సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ అధికారులు చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతల గురించి ఈసీకి వివరించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘంతో సోమవారం సమావేశమైయ్యారు.
నూతన డీజీపీ నియామకం, ప్రస్తుత డీజీపీ తొలగింపు అంశాలతోపాటు ఇంటిలిజెన్స్ విభాగం అధికారి వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు అక్రమంగా నగదు పంపిణి చేస్తోన్నారని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. చంద్రబాబు అండతో ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తును ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment