
మేకపాటికి స్వల్ప అస్వస్థత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బీపీ పెరగడంతో ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
కొద్దిపాటి చికిత్స అనంతరం రాజమోహనరెడ్డి కోలుకున్నారు. దాంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హుదూద్ తుపానుపై చర్చించాల్సిందిగా లోక్సభలో బుధవారం ఆయన సావధాన తీర్మానం నోటీసు ఇవ్వనున్నారు.