషని..జీవితాంతం చంద్రబాబు కాళ్ల దగ్గర కూర్చొని భజన చేసుకోండంటూ సునీల్‌ను ఎద్దేవా చేశారు. కావాలంటే తాను రెండు చిడతలు కొని పంపిస్తానంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. తాను అధికార, ప్రతిపక్ష పార్టీలకు భయపడేది లేదని పవన్ తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే కులమతాలకు అతీతంగా పాలన చేస్తామన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, మోదీ అంటే తనకు గౌరవమే కానీ, ఎలాంటి భయం లేదని అన్నారు. -
బాబు గద్దె దిగడం ఖాయం
గండేపల్లి(జగ్గంపేట): శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్చార్జి చలమశెట్టి సునీల్ పేర్కొన్నారు. టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం కలేనని సూరంపాలెం గ్రామంలో మంగళవారం పార్టీలో చేరిన వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాసంక్షేమ అభివృద్ధిని విస్మరించడంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు జీవన భృతి ఇస్తామని నేటికీ అమలుచేయకపోవడం శోచనీయమన్నారు. రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమని వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారం కైవసం చేసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హామీల అమలుపైనే సంతకం చేస్తారని సునీల్ స్పష్టం చేశారు. జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని అధికారపార్టీ ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకుందని ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ పర్వత ప్రసాద్ అన్నారు. సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి దోచుకునే పనులకే ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, నవరత్నాల అంశాలపై ప్రసంగించారు. పార్టీలోకి చేరిన పోశ్ని బాబురావు, అల్లం కాపు, తదితరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా రామాలయంలోకి పూర్ణకుంభతో స్వాగతం పలికి అర్చకులు అర్చనలు జరిపారు. అనతరం గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు కంపర రమేష్, వరసాల ప్రసాద్, చలగళ్ల దొరబాబు, పెనుగంటి రాజేష్, మురారి రవికుమార్, బంటు వాసు, అడబాల పెదబాబు, తోట చినబాబు, దోని దొరబాబు, కాపరపు వరప్రసాద్, బత్తిన సత్యనారాయణ, కోడిగుడ్ల శ్రీను, ప్రగడరెడ్డి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఆ సత్తా జగన్ సొంతం
కరప, న్యూస్‌లైన్ : రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరికే ఉందని ఆపార్టీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పేర్కొన్నారు. కరప మార్కెట్ సెంటర్లో ఆదివారం షర్మిల వైఎస్సార్ జనభేరి సభలో సునీల్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈ మూడు రోజులూ ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నా, రాజన్న రాజ్యం రావాలన్నా, వైఎస్సార్ రుణం తీర్చుకోవాలన్నా వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. 25మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అధికంగా సాధించుకోగలమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే యువతకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వృద్ధులకు రూ.200 నుంచి రూ. 700కు, వికలాంగులకు రూ.వెయ్యికి పింఛన్ పెంచుతారన్నారు. అమ్మఒడి తదితర పథకాలను గురించి వివరించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పార్లమెంటు అభ్యర్ధిగా తనను, కాకినాడరూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణను గెలిపించాలని అభ్యర్థించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ షర్మిల 3,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసినవిషయాన్ని జనం హర్షధ్వానాల మధ్య గుర్తుచేశారు. ఈఎన్నికలు వంచనకు, విశ్వసనీయతకూ మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు. ప్రజాసమస్యలపై నాలుగున్నర ఏళ్లుగా పోరాటం చేస్తున్న జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనతోపాటు పార్లమెంట్ అభ్యర్థి సునీల్‌ను గెలిపించాలని చెల్లుబోయిన కోరారు. -
జోరందుకున్న వైఎస్ఆర్ సీపీ నామినేషన్ల పర్వం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పలువురు బధవారం పలు నియోజకవర్గాలలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమాలలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్ధులు: కాకినాడ లోక్‌సభ స్థానం: చెలమశెట్టి సునీల్ రాజమండ్రి లోక్‌సభ స్థానం: బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి నర్సాపురం లోక్ సభ స్థానం: వంకా రవీందర్ నామినేషన్ తిరుపతి లోక్‌సభ స్థానం :డా. వరప్రసాదరావు అనంతపురం లోక్‌సభ స్థానం: అనంత వెంకట్రామిరెడ్డి నర్సారావుపేట లోక్‌సభ స్థానం : ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అనకాపల్లి లోక్‌సభ స్థానం : గుడివాడ అమర్న్నాథ్ శాసనసభ స్థానాలకు నామినేషన్లు వేసినవారు: జగ్గయ్యపేట: సామినేని ఉదయభాను రాజమండ్రి సీటి : బొమ్మన రాజకుమార్ కాకినాడ సీటి :ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ రూరల్: శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జగ్గంపేట : జ్యోతుల నెహ్రూ రాజోలు : బొంతు రాజేశ్వరరావు ముమ్మిడివరం : గుత్తుల సాయి ధర్మవరం: కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పెనుకొండ : శంకర్‌నారాయణ ఆళ్లగడ్డ: భూమా శోభానాగిరెడ్డి మంత్రాలయం : బాలనాగిరెడ్డి బాపట్ల కూన రఘుపతి రాజోలు : గొంతు రాజేశ్వరరావు ఎచ్చర్ల గొర్లు కిరణ్‌కుమార్ ఆముదాలవలస: తమ్మినేని సీతారాం తాడిపత్రి : వీఆర్ రామిరెడ్డి కావలి: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. సర్వేపల్లి :కాకాని గోవర్దన్‌రెడ్డి వెంకటగిరి: కొమ్మి లక్ష్మయ్యనాయుడు సూళ్లూరుపేట : కె.సంజీ వయ్య విశాఖపట్నం నార్త్: చొక్కాకుల వెంకట్రావు కొవ్వూరు: తానేటి వనిత మైదుకూరు: ఎస్.రఘురామిరెడ్డి రాయచోటి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రొద్దుటూరు : రాచమల్లు ప్రసాదరెడ్డి అనకాపల్లి : కొణతాల రఘునాథ్ చోడవరం: కరణం ధర్మశ్రీ పొన్నూరు: రావి వెంకట రమణ తెనాలి : అన్నాబత్తుని శివకుమార్ రాజంపేట: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సత్యవేడు : ఆదిమూలం పాతపట్నం: కలమట వెంకట రమణ సింగనమల : జొన్నలగడ్డ పద్మావతి రాయదుర్గం : కాపు రామచంద్రారెడ్డి చిలకలూరిపేట : మర్రి రాజశేఖర్ మంగళగిరి : ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రత్తిపాడు : ఎం.సుచరిత పెదకూరపాడు : బొల్లా బ్రహ్మనాయుడు నర్సారావుపేట : డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రైల్వేకోడూరు : కొరుముట్ల శ్రీనివాసులు తణుకు : చీర్ల రాదయ్య భీమిలి : కర్రి సీతారాం విశాఖ సౌత్: కోలా గురువులు కొండెపి: జూపూడి ప్రభాకరరావు కందుకూరు : పోతుల రామారావు అద్దంకి : గొట్టిపాటి రవికుమార్ చీరాల : ఎడం బాలాజీ దర్శి : బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బొబ్బిలి : సుజయకృష్ణరంగారావు పార్వతీపురం : జె.ప్రసన్న కుమార్ నెల్లిమర్ల : పెన్మత్స సురేష్ అమలాపురం : గొల్ల బాబూరావు పూతలపట్టు డాక్టర్ సునీల్‌కుమార్