‘తెలంగాణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదు’ | ysrcp not opposite to telangana, says baji reddy govardhan | Sakshi
Sakshi News home page

‘తెలంగాణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం కాదు’

Published Wed, Aug 7 2013 3:21 PM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత బాజిరెడి గోవర్ధన్ తెలిపారు.

మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేత బాజిరెడి గోవర్ధన్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్‌సీపీ అభిమానులే పార్టీని నడిపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.  వైఎస్సార్‌సీపీ నేత షర్మిల ఇచ్ఛాపురం పాదయాత్ర ముగింపు సభలో చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెల్స్ వక్రీకరించాయన్నారు.
 
 జిల్లాలోని గద్వాలలో సర్పంచ్‌లుగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను బాజిరెడ్డి, ఎడ్మి కృష్ణారెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిలు సన్మానించారు. సన్మాన సభలో వారు ప్రత్యేక తెలంగాణ అంశంకు సంబంధించి మాట్లాడారు.  వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement