మోసపూరిత పాలనపై ధర్నా యుద్ధం | YSRCP organises darnas against TDP government | Sakshi
Sakshi News home page

మోసపూరిత పాలనపై ధర్నా యుద్ధం

Published Thu, Nov 6 2014 1:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

మోసపూరిత పాలనపై ధర్నా యుద్ధం - Sakshi

మోసపూరిత పాలనపై ధర్నా యుద్ధం

మోసపూరిత హామీలతో రైతులను, డ్వాక్రా సంఘాలను నిలువునా ముంచేసిన సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ బుధవారం ధర్నా యుద్ధాన్ని ఆరంభించింది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజల తరఫున పోరుబాట సాగించింది. అర్హుల పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ... కమిటీల పేరుతో దగాకోరు పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టింది. హామీలను తక్షణమే అమలుచేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూలదోస్తారంటూ హెచ్చరించింది.    
 
 హామీ ఇచ్చి మోసం చేశారు..
 ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక రైతుల నోట్లో మట్టికొట్టారు. కమిటీల పేరుతో కాలయూపన చేస్తున్నారు. మాఫీ మాట పక్కన పెడితే వడ్డీ భారం కూడా రైతులు మోయూల్సి వస్తోంది. కొత్తరుణాలు మంజూరు కాకపోవడంతో హుదూద్ తుపానుతో పంటలు నష్టపోరుున రైతులకు పంట బీమా కూడా అందే పరిస్థితి లేదు. బాబు రైతులను పూర్తిగా మోసం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రూ.65వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పి, మీడియాలో మాత్రం ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పించడం విచారకరం. రుణాలు మాఫీ చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే చెందింది. ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు తీరును ఎండగడతాం. రైతులు, డ్వాక్రా మహిళల తరఫున పోరాడతాం.
 -ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
 రైతులు నరకయూతన పడుతున్నా...
 రుణ బాధలు తీరక, కొత్త రుణాలు మంజూరుకాక, పంటకు పెట్టుబడి లేక రైతులు నరకయూతన పడుతున్నా టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగంటూ సీఎం చంద్రబాబునాయుడు రైతులను కష్టాల పాలచేశారు. ఇప్పుడు అదే రైతులకు మోసపూరిత హామీలిచ్చి అధికారం చేపట్టాక  మళ్లీ అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తున్నారు. రైతులను వంచించేందుకు వెనుకాడడంలేదు. నిరుద్యోగులను సైతం మోసపూరిత ప్రకటనలతో మాయ చేస్తున్నారు. ప్రజలంతా చైతన్యవంతులై గ్రామాల్లోకి వచ్చే అధికార పార్టీ నాయకులను నిలదీయూలి. ప్రజాపాలన వచ్చేలా తిరుగుబాటు చేయాలి.
 -ధర్మాన కృష్ణదాస్,
 మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ  బీసీసెల్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు
 
 పింఛన్లకూ కోత
 చంద్రబాబు అధికారం చేపట్టిన మూడు నెలలకే పింఛన్ దారులను వదిలించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కమిటీలను వేసి అర్హుల పింఛన్లను తొలగించారు. వారిని కష్టాల పాలచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఐదు నెలలువుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు.  దీంతో ఒక్కో సంఘంపై నాలుగు నెలల వడ్డీ భారం పడింది. రుణాలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. దీనిని మహిళలంతా గుర్తించాలి. మాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.  గ్రామాల్లోకి వచ్చే నాయకులను నిలదీయాలి. హామీల అమలయ్యేవరకు పోరాటం సాగించాలి.
 - రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
 
 ఉద్యమాలతో భయం పుట్టిస్తాం
 సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చేపట్టిన మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. భయం పుట్టిస్తాం. బాబు ఇచ్చిన హామీలు అమలయ్యేవరకు పోరాటం సాగిస్తాం. రుణాల మాఫీ కోసం రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు ఎంతో ఆత్రంగా చూస్తున్నా టీడీపీ నేతల్లో చలనం లేదు. ప్రజల కష్టాలు పట్టడం లేదు. ఏసీ కారుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని చెప్పిన బాబు రాష్ట్రంలో 13,800బెల్టు షాపులు నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. తుపాను సాయూన్ని కార్యకర్తలకు పంచుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఇలాంటి పాలనను ప్రజలెప్పుడూ చూసి ఉండరు.
 - కలమట వెంకటరమణ, వైఎస్సార్ సీపీ పాతపట్నం ఎమ్మెల్యే
 
 వివక్ష చూపుతున్నారు
 ఏజెన్సీ ప్రజల సంక్షేమం, మన్య ప్రాంత అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు వివక్ష చూపుతున్నారు. గిరిజనుల పింఛన్లను తొలగించారు. ఒక్క సీతంపేట మండలంలోనే 2000 పింఛన్లు తొలగించారు. రేషన్ కార్డులకు ఎసరు పెడుతున్నారు. మరోవైపు పంటలు నష్టపోయినా పట్టించుకోవడం లేదు. సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నారు. రైతులు అప్పుల్లో కూరుకుపోయినా సహాయం చేయడంలేదు. వీటిపై జనం తిరగబడాలి. నిలదీయూలి. వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా ఉంటుం ది. సమస్యలపై పోరాడుతుంది. ప్రజలకు అన్యాయం జరగకుండా పోరుబాటు నడుపుతుంది.
 - విశ్వాసరారుు కళావతి, వైఎస్సార్ సీపీ పాలకొండ ఎమ్మెల్యే
 
 మొదటి సంతకాన్నే మాఫీ చేశారు
 ప్రమాణ స్వీకారం చేసిన రోజున పెట్టిన మొదటి సంతకాన్ని మాఫీ చేసిన ఘనత చంద్రబాబుది. మోసపూరిత ప్రకటనలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో వాటిని అమలు చేయడం అంత సులభం కాదని అనడం సమంజసమా..? పేద వాడిని మోసం చేయడ ం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఏమర పాటుతో రైతన్నలు, మహిళలు ఓటేసి అధికారం కట్టబెట్టినందుకు పింఛన్‌లు తొలగిస్తున్నారు. బ్యాంకులకు వడ్డీలు కట్టమంటున్నారు. ఇదేమి న్యాయం.
 -తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు
 
 ఒక్క హామీ కూడా అమలుకాలేదు
 ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలుచేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్నా రు. ఇప్పుడు ఆదర్శరైతులను తొలగిం చారు. ఉపాధిహామీ ఫీల్డు అసింట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా రు. రైతులకు చిల్లి గవ్వ పరిహారం అందజేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. దీనిపై యువత, నిరుద్యోగులు, రైతులు తిరగబడాలి.
 -వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వరుదు కల్యాణి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement