హైదరాబాద్: తిరుపతిలో అధికార టీడీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ను కలసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
తిరుపతిలో టీడీపీ నేతలు అధికార దాహంతో ప్రవర్తిస్తున్నారని రోజా విమర్శించారు. ఎంపీ శివ ప్రసాద్, జెడ్పీ చైర్మన్ చంద్రన్న కానుక పేరుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ముగిసినా టీడీపీ నేతలు పంపిణీ చేస్తూ కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి శాసనసభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో తిరుపతిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
టీడీపీ నేతలపై ఈసీకి రోజా ఫిర్యాదు
Published Tue, Jan 20 2015 7:51 PM | Last Updated on Fri, Aug 10 2018 9:36 PM
Advertisement
Advertisement