బూటకపు పాలనపై.. ధర్మాగ్రహం | YSRCP organises darnas against TDP government | Sakshi
Sakshi News home page

బూటకపు పాలనపై.. ధర్మాగ్రహం

Published Thu, Nov 6 2014 1:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

బూటకపు పాలనపై.. ధర్మాగ్రహం - Sakshi

బూటకపు పాలనపై.. ధర్మాగ్రహం

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ మండిపడింది.  జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ సీఎం నుంచి మంత్రులు, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేణులు, ప్రజలు బైఠాయించి ధర్నాలు చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
 
 ఆయా ప్రాంతాల్లో జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలు వైఎస్సార్‌సీపీ ధర్నాలకు అండగా నిలిచారు. రైతులు, డ్వాక్రా మహిళలకు తక్షణమే రుణమాఫీ చేయాలని, అర్హులకు తెల్లకార్డులు పునరుద్ధరించాలని, పింఛనుదారులకు న్యాయం చేయాలని, రైతులకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలని, ఫీజు రియంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలి ఇప్పించాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చేనెల 5న జిల్లా కలెక్టరేట్ ఎదుట మరోమారు భారీ ఎత్తున ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీలో నూతనోత్తేజం కనిపించింది.
 
  జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకురాలు వరుదు కల్యాణి పర్యవేక్షణలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. తొలుత వైఎస్సార్ కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.
 
  ఆమదాలవలసలో పార్టీ హైలెవల్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, మున్సిపల్ కో ఆర్డినేటర్ బి.రమేష్, ఇతర కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
 
  పొందూరులో తమ్మినేని సీతారాం, ఎంపీపీ సువ్వారి దివ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
 
  గారలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ వై.వి.సూర్యనారాయణ, డీసీఎంస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఆందోళన చేశారు.
 
  లావేరులో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ధన్నాన రాజనాయుడు పర్యవేక్షణలో సుమారు 400 మంది కార్యకర్తలు ధర్నా చేసి, తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
 
  సరుబుజ్జిలిలో మాజీ మంత్రి తమ్మినే ని సీతారాం, ఎంపీపీ, సర్పంచ్, జడ్పీటీసీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిపా రు. సుమారు 600 మంది పాల్గొన్నారు.
 
  సారవకోటలో ఎంపీపీ సీహెచ్ కూర్మినాయుడు, జెడ్పీటీసీ ధర్మాన పద్మప్రియ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.  
 
  జలుమూరులో ఎంపీపీ కె . సుశీల, ప్రతినిధి సూర్యం ఆధ్వర్యంలో సుమారు 400 మంది ఆందోళన చేశారు.
 
  వీరఘట్టంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ డి. వెంకటరమణ పర్యవేక్షణలో సుమారు 500 మంది ఆందోళన నిర్వహించారు.
 
  పోలాకిలో పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు కణితి కృష్ణ పర్యవేక్షణలో సుమారు 300 మంది ధర్నాకు దిగారు. ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
 
  పాతపట్నంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మండల నాయకుడు ఎరుకుల వెంకటరమణ పర్యవేక్షణలో సుమారు 600 మంది ఆందోళన నిర్వహించారు.
 
  మెళియాపుట్టిలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ, మండల నాయకుడు ఎస్. మోహనరావు పర్యవేక్షణలో భారీగా ఆందోళన నిర్వహించారు.
 
  వంగరలో ఎమ్మెల్యే కంబాల జోగులు, మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ ఆధ్వర్యంలో  400 మంది ఆందోళనకు దిగారు.
 
  సంతకవిటిలో మాజీ ఎంపీటీసీ సిరిపురపు జగన్నాథరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
 
  ఎచ్చెర్లలో పార్టీ మండల అధ్యక్షుడు మురళీధర్ బాబా ఆధ్వర్యంలో 28 పం చాయతీల నేతలు ధర్నాకు దిగారు. ఉప తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
 
  బూర్జలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ, ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు,  కన్వీనర్ దాసిరెడ్డి వెంకునాయుడు పర్యవేక్షణలో ఆందోళన చేశారు.
 
  ఇచ్చాపురంలోసమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో భారీగా ఆందోళన నిర్వహించారు.
 
  జి. సిగడాంలో మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, పార్టీ నేత ఆబోతుల జగన్నాథం ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఆందోళన నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
 
  రణస్థలంలో జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది ర్యాలీ నిర్వహించి భారీగా ఆందోళన చేశారు.
 
  ఎల్‌ఎన్‌పేటలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ కె. గోవిందరావు పర్యవేక్షణలో ధర్నా నిర్వహించారు.
 
  పలాసలో జెడ్పీటీసీ పి. భార్గవి ఆధ్వర్యంలో పార్టీ నేత దువ్వాడ శ్రీకాంత్ పర్యవేక్షణలో ఆందోళన నిర్వహించారు.
 
  మందసలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
 
  వజ్రపుకొత్తూరులో ఏఎంసీ మాజీ చైర్మన్ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 500 మంది ధర్నాలో పాల్గొన్నారు.
  హిరమండలంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఎల్.లక్ష్మణరావు పర్యవేక్షణలో ఆందోళన చేశారు.
 
  టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో జెడ్పీటీసీ కె.సుప్రియ పర్యవేక్షణలో ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించారు.
 
  నందిగాంలో పార్టీ నేత పేరాడ తిలక్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ధర్నా చేపట్టారు.
 
  రేగిడిలో పార్టీ మండల కన్వీనర్ రెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ఆందోళన నిర్వహిచారు.
  కోటబొమ్మాళిలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నేతలు దువ్వాడ శ్రీనివాస్, కోట సూర్యప్రకాశరావుల ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది ఆందోళన నిర్వహించారు.
 
  కొత్తూరులో మండల కన్వీనర్ పి. మోహనరావు, వైస్ ఎంపీపీ భైరాగినాయుడు ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఆందోళన నిర్వహించారు.
 
  రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్పీటీసీ టి. పాపినాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
 
  పాలకొండలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం ఆధ్వర్యంలో 400 మంది ధర్నాలో పాల్గొన్నారు.
 
  సీతంపేటలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, జెడ్పీటీసీ పాలక రాజబాబు, ఎంపీపీ సరవ లక్ష్మి ఆధ్వర్యంలో భారీగా ఆందోళన చేశారు.
 
  భామినిలో మండల కన్వీనర్ అన్నాజీరావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
 
  సోంపేటలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. మానవహారం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ సందర్భంగా సాయిరాజును కొద్దిసేపు అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంీ పపీ గణపతి తదితరులు పాల్గొన్నారు.
 
  సంతబొమ్మాళిలో మండల కన్వీనర్ శిమ్మా సోమేష్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
 
  కవిటి మండలంలో పార్టీ నేత నర్తు రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, ఉప తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు.
 
  కంచిలిలో ఎంపీపీ లోలాక్షి, ప్రతినిధి కృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు 300 మంది ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
 
  నరసన్నపేటలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ నేతలు తొలుత వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ధర్నా నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement