దిగ్బంధం విజయవంతం | YSRCP leaders are blocked roads sucessfully | Sakshi
Sakshi News home page

దిగ్బంధం విజయవంతం

Published Fri, Nov 8 2013 3:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

YSRCP leaders are blocked roads sucessfully

సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిర రహదారుల దిగ్బంధం రెండోరోజు గురువారం విజయవంతమైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారులను దిగ్బంధించాలని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో పార్టీశ్రేణులు బుధ, గురువారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. రహదారులను
 
 దిగ్బంధించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌నగర్ జాతీయరహదారిపై రోడ్డును దిగ్బంధించారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు అక్కడికక్కడే నిలచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కనుపర్తిపాడు జాతీయరహదారి వద్ద ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించింది. వైఎస్సార్‌సీపీ కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావూలూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కోవూరులో జాతీయరహదారిని దిగ్బంధించారు.
 
 భారీగా వాహనాలు నిలిచాయి. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో పొదలకూరు-సోమశిల మార్గాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంతో దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. కావలిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గురువారం ఉదయం 5 నుంచి 7.30 వరకు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
 
  కావలి రెండో పట్టణ ఎస్సై అన్వర్‌బాషా  పోలీసు సిబ్బందితో వచ్చి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సహా 30 మందిని అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వాహనం దగదర్తి మండల ఉలవపాళ్ల జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ దిగ్బంధంలో చిక్కుకుంది. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు నేదురమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల కూడలిలో రహదారిని దిగ్బంధిచారు.
 
 ఈ సందర్భంగా సమన్వయకర్తలు, కార్యకర్తలు రోడ్డుపైనే మొక్కజొన్న కంకులు తిని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.  ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు కొంతసేపు ఆటంకం ఏర్పడింది. వింజమూరు, దుత్తలూరులో జరిగిన ఆందోళనల్లో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు.

వెంకటగిరిలోని అడ్డరోడ్ల కూడలిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో మూడు గంటలపాటు రహదారులు దిగ్బంధించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై నెలవల సుబ్రమణ్యం రహదారులు దిగ్బంధించారు. తడలో నిర్వహించిన ఆందోళనలో కూడా కిలివేటి సంజీవయ్య, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు.దిగ్బంధించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌నగర్ జాతీయరహదారిపై రోడ్డును దిగ్బంధించారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు అక్కడికక్కడే నిల చిపోయాయి. ట్రాఫిక్ స్తంభించింది.
 
 నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కనుపర్తిపాడు జాతీయరహదారి వద్ద ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ స్తంభించింది. వైఎస్సార్‌సీపీ కోవూరు, ఇందుకూరుపేట మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావూలూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కోవూరులో   సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో పొదలకూరు-సోమశిల మార్గాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంతో దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్ స్తం భించింది.
 
 కావలిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గురువారం ఉదయం 5 నుంచి 7.30 వరకు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. గూడూరులో పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు నేదురమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల కూడలిలో రహదారిని దిగ్బంధిచారు. ఉదయగిరి బస్టాండ్‌లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు కొంతసేపు ఆటంకం ఏర్పడింది. వింజమూరు, దుత్తలూరులో జరిగిన ఆందోళనల్లో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు.
 
 వెంకటగిరిలోని అడ్డరోడ్ల కూడలిలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో మూడు గంటలపాటు రహదారులు దిగ్బంధించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై నెలవల సుబ్రమణ్యం రహదారులు దిగ్బంధించారు. తడలో నిర్వహించిన ఆందోళనలో కూడా కిలివేటి సంజీవయ్య, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 90 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement