సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు మోదీ గో బ్యాక్ అన్న వ్యక్తి నేడు విశాఖ వెళ్లడానికి అనుమతివ్వండని వేడుకోవడం ఏంటని ట్విటర్ వేదికగా నిలదీశారు. ‘విధి ఎంత నిర్ధయగా ఉంటుందంటే.. మోదీ గోబ్యాక్ అని ఫ్లెక్సీలు కట్టించిన వ్యక్తి, అమిత్ షా కుటుంబంతో దైవదర్శనానికి తిరుపతి వస్తే కాన్వాయ్ పై రాళ్లేయించిన వ్యక్తి, ఏడాది తిరగక ముందే సిగ్గు శరం లేకుండా మోకరిల్లడం... వైజాగ్ వెళ్లడానికి అనుమతివ్వండని వేడుకోవడం!’ అని ట్వీట్ చేశారు. కాగా విశాఖ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటనను కోరుతూ చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ అనుమతిని కోరిన విషయం తెలిసిందే. (క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు?)
Comments
Please login to add a commentAdd a comment