darnas
-
వికేంద్రీకరణకు మద్దతుగా దీక్షలు
-
జీవో 465 రద్దు చేయాలని సమ్మె
గుంటూరు మెడికల్: ఆర్ఎంపీ, పీంఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ విడుదల చేసిన జీవో 465ను తక్షణం రద్దు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (అప్జూడ్) డిమాండ్ చేశాయి. శుక్రవారం గుంటూరులో రెండు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. గుంటూరు జీజీహెచ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు చేతపట్టుకుని, నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ నాగళ్ల కిషోర్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్ జయధీర్‌బాబు, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అరెస్ట్‌లకు నిరసనగా ధర్నా
శిరోముండనం కేసులో పీపీని తిరిగి నియమించాలి దళిత సంఘాల డిమాండ్ కాకినాడ సిటీ : వెంకటాయపాలెం శిరోముండనం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) జవహర్ అలీని తొలగించడం తగదని సోమవారం దళిత సంఘాలు, వామపక్షాలు ఉమ్మడిగా చేపట్టిన కలెక్టరేట్ ఆందోళనలో అక్రమ అరెస్ట్‌లు నిరసిస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ఉద్యమ సీనియర్‌నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం అధ్యక్షుడు గుడాల కృష్ణ మాట్లాడుతూ శిరోముండనం కేసులో 20 సంవత్సరాల తరువాత వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో పీపీని మారుస్తూ జీఓ ఇవ్వడం కేసును నీరుగార్చడానికేనన్నారు. దీనికి నిరసనగా పాత పీపీనే పునర్నియమించాలని దళిత, వామపక్షాలు ఉమ్మడిగా శాంతియుతంగా ర్యాలీ, ధర్నా తలపెట్టామన్నారు. దీనిపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి, అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. కొంతమంది దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను వేనుకేసుకురావడం కంచె చేను మేసినట్టుగా ఉందన్నారు. అరెస్ట్‌లు, నిర్బంధాలతో ఉద్యమాలు ఆగవని పాలకులు గుర్తించాలన్నారు. వెంకటాయపాలెం దళితులకు న్యాయం జరిగే వరకూ దళిత, ప్రజా సంఘాలు, వామపక్షాలు అండగా ఉంటాయన్నారు. ఐఎఫ్టీయూ నాయకులు జె.వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, మాల మహానాడు నాయకులు తాడి బాబ్జి మద్దతుగా మాట్లాడారు. కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు మోతా కృష్ణమూర్తి, మెల్లిమి డేవిడ్‌రాజు, మాజీ జెడ్పీటీసీ బంగారు శివ, ఐద్వా నాయకులు భవాని, సుభాషిణి, ఎస్ఎఫ్ఐ నాయకులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద ధర్నాల హోరు
కాకినాడ సిటీ : సమస్యలపై వివిధ సంఘాలు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ హోరెత్తింది. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా అనంతరం ఆయా సంఘాల నాయకులు అధికారులకు తమ డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కంపెనీ నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని కోరుతూ దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కంపెనీ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఉందని, భూములు కోల్పోవడంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 144ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు మద్ధతు తెలిపిన సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక ప్రభుత్వ అనుమతి, పర్యావరణశాఖ అనుమతి కూడా రాలేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు జి.బేబిరాణి, బాధిత ప్రజలు పాల్గొన్నారు. కళాశాల విద్యార్థుల సమస్యలపై.. కాకినాడ పీఆర్ ఆర్ట్స్ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కలాశాలల్లో సమస్యలపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. ఆర్ట్స్ కళాశాలకు రూ.5 కోట్లు, ఒకేషనల్ కళాశాలకు రూ.3 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, 2015–16 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థుల ఉపకార వేతన బకాయిలు విడుదల చేయాలని, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు, నాయకులు శివాజీ, వంశీ, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి కాకినాడ పర్లోవపేట శివారు మహాత్మాజ్యోతిరావుఫూలే కాలనీలోని అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ధర్నా నిర్వహించింది. బాధితులకు నేటికీ సహాయం అందలేదదని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అన్నారు. బాధితులందరికీ పట్టాలు పంపిణీ చేసి పక్కాగృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ నాయకులు వి.రామన్న, రాజబాబుతో పాటు బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా వివిధ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. హెచ్ఐవీ నిరోధించానికి ప్రచారం చేస్తున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌కుమార్, కార్యదర్శి రాంబాబు, నాయకులు ఎ.గిరిబాబు, డి.నాగమణి పాల్గొన్నారు. నిర్బంధ కాండను మానుకోవాలి ప్రజాస్వామ్యవాదులపై కేంద్రం అవలంబిస్తున్న నిర్బంధకాండను మానుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉన్నత విద్యాలయాలపైన, జర్నలిస్ట్‌లు, విద్యార్థులు, లౌకికవాదులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి హిందుత్వ మూకలు దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ నాయకులు జె.నాగేశ్వరరావు, పి.శ్రీనివాస్, జె.అచ్చిరాజు పాల్గొన్నారు. -
ధర్నాగ్రహం
మాటిచ్చి మరిచిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ పిడికిలి బిగించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్న సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సహకారంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇచ్చిన హామీలను మరిచిపోయిన ప్రభుత్వం కళ్లు తెరిచేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హామీలు అమలయ్యే వరకు ప్రజల తరఫున పోరాటాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స నెల్లిమర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పోరాటం చేద్దామని వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు పిలుపునిచ్చారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు అమలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లిమర్లలో బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మొయిద జంక్షన్ నుంచి వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు ర్యాలీగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సాంబశిరాజు మాట్లాడారు. మొదటి సంతకంతోనే చంద్రబాబు మోసాలు మొదలుపెట్టారని అన్నారు. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని చెప్పారు. సర్వే పేరుతో అర్హులైనవారి పింఛన్లు తొలగించారని ఆరోపించారు. హామీలు నెరవేర్చేదాకా ఆందోళన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా.. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేద్దామన్నారు. అనంతరం హెచ్‌డీటీ రమాదేవికి పెనుమత్స, చెనమల్లు, గదల తదితరులు వినతిపత్రం అందజేశారు. అన్ని వర్గాలనూ మోసం చేశారు బొబ్బిలి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సుజయ్ బొబ్బిలి: మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. చంద్రబాబు హామీలు అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ బొబ్బిలిలో బుధవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రుణ మాఫీ సాధ్యం కాదని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే ఇదే చంద్రబాబు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఐదు నెలలు అయినా కమిటీలు, నిబంధనలు పేరుతో రుణమాఫీ చేయకుండా నానుస్తున్నారని అన్నారు. వైఎస్ ఆ రోజు ప్ర మాణస్వీకారం నాడు ఉచిత విద్యుత్‌పై సంతకం చేస్తే మరుసటి రోజు నుంచే అమలయ్యిందని, చంద్రబాబు చేసిన తొలి సంతకాలే అబద్దం అని తేలిపోయాయన్నారు. రుణమాఫీపై సాధికార సంస్థ ద్వారా చేసేదేమిటో, వడ్డీ ఎవరు కడతారు, వడ్డీకి ఎంత కడుతున్నారో వంటి వాటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో రైతులకు క్రషింగు సమయం ముంచుకొస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలిపారు. దొడ్డిదారిలో పదవులు... బొబ్బిలి నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజాప్రతినిధులను వైఎస్ఆర్ కాంగ్రె స్ పార్టీకి చెందిన వారినే ఎన్నుకొని పట్టం కట్టారని, అయితే మండలాలు, మున్సిపాలిటీల్లో దొడ్డిదారిన పదవులను అలకరించారని సుజయ్ విమర్శించారు. అధికార పార్టీ ఒత్తిడిలకు తలొగ్గి అర్హులకు అధికారులు అన్యాయం చేస్తే సహించబోమన్నారు. కోట నుంచి ర్యాలీ... రహదారి దిగ్బంధం చంద్రబాబు హామీల అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుమేరకు బొబ్బిలి పట్టణ, మండల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఆధ్వర్యంలో కోట నుంచి ర్యాలీగా బయలుదేరారు. వేణుగోపాలస్వామి జంక్షన్, పార్కు పక్క నుంచి తహశీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ బలిజిపేట రోడ్డును దిగ్బంధం చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర సాలూరు: ఎన్నికల సమయంలో హద్దులు లేకుం డా హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చాక మాత్రం ప్రజలు చెవిలో పూలు పెడుతోందని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ఇంటి నుంచి జాతీయ రహదారి మీదుగా తహశీల్దార్ కార్యాలయం జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై పె ద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. తర్వాత రాజన్నదొర మా ట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ప్రమాణ స్వీకారం నాడు కూడా సంతకాలు చేశారని, కానీ వాటిలో ఓ ఒక్కదాన్నీ అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు కట్టవద్దని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ ఆధార్ వద్దని చెప్పి న చంద్రబాబు నేడు అన్నింటికీ ఆధార్‌తో ముడిపెడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు అధికార పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఎంతకాలం మోసం చేస్తారు..? వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు భోగాపురం : డ్వాక్రా, వ్యవసాయ, చేనేత రుణాలు మాఫీ అంటూ ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ప్రశ్నించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం ఆవరణలో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ రోజు వరకు ఎక్కడా రుణమాఫీ చేయలేదని తెలిపారు. జిల్లాలో తుపాను తాకిడికి నెల్లిమర్ల నియోజకవర్గంలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయితే పంటలు కోల్పోయిన రైతులు ప్రభుత్వం మాటలు విని సకాలంలో రుణాలు కట్టనందున బీమా సొమ్ముని నష్టపోయారని తెలిపారు. అనంతరం డీటీ ప్రభాకరరావుకి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రావాడ బాబు, శిరుగుడి గోవిందరావు, వరుపుల సుధాకర్, కొమ్మూరు సుభూషణరావు, సవరవిల్లి శ్రీనివాసరావు, ఇమ్మిడిశెట్టి రమేష్, మద్దిల శంకరరావు, కర్రోతు పైడిరాజు, మైలపల్లి అప్పలకొండ, నారు పైడినాయుడు, శ్రీనువాసు, రాంబాబు పాల్గొన్నారు. మాట ఇచ్చారు... మరిచిపోయారు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కురుపాం: ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా కుప్పలుతెప్పలుగా హామీలు గుప్పించిన చంద్రబాబు నేడు మాట తప్పి మడమ తిప్పారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అధ్యక్షతన బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రావాడ కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ కురుపాం మండలాధ్యక్షురాలు ఆనిమి ఇందిరాకుమారి, జెడ్పీటీసీ శెట్టిపద్మావతిలతో కలిసి పూలమాలలు వేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ కూడలిలో మానవహారంగా నిలబడి ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాంబమూర్తికి వినతిపత్రం అందించారు. హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఈ ఆటలు ఎన్నాళ్లు సాగిస్తారని ప్రశ్నించారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ధర్నాను అడ్డుకున్న టీడీపీ నేతలు
సంతకవిటి :శ్రీకాకుళం జిల్లా రాజాం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు సంతకవిటిలో చేపట్టిన ధర్నాను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయికొత్త పింఛన్ల వివరాల కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్యే జోగులు అక్కడికి చేరుకొని ధర్నాలో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఎంపీడీవో శ్రీనాథస్వామి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడారు. కొత్త పింఛన్‌దారుల వివరాలు అందజేశారు. అరుుతే క్రమబద్ధీకరణ వివరాలు తమ వద్ద లేవని, రెండు రోజుల తరువాత ఇస్తానని చెప్పారు. అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎంపీడీవోను నిర్బంధించి నేలపైనే కూర్చుని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మండల ఉపాధ్యక్షుడు గండ్రేటి కేసరితో పాటు పలువురు టీడీపీ నేతలు అక్కడికి వచ్చి చేరుకుని, ఎమ్మెల్యేకు పోటీగా ఆయన ఉన్న గదిలోనే కూర్చున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక సందర్భంలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. మరోవైపు ఎంపీడీవో శ్రీనాథస్వామి పది రోజుల్లో వివరాలు అందజేస్తామని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. ఇదే సమయంలో పలు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మండల కేంద్రానికి చేరుకుని పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎంపీడీవోను ఎస్సై సురేష్‌బాబు బయటకు తీసుకొచ్చి పంపించేశారు. అయినా ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లోపలే ఉన్నారు. ఎంపీడీవో చేసిన అన్యాయాలపై తమ పోరాటం ఆగదని, అర్హులకు ఫించన్ వచ్చే వరకూ పోరాడతామని ఎమ్మెల్యే కంబాల జోగులు స్పష్టం చేశారు. -
మోసపూరిత పాలనపై ధర్నా యుద్ధం
మోసపూరిత హామీలతో రైతులను, డ్వాక్రా సంఘాలను నిలువునా ముంచేసిన సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ బుధవారం ధర్నా యుద్ధాన్ని ఆరంభించింది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజల తరఫున పోరుబాట సాగించింది. అర్హుల పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ... కమిటీల పేరుతో దగాకోరు పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టింది. హామీలను తక్షణమే అమలుచేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూలదోస్తారంటూ హెచ్చరించింది. హామీ ఇచ్చి మోసం చేశారు.. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక రైతుల నోట్లో మట్టికొట్టారు. కమిటీల పేరుతో కాలయూపన చేస్తున్నారు. మాఫీ మాట పక్కన పెడితే వడ్డీ భారం కూడా రైతులు మోయూల్సి వస్తోంది. కొత్తరుణాలు మంజూరు కాకపోవడంతో హుదూద్ తుపానుతో పంటలు నష్టపోరుున రైతులకు పంట బీమా కూడా అందే పరిస్థితి లేదు. బాబు రైతులను పూర్తిగా మోసం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.65వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పి, మీడియాలో మాత్రం ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పించడం విచారకరం. రుణాలు మాఫీ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే చెందింది. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు తీరును ఎండగడతాం. రైతులు, డ్వాక్రా మహిళల తరఫున పోరాడతాం. -ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతులు నరకయూతన పడుతున్నా... రుణ బాధలు తీరక, కొత్త రుణాలు మంజూరుకాక, పంటకు పెట్టుబడి లేక రైతులు నరకయూతన పడుతున్నా టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగంటూ సీఎం చంద్రబాబునాయుడు రైతులను కష్టాల పాలచేశారు. ఇప్పుడు అదే రైతులకు మోసపూరిత హామీలిచ్చి అధికారం చేపట్టాక మళ్లీ అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నారు. రైతులను వంచించేందుకు వెనుకాడడంలేదు. నిరుద్యోగులను సైతం మోసపూరిత ప్రకటనలతో మాయ చేస్తున్నారు. ప్రజలంతా చైతన్యవంతులై గ్రామాల్లోకి వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయూలి. ప్రజాపాలన వచ్చేలా తిరుగుబాటు చేయాలి. -ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు పింఛన్లకూ కోత చంద్రబాబు అధికారం చేపట్టిన మూడు నెలలకే పింఛన్ దారులను వదిలించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కమిటీలను వేసి అర్హుల పింఛన్లను తొలగించారు. వారిని కష్టాల పాలచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఐదు నెలలువుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. దీంతో ఒక్కో సంఘంపై నాలుగు నెలల వడ్డీ భారం పడింది. రుణాలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. దీనిని మహిళలంతా గుర్తించాలి. మాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. గ్రామాల్లోకి వచ్చే నాయకులను నిలదీయాలి. హామీల అమలయ్యేవరకు పోరాటం సాగించాలి. - రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉద్యమాలతో భయం పుట్టిస్తాం సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చేపట్టిన మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. భయం పుట్టిస్తాం. బాబు ఇచ్చిన హామీలు అమలయ్యేవరకు పోరాటం సాగిస్తాం. రుణాల మాఫీ కోసం రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఎంతో ఆత్రంగా చూస్తున్నా టీడీపీ నేతల్లో చలనం లేదు. ప్రజల కష్టాలు పట్టడం లేదు. ఏసీ కారుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు రాష్ట్రంలో 13,800బెల్టు షాపులు నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. తుపాను సాయూన్ని కార్యకర్తలకు పంచుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఇలాంటి పాలనను ప్రజలెప్పుడూ చూసి ఉండరు. - కలమట వెంకటరమణ, వైఎస్సార్ సీపీ పాతపట్నం ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారు ఏజెన్సీ ప్రజల సంక్షేమం, మన్య ప్రాంత అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారు. గిరిజనుల పింఛన్లను తొలగించారు. ఒక్క సీతంపేట మండలంలోనే 2000 పింఛన్లు తొలగించారు. రేషన్ కార్డులకు ఎసరు పెడుతున్నారు. మరోవైపు పంటలు నష్టపోయినా పట్టించుకోవడం లేదు. సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నారు. రైతులు అప్పుల్లో కూరుకుపోయినా సహాయం చేయడంలేదు. వీటిపై జనం తిరగబడాలి. నిలదీయూలి. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా ఉంటుం ది. సమస్యలపై పోరాడుతుంది. ప్రజలకు అన్యాయం జరగకుండా పోరుబాటు నడుపుతుంది. - విశ్వాసరారుు కళావతి, వైఎస్సార్ సీపీ పాలకొండ ఎమ్మెల్యే మొదటి సంతకాన్నే మాఫీ చేశారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున పెట్టిన మొదటి సంతకాన్ని మాఫీ చేసిన ఘనత చంద్రబాబుది. మోసపూరిత ప్రకటనలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో వాటిని అమలు చేయడం అంత సులభం కాదని అనడం సమంజసమా..? పేద వాడిని మోసం చేయడ ం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమర పాటుతో రైతన్నలు, మహిళలు ఓటేసి అధికారం కట్టబెట్టినందుకు పింఛన్లు తొలగిస్తున్నారు. బ్యాంకులకు వడ్డీలు కట్టమంటున్నారు. ఇదేమి న్యాయం. -తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు ఒక్క హామీ కూడా అమలుకాలేదు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలుచేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్నా రు. ఇప్పుడు ఆదర్శరైతులను తొలగిం చారు. ఉపాధిహామీ ఫీల్డు అసింట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా రు. రైతులకు చిల్లి గవ్వ పరిహారం అందజేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. దీనిపై యువత, నిరుద్యోగులు, రైతులు తిరగబడాలి. -వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వరుదు కల్యాణి -
బూటకపు పాలనపై.. ధర్మాగ్రహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన తీరుపై వైఎస్ఆర్సీపీ మండిపడింది. జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ సీఎం నుంచి మంత్రులు, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేణులు, ప్రజలు బైఠాయించి ధర్నాలు చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా ప్రాంతాల్లో జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలు వైఎస్సార్సీపీ ధర్నాలకు అండగా నిలిచారు. రైతులు, డ్వాక్రా మహిళలకు తక్షణమే రుణమాఫీ చేయాలని, అర్హులకు తెల్లకార్డులు పునరుద్ధరించాలని, పింఛనుదారులకు న్యాయం చేయాలని, రైతులకు బ్యాంకుల నుంచి రుణాలిప్పించాలని, ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలి ఇప్పించాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చేనెల 5న జిల్లా కలెక్టరేట్ ఎదుట మరోమారు భారీ ఎత్తున ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు భారీగా పాల్గొన్నారు. దీంతో వైఎస్సార్సీపీలో నూతనోత్తేజం కనిపించింది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకురాలు వరుదు కల్యాణి పర్యవేక్షణలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. తొలుత వైఎస్సార్ కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. ఆమదాలవలసలో పార్టీ హైలెవల్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, మున్సిపల్ కో ఆర్డినేటర్ బి.రమేష్, ఇతర కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పొందూరులో తమ్మినేని సీతారాం, ఎంపీపీ సువ్వారి దివ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. గారలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ వై.వి.సూర్యనారాయణ, డీసీఎంస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఆందోళన చేశారు. లావేరులో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ధన్నాన రాజనాయుడు పర్యవేక్షణలో సుమారు 400 మంది కార్యకర్తలు ధర్నా చేసి, తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. సరుబుజ్జిలిలో మాజీ మంత్రి తమ్మినే ని సీతారాం, ఎంపీపీ, సర్పంచ్, జడ్పీటీసీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిపా రు. సుమారు 600 మంది పాల్గొన్నారు. సారవకోటలో ఎంపీపీ సీహెచ్ కూర్మినాయుడు, జెడ్పీటీసీ ధర్మాన పద్మప్రియ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. జలుమూరులో ఎంపీపీ కె . సుశీల, ప్రతినిధి సూర్యం ఆధ్వర్యంలో సుమారు 400 మంది ఆందోళన చేశారు. వీరఘట్టంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ డి. వెంకటరమణ పర్యవేక్షణలో సుమారు 500 మంది ఆందోళన నిర్వహించారు. పోలాకిలో పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు కణితి కృష్ణ పర్యవేక్షణలో సుమారు 300 మంది ధర్నాకు దిగారు. ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు. పాతపట్నంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మండల నాయకుడు ఎరుకుల వెంకటరమణ పర్యవేక్షణలో సుమారు 600 మంది ఆందోళన నిర్వహించారు. మెళియాపుట్టిలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ, మండల నాయకుడు ఎస్. మోహనరావు పర్యవేక్షణలో భారీగా ఆందోళన నిర్వహించారు. వంగరలో ఎమ్మెల్యే కంబాల జోగులు, మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ ఆధ్వర్యంలో 400 మంది ఆందోళనకు దిగారు. సంతకవిటిలో మాజీ ఎంపీటీసీ సిరిపురపు జగన్నాథరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎచ్చెర్లలో పార్టీ మండల అధ్యక్షుడు మురళీధర్ బాబా ఆధ్వర్యంలో 28 పం చాయతీల నేతలు ధర్నాకు దిగారు. ఉప తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. బూర్జలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఆనెపు రామకృష్ణ, ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, కన్వీనర్ దాసిరెడ్డి వెంకునాయుడు పర్యవేక్షణలో ఆందోళన చేశారు. ఇచ్చాపురంలోసమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో భారీగా ఆందోళన నిర్వహించారు. జి. సిగడాంలో మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, పార్టీ నేత ఆబోతుల జగన్నాథం ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఆందోళన నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. రణస్థలంలో జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు ఆధ్వర్యంలో సుమారు 200 మంది ర్యాలీ నిర్వహించి భారీగా ఆందోళన చేశారు. ఎల్‌ఎన్‌పేటలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ కె. గోవిందరావు పర్యవేక్షణలో ధర్నా నిర్వహించారు. పలాసలో జెడ్పీటీసీ పి. భార్గవి ఆధ్వర్యంలో పార్టీ నేత దువ్వాడ శ్రీకాంత్ పర్యవేక్షణలో ఆందోళన నిర్వహించారు. మందసలో మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వజ్రపుకొత్తూరులో ఏఎంసీ మాజీ చైర్మన్ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 500 మంది ధర్నాలో పాల్గొన్నారు. హిరమండలంలో ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఎల్.లక్ష్మణరావు పర్యవేక్షణలో ఆందోళన చేశారు. టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో జెడ్పీటీసీ కె.సుప్రియ పర్యవేక్షణలో ర్యాలీ, అనంతరం ధర్నా నిర్వహించారు. నందిగాంలో పార్టీ నేత పేరాడ తిలక్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ధర్నా చేపట్టారు. రేగిడిలో పార్టీ మండల కన్వీనర్ రెడ్డి నర్సింగరావు ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ఆందోళన నిర్వహిచారు. కోటబొమ్మాళిలో మాజీ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నేతలు దువ్వాడ శ్రీనివాస్, కోట సూర్యప్రకాశరావుల ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది ఆందోళన నిర్వహించారు. కొత్తూరులో మండల కన్వీనర్ పి. మోహనరావు, వైస్ ఎంపీపీ భైరాగినాయుడు ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఆందోళన నిర్వహించారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్పీటీసీ టి. పాపినాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పాలకొండలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం ఆధ్వర్యంలో 400 మంది ధర్నాలో పాల్గొన్నారు. సీతంపేటలో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, జెడ్పీటీసీ పాలక రాజబాబు, ఎంపీపీ సరవ లక్ష్మి ఆధ్వర్యంలో భారీగా ఆందోళన చేశారు. భామినిలో మండల కన్వీనర్ అన్నాజీరావు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సోంపేటలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. మానవహారం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ సందర్భంగా సాయిరాజును కొద్దిసేపు అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంీ పపీ గణపతి తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళిలో మండల కన్వీనర్ శిమ్మా సోమేష్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కవిటి మండలంలో పార్టీ నేత నర్తు రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, ఉప తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కంచిలిలో ఎంపీపీ లోలాక్షి, ప్రతినిధి కృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు 300 మంది ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నరసన్నపేటలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ నేతలు తొలుత వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ధర్నా నిర్వహించారు.